డైలీ సీరియల్

వినయమే విజయానికి మార్గం (పరశురాముడు - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాని వల్ల మనవంశాలే కాక లోకకల్యాణం కూడా జరుగుతుందని చెప్పాడు. తాతగారు చెప్పినట్లే పరశురాముడు హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు. పరశురాముడిని పరీక్షించాలని శివుడు వ్యాధుడిగా వచ్చాడు. పరశురాముడితో గట్టిగా మాట్లాడుతూ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని? కళ్లుమూసుకొని ఏం చేస్తున్నావని అడిగాడు? కానీ పరశురాముడు మాత్రం ఎంతో వినయంగా సమాధానం ఇచ్చాడు. అయినా కూడా ఆ వ్యాధుడు తాను కూడా ఇక్కడే తపస్సు చేస్తానని అక్కడే కూర్చున్నాడు. కానీ ఊరికినే విసిగిస్తూ సహనాన్ని పరీక్షిస్తుంటే పరశురాముడు మాత్రం ఎంతో సహనంతో నీవు కూడా తపస్సు చేయవచ్చు. కాస్త దూరంగా కూర్చుని తపస్సు చేయుము అని చెప్పాడు. కాని వ్యాధుడు పరశురామునితో వాదానికి దిగాడు. అతడు చేస్తున్న వాదనను విని నీవు మారువేషంలో ఉన్న గొప్పవానివి అయి ఉంటావని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అపుడు పరశురాముని వినయానికి, సహనానికి శివుడు మెచ్చుకుని ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడు. రౌద్రాస్తము కావాలని పరశురాముడు కోరుకున్నాడు. దానికి పరమశివుడు నీవు ఇంకనూ బాలకుడవే. రౌద్రాస్త్రాన్ని భరించగల శక్తి నీకు రాలేదు. నీవు తపస్సు మాని , కొంతకాలం తీర్థయాత్రలు చేసిరమ్ము ఆ తరువాత తిరిగి తపస్సు చేయమని చెప్పాడు. పరమశివుని మాటలు విని పరశురాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు.
కొన్నాళ్లకు దేవదానవులు యుద్ధం చేయసాగారు. అపుడు రాక్షసుల ధాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకు పారిపోయారు. రాక్షసులు అమరావతిని ముట్టడిని చేశారు. దేవతలంతా కలసి తమకు వచ్చిన ఉపద్రవాన్ని శివుడికి చెప్పి తమను కాపాడమని వేడుకున్నారు.
అపుడు పరమశివుడు పరశురాముడిని పిలిచి నీవు అమరావతికి వెళ్లి దాన్ని ఆక్రమించుకున్న రాక్షసులను పారద్రోలమని చెప్పాడు. పరశురాముడు అట్లే చేస్తాను గానీ వారు మహాబలవంతులు కదా. నేనెలా వారిని ఎదురించగలను అని అడిగాడు. అపుడు పరమశివుడు చిరునవ్వుతో ‘పరశువు’అనే అస్త్రాన్ని పరశురాముడికి ఇచ్చాడు. దానితో వెళ్లి అమరావతిని ఆక్రమించుకున్న రాక్షసులను తరిమివేసి ఆ నగరాన్ని తిరిగి దేవతలకు పరశురాముడు అప్పజెప్పాడు. తిరిగి పరమశివుని ఆజ్ఞ ప్రకారం తీర్థయాత్రలకు వెళ్లాడు..
ఒకరోజు రేణుకాదేవి సముద్రస్నానానికి వెళ్లి కాస్త ఆలస్యంగా వచ్చింది. ఆ సముద్రంలో గంధర్వులెవరో జలకాలాడుతూ ఉంటే వారిని చూస్తూ రేణుక ఆశ్రమానికి రావడంలో జాగు చేసింది. దానితో జమదగ్ని కోపం తెచ్చుకున్నాడు. తన కుమారులను పిలిచి వారి తల్లి తల నరికివేయమని చెప్పాడు. వారంతా తల్లిని చంపడం మహాపాపమని తండ్రిమాటను వినలేదు. కాని వారిలో పరశురాముడు ముందుకు వచ్చి తండ్రి ఆనతిని నేను పాటిస్తాను అన్నాడు. జమదగ్ని వెంటనే‘నీ తల్లి తలను నరికివేయుము’ అని ఆజ్ఞాపించాడు.
పరశురాముడు తన తల్లి తలను గొడ్డలితో నరికివేశాడు. తండ్రి దగ్గరకు వచ్చి మీరు చెప్పిన పనిని చేసేశాను అని చెప్పాడు. తండ్రి మాటను జవదాటని కొడుకును మెచ్చుకుని ‘నీకు ఏమి వరం కావాలో కోరుకో’అని జమదగ్ని అడిగాడు.
‘నా తల్లిని బతికించుము తండ్రీ’అని పరశురాముడు కోరుకున్నాడు. జమదగ్ని సంతోషంతో రేణుకాదేవిని మంత్ర జలాన్ని చల్లి తిరిగి జీవింప చేశాడు. అందరూ సంతోషించారు.
***
కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని గూర్చి మహాతపస్సు చేసి ఆ సద్గురువైన దత్తుని అనుగ్రహాన్ని పొందాడు. శత్రు విజయము, వేయి చేతులు అన్నింటా జయము, అణిమాది సిద్ధులను అనే వరాలను దత్తాత్రేయుని వల్ల కార్తవీర్యార్జునుడు పొందాడు. గురు అనుగ్రహాన్ని చూసుకొని గర్వాన్ని పెంచుకున్నాడు. ఒకసారి రైవానదిలో తన దేవేరులతో నదీజలాల్లో క్రీడిస్తుండగా అక్కడికి జైత్రయాత్రకోసం రావణుడు వచ్చాడు. తన చేతులను పెంచి ఆ రైవానది జలాలను కట్టడి చేశాడు. కార్తవీర్యార్జునుడి చేతుల్లో రైవానదీ జలాలతోపాటుగా రావణాసురుడు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. దానితో కోపం తెచ్చుకుని కార్తవీర్యార్జునుడితో పోరుకు దిగాడు. కార్తవీర్యార్జునుడు రావణాసురుని జుట్టు పట్టుకుని మోకాళ్లతో పొడిచి తన భటులతో చెప్పి కట్టిపడేసి మాహిష్మతీ పురానికి చేర్చమని తన భటులకు చెప్పాడు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి