డైలీ సీరియల్

విలువల లోగిలి-73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సంసారం చెయ్యలా, సంసారం చక్కబెట్టింది’’
‘‘ఇలాగే నన్ను మాట్లాడనీయవు’’
‘‘ఎందుకు మాట్లాడనివ్వను? పోనీ మనమే ‘ఆడ దేవదాసు’ అని సినిమా తీద్దాం. ఏమంటావ్?’’
‘‘అప్పుడు గానీ మనం బిచ్చగాళ్ళం అవం’’
‘‘అంతేనంటావా?’’
అంతటితో ఆగిపోదు. అడుక్కోవటం మనకు ఇష్టముండదు కదా. అందుకని వృద్ధాశ్రమాలనో, ముసలోళ్ళం కాకుంటే ఏ ఆర్ఫేడు ఆశ్రమమో చూసుకోవాలి’’’
‘‘వద్దులే! మరీ అంత దూరం వెళ్ళకులే’’
‘‘విశ్వా! చాన్నాళ్ళయింది నీతో ఇలా హాయిగా మాట్లాడి’’
‘‘చాన్నాళ్ళా! నాలుగు రోజులు కూడా కాలేదు’’
‘‘నాకయితే నాలుగు యుగాలు అయినట్లుంది’’
‘‘నీకలా అనిపించదు కదూ’’ అన్నాడు మళ్లీ.
‘‘ఎందుకుండదు చందూ?’’
‘‘ఎందుకు అబద్ధం చెబుతావ్? నీ ధ్యాసంతా పరోపకారం మీదే ఉంటుందని నాకు తెలుసు’’
‘‘అలా అనుకోకు. దేని దారి దానిదే. నేను నీ దగ్గర ఉంటే నీ గురించే ఆలోచిస్తాను’’
‘‘నేను ఎక్కడ ఉన్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను’’
‘‘ఉండు. మామయ్యని పిలుస్తాను. కంపెనీని ఎలా చూసుకుంటున్నావని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెబుతావో నేను వినాలి’’
‘‘అలా మా తండ్రీ కొడుకులిద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తావా?’’
‘‘మరి ఏంటనుకున్నావ్?’’
‘‘మాది పచ్చని కాపురం. దాన్నలాగే పచ్చగా ఉండనీ’’
‘‘మరి అలా దారికి రా’’
‘‘నిన్ను అనగలిగే ధైర్యమా?’’’
‘‘అబ్బా! ఇప్పటిదాకా అన్నీ అనేసి, ఇపుడు నంగనాచిలా..’
‘‘అది ఆడవాళ్ళనుకుంటా’’
‘‘ఏమో నాకు తెలియదు. అనాలనిపించింది. అనేసా’’ అంతే.
‘‘విశ్వా! నీకు ఫోను’’ అత్తయ్య పిలుపుతో.
‘‘వస్తున్నా అత్తయ్యా’’అంటూ అటు వైపు పరుగెత్తింది.
‘‘హలో?’’
‘‘ఆ! హలో! నేను కమలా రామన్‌ను మాట్లాడుతున్నాను’’
‘‘బాగున్నారా? మళ్లీ మీకు ఫోను చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నానో. కానీ చెయ్యలేదనుకోండి’’.
‘‘నాదీ అదే తంతు. ఇలాంటివి చెప్పుకోనక్కర్లేదు’’
‘‘మొన్న మా ప్రారంభోత్సవానికి రాలేదు’’
‘‘ఊర్లో లేను విశ్వా. లేకపోతే తప్పక వచ్చేదాన్ని. టీవీలో చూసానులే. ఏదైనా అనుకుంటే నువ్వు సాధించగలవు’’
‘‘మీకన్నానా?’’
‘‘‘అన్నట్లు అసలు నేనెందుకు ఫోన్ చేసానో తెలుసా?’’
‘‘దేనికి?’’
