డైలీ సీరియల్

ఒయాసిస్.. 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చిన్నదేమిటి? పెద్దదే తీసుకోండి.. మీతోనే నా బిజినెస్ బోణీ.. ఇంకేదన్నా.. కోరుకోండి..’’ అన్నది దీప్తి.
‘‘నీ గలగల నవ్వులు, నవ నవ యవ్వనాలు, లవలవ చనుదోయి.. చూస్తున్నాను.. దగ్గరనుంచీ.. ఇంతకన్నా ఇంకేం కోరుకోను..’’ అన్నాడు రణధీర్ చొరవగా.
దీప్తి అటూ ఇటూ చూసి ఎవరూ తమ వంక చూడటం లేదని గ్రహించి, రణధీర్ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా ముద్దుపెట్టుకుంది.
‘‘‘మీరంటే నాకు చచ్చేంత ఇష్టం.. మీకు చాలా రుణపడిపోతున్నాను..’’ అన్నది దీప్తి.
‘‘ఎవరికెవరు రుణపడిపోతున్నారో అప్పుడే ఎలా చెప్పగలం?’’ అన్నాడు రణధీర్.
‘‘నాకు పెద్దగా చదువు లేదు. ఏమంత తెలివితేటలూ లేవు.. అందచందాలు లేవు.. ఇవన్నీ నాకున్న లోటుపాట్లు.. వీటిని అధిగమించలేను. కానీ నేనూ ఏదో విధంగా పైకి రావాలి.. స్టేటస్ సంపాదించాలి. డబ్బు, మేడలు, కార్లూ, పనివాళ్లూ.. ఇవన్నీ సంపాదించాలని ఆశ.. కల.. పగలూ, రాత్రీ, కళ్లు తెరిచినా కళ్లు మూసినా ఒకటే యావ.. నాది అత్యాశ అంటారా?’’ అని అడిగింది దీప్తి.
‘‘ఎంతమాత్రం అత్యాశ కాదు. నీకున్న ఈ ఆరాటం, తపన, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్న ఆశయం, దేశ జనాభాలో కనీసం మూడో వంతు మందికున్నా.. దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పనా..
‘‘ఒక ఆకతాయి కుర్రాడు ఒక ధనవంతుడి ఎస్టేట్ చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడ ఎక్కి లోపలికి చూస్తుంటే వాచ్‌మన్ తరిమి కొట్టాడు. ‘పోరా, ఏదో ఒక రోజు ఈ ఎస్టేట్ నేనే కొంటాను’ అని పౌరుషంగా చెప్పి వెళ్లిపొయ్యాడు. నలభై ఏళ్లు గడిచిపొయ్యాయి. అతను క్షణం తీరిక లేనంత గొప్ప వ్యాపారస్థుడు అయ్యాడు. కానీ చిన్నప్పటిమాట మర్చిపోలేదు.
ఆ వూరు వచ్చి, ఆ ఎస్టేట్ కొని, దాన్నొక పార్క్‌గా తీర్చిదిద్ది ఆ ఊరి వాళ్ళకు కానుకగా ఇచ్చాడు. ఆ కుర్రాడి పేరు ఆండ్రూ కార్నెగీ.. ఆ పార్క్ పేరు పిటెన్ క్రీఫ్ పార్క్.. అందుచేత దృఢ సంకల్పం ఉంటే సాధించవచ్చు. అయితే ఇలాంటి గొప్ప వాళ్ళందర్నీ పరిశీలిస్తే, వాళ్ళ మనస్తత్వం మామూలు వాళ్ల మనస్తత్వంకన్నా భిన్నంగా వుంటుంది. రెండోది ఎవరేమనుకుంటారో అన్న భయం వాళ్ళకుండదు..’’ అన్నాడు రణధీర్.
‘‘్థంక్స్ అండీ.. ఇవన్నీ మీరు చెబుతుంటే నాకూ బోలెడంత ధైర్యం వస్తుంది..’’ అన్నది దీప్తి.
‘‘దీప్తి, నువ్వు చదువుకోలేదనీ, అంతగా అందం లేదనీ, గొప్ప తెలివితేటలు లేవనీ, బాధపడాల్సిన పనిలేదు.. నువ్వు ఏవి లేవని బాధపడుతున్నావో, ఒక రకంగా అవి దేవుడు నీకిచ్చిన వరాలు అని అనుకో. డాక్టర్ శే్వత బాగా చదువుకుంది. ఎంతోమంది శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగలదు. అందం విషయంలో, ఆకర్షణ విషయంలో ఆమెది స్టన్నింగ్ బ్యూటీ.. ఆర్థిక సంబంధాల విషయానికొస్తే, రోజు రోజుకీ ఆదాయం పెరిగిపోతూండే ప్రొఫెషన్.. కానీ ఇన్ని తెలివితేటలూ, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న శే్వత ఇంత చిన్న వయసులో అతి దారుణంగా హత్యకు గురైంది. ఎందుకు చెబుతూన్నానంటే, నువ్వు నీలో ఏవి లోపాలని అనుకుంటున్నావో, ఆవే ఆమెకు శాపాలైనాయి. అకాల మృత్యువుకు కారణాలైనాయి..’’
దీప్తి ఆయన చెప్పిన విషయాలను సీరియస్‌గా ఆలోచిస్తోంది. అవన్నీ అక్షర సత్యాలుగానే కనిపించాయి.
‘‘ప్రపంచాన్ని బాహ్య నేత్రంతోనేగాక, అంతర్నేత్రంతో చూడటం నేర్చుకో. ఇది అభ్యాసంలో వస్తుంది. ఎదుటివాడ్ని నువు చూసే దృక్పథాన్ని బట్టి, వాడ్ని నువ్వు అంచనా వేసుకుంటావు. ఏదో జరిగిపోతోందని ఒకడు ఊరికే భయపడిపోతాడు. జరగనీ, అదీ మన మంచికే అని మరొకడు ధైర్యంగా నిలబడతాడు.. ఒక రోజు గడిచిపోయిందని ఒకడు బాధపడతాడు. మరొక రోజు వచ్చిందనీ మరొకడు సంతోషిస్తాడు.. జీవితంలో క్లర్క్‌గా నీకో అధ్యాయం పూర్తయింది. ఆ ఉద్యోగం పోయిందని బాధపడొద్దు.. అది పోయింది కాబట్టే, మరో మంచి పోస్టుకు ప్రయత్నించావు.. దాన్ని సంపాదించానని ఇప్పుడు సంతోషంగా ఉన్నావు..’’ అన్నాడు రణధీర్.
‘‘అవునండి.. మీరు చాలా బాగా విశే్లషించి చెబుతారు.. ఒకరిని వదలించుకుని, దూరం అయినా, మరొకరు దగ్గరవుతున్నారు..’’ అన్నది దీప్తి.. ఏదో చెప్పబోయి ఆగిపోయింది.
‘‘ఎవరిని వదిలించుకున్నావు? ఎవరిని తగిలించుకున్నావు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఒక ఫ్రెండ్‌తో చిన్న క్లాష్ వచ్చింది.. విడిపోయాం.. మీరు తగిలారు..’’ అన్నది నవ్వుతూ. ‘‘రెండూ ఒకటే గదా?’’ అన్నది దీప్తి కళ్ళు టపటపలాడిస్తూ.
‘‘ఎలా అవుతాయి? ఉదాహరణకి నేను నిన్ను తగులుకోవాలనుకున్నాను.. నీకిష్టం లేదనుకో. నేను పలకరించినా, వినపడనట్లు వెళ్లిపోతావు.. లేదా సమాధానం చెప్పి, సంభాషణ అంతటితో ఆపేస్తావు.. నేనయినా అంతే.. నీ నుంచి ఒకటి ఆశించి దగ్గరవుతున్నాను.. నువ్వు మరొకటి ఆశించి దగ్గరవుతున్నావు..’’ అన్నాడు రణధీర్.
‘‘మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు?’’ అని అడిగింది ఆసక్తిగా రణధీర్ వైపు జరిగి.
‘‘నీ వదనం, నీ నయనం, నీ అధరం.. నీ..’’ నవ్వాడు. ‘‘నాకన్నా అందగత్తెలు లేరా?’’
‘‘లేరని అనలేదు.. నా కళ్లతో చూడమంటున్నాను.. ఇందాక చెప్పింది అదే.. అంతర్నేత్రంతో చూడాలనుకున్నాను..’’
‘‘ఏ నేత్రంతో చూసినా, అందం అదే గదా..’’ కానీ నాకు లభించని దాని గురించి నేనెందుకు ఆరాటపడాలి... దొరికినదానితో సంతృప్తిపడాలి..’’
‘‘అంటే? నాకు అంతగా క్లారిటీ రావటంలేదు..’’

- ఇంకా ఉంది

శ్రీధర