‘‘ఈ రోజు నువ్వు రాయమన్న ‘‘యువతా! నీ పయనం ఎటు?’’ ఆవిష్కరణ. నువ్వు తప్పకుండా రావాలి. 5 గం.లకు లలితకళాతోరణం తెలుసుగా.
‘‘ఆ! తెలుసు. అప్పుడే రాసెయ్యటం. ప్రింటింగ్ కూడా అయిపోయిందా’’
‘‘నీ ఇన్‌స్పిరేషన్ మామూలుదా ఏమిటి? ఒక ప్రక్క రాస్తుంటే ఒక ప్రక్క ప్రింటింగ్ అయిపోయింది’’
‘‘ఏ పత్రికలోనయినా సీరియల్‌గా ఇచ్చి ఉంటే బాగుండేది కదండీ’’
‘‘అవుననుకో. మనం ప్రజలలో మార్పు కావాలనుకున్నాంగా. అలా వారం వారం వేస్తే ఎప్పటికి అవుతుంది? నన్ను కొందరు అడిగారు అలా ఇవ్వమని. నిన్ను దృష్టిలో పెట్టుకునే ఇవ్వలేదు’’
‘‘నాకంత ప్రాముఖ్యతా?’’
‘‘నీకూ, నీ మాటకు కూడా’’
‘‘వస్తావుగా తప్పకుండా’’
‘‘వస్తాను చందూని తీసుకుని’’
‘‘వస్తానంటే అత్తయ్యని, మామయ్యని కూడా తీసుకురా’’
‘‘ష్యూర్! ష్యూర్’’
‘‘‘మరి ఉండనా. చాలామందిని పిలవాలి’’’
‘‘సరే. కలుద్దాం’’ అంది ఉత్సాహంగా.
ఠంచనుగా అయిదు గంటలకు విశ్వ, చందూ లలితకళాతోరణం ముందున్నారు. ఇండియన్ పంక్చ్యుయాలిటీని మెయిన్‌టెయిన్ చేస్తూ.
కమలారామన్ ఎదురు వచ్చి రమ్మని వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి సీట్స్‌లో కూర్చోపెట్టింది.
అక్కడ ఇంకో షాక్ ఏమిటంటే ఆ పుస్తకాన్ని విశ్వకే అంకితం ఇవ్వటం.
ఆవిష్కరణ ముందే విశ్వవల్లే తానా నవలని రాసానని, అందుకే ఆమెకే అంకితం ఇస్తున్నానని, విశ్వను స్టేజీమీదకు పిలిచి శాలువా కప్పి ఆ నవలని అంకితమిచ్చింది.
విశ్వకయితే నోట మాట రాలేదు.
ఆమె తనకింత గౌరవం ఇస్తుందని అనుకోలేదు.
ఆమె మంచి పుస్తకాలు రాయటమే కాదు మంచి మనిషి కూడా అనుకుంది. ఆ కార్యక్రమం అయిపోయాక ఆవిడకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేసారు.
ఆ రాత్రే నిద్రపోకుండా ఆ నవలను చదివేసింది విశ్వ. చాలా బాగుంది. యువతకి బాగా నచ్చుతుంది. ఆవిడ చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పగలిగారు. తాను ఎలా ఉండాలనుకుందో అలానే ఉందా నవల.
అర్ధరాత్రి ఆవిడ ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. వెంటనే ఫోను చేసి తన అనిప్రాయం చెప్పేసింది.
‘‘్థంక్యూ విశ్వా! నువ్వే నా ఫస్ట్ రీడర్‌వి’’ అందావిడ సంతోషంగా.
‘‘అందుకే ఈ టైమ్‌లోనా అనుకోకుండా చేసేసాను’’ ‘‘మంచి పనిచేసావు. ఇలాంటివి వినటానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాము’’ తనతోపాటు రచయితలందరనూ కలిపేస్తూ.
‘‘నేనో 100కాపీలు తీసుకుంటాను. మా పిల్లలకి ఏదైనా పోటీ పెట్టి బహుమతిగా పంచి పెడతాను’’.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206