డైలీ సీరియల్

అన్నింటికీ సాక్షి అంతరంగమే ( పరశురాముడు -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత మాహీష్మతీ పురానికి కార్తవీర్యార్జునుడు వచ్చి రావణాసురునితో ‘నీవు వీరాధి వీరుడని విర్రవీగకు. ఒక్కసారి కనుక నీ తప్పు కాచాను. వెళ్లు ఇక్కడ నుంచి ’అని గట్టిగా మందలించి రావణుడిని పంపించివేశాడు.
మరికొన్నాళ్లకు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లాడు. రోజంతా వేటలో అలసి పోయి జమదగ్ని ఆశ్రమానికి సేద తీరుదామని వచ్చాడు.
మహారాజు వచ్చాడని జమదగ్ని అతడికి ఆసనం ఇచ్చి కూర్చోండ చేశాడు. కార్తవీర్యార్జునుడు, అతని పరివారమూ ఆకలి తో ఉన్నారని గ్రహించి మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువును పిలిచి వారికి షడ్రసోపేతమైన భోజనాన్ని ఇవ్వమని చెప్పాడు. కామథేనువు మహర్షి మాటలను మన్నించి అప్సరసలను సృష్టించి కార్తవీర్యునకు, వారి పరివారానికి కూడా మంచి భోజనాన్ని పెట్టి వారి ఆకలి దప్పులను తీర్చింది. రాజు అతనితో పాటు ఉన్నవారంతా చాలా సంతోషించారు.
కార్తవీర్యార్జునుడు మాత్రం ఇతడు కేవలం మంచినీరు తప్ప ఏమీ ఇవ్వలేని బడుగు బాపడు అనుకొన్నాను. కానీ ఇంతమందికి మంచి విందు ఏర్పాటు చేశాడు ఇది ఎలా జరిగింది అని ఆలోచించా కామధేనువు వల్ల నే జమదగ్ని గొప్పస్థితిమంతుడు అయ్యాడని తెలుసుకొన్నాడు.
వెంటనే తనకు కామథేనువును ఇవ్వమని జమదగ్నిని కోరుకున్నాడు. కాని జమదగ్ని తనకు యజ్ఞాలు, యాగాలు, అతిథి సేవ చేయడానికి ఈ గోవు ఎంతో అవసరమని చెప్పి కామధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు.
దానితో కోపం తెచ్చుకున్న కార్తవీర్యార్జునుడు జమదగ్నిని పై మండిపడి తన దగ్గర ఉన్న ఖడ్గంతో జమదగ్ని తలను నరికివేసి వెళ్లిపోయాడు. ఆ సంగతిని చూసిన రేణుకా దేవి ఎలుగెత్తి పరశురాముడిని పిలుస్తూ తన భర్తశవంపైన పడి ఏడుస్తూ ఉండిపోయింది.
ఆ సమయంలో పరశురాముడు కొన్నాళ్లు తన తాత దగ్గర ఉండాలని ఋచీకుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ నుంచి భృగు మహర్షిని దర్శించాలన్న కోరికతో అక్కడికి బయలుదేరాడు. మార్గమథ్యలో ఒక బాలుడిని ఒక సింహం పైబడి చంపేయబోతుండడం చూసి పరశురాముడు ఆ సింహం పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే సింహం పడిపోయి ఆ సింహమే గంధర్వరూపాన్ని పొంది తనకు శాప విమోచనం జరిగిందని చెప్పి పరశురామునకు నమస్కరించి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ బాలుడే శాంతుడను ముని కుమారుడు పేరు అకృత వర్ణుడు. ఇతడు పరశురామునికి అప్పటి నుంచి శిష్యుడై ఉండిపోయాడు. వారిద్దరూ మంచి మిత్రులుగా కూడా ఉన్నారు. అట్లా అకృత వర్ణుడు, పరశురాముడు భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడున్న సమయంలోనే అతని హృదయం భారంగా మారింది. మనస్సు కీడును శంకించింది. పరశురాముడు జరగకూడదని జరిగింది అదేమిటో తెలుసుకోవాలని తండ్రియైన జమదగ్నిరేణుక ల దగ్గరకు వచ్చాడు.
కానీ అక్కడికి వచ్చేసరికి జమదగ్ని తల తెగి పడి ఉండడం రేణుక ఏడ్వడం చూసి ఓర్చుకోలేక ఇది ఎలా జరిగిందని దీనికి కారణం ఎవరు అని తల్లిని అడిగాడు. రేణుకాదేవి కార్తవీర్యార్జునుడు చేసిన ఘోరాన్ని చెప్పింది.పరశురాముడు ఉగ్రమూర్తియై ‘‘తల్లీ నేను 21 మార్లు దండెత్తి కొవ్వెక్కి ఉన్న క్షత్రియులను మట్టుపెడతాను. నీవు చింతించవలదు’అని చెప్పాడు. అపుడే అక్కడికి విషయం తెలుసుకొని భృగుమహర్షి కూడా వచ్చాడు. జమదగ్ని పైన ఆయన కలశంలోని మంత్రపూరిత జలాన్ని చల్లి జమదగ్నిని తిరిగి బతికించాడు. అపుడూ అందరూ సంతోషించారు. పరశురాముడు చేసిన ప్రతిజ్ఞను తన తండ్రికి చెప్పాడు. అపుడు బ్రాహ్మణులకు కోపం పనికిరాదని వారిని క్షమించి వదలివేయమని ప్రతిజ్ఞను ఉపసంహరించుకోమని చెప్పాడు. అట్లాకాదని పరశురాముడు చెప్పగా జమదగ్ని పరశురామునితో నీ ప్రతిజ్ఞ నెరవేరాలంటే నీకున్న శక్తి చాలదు.నీవు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయమని చెప్పాడు.
పరశురాముడు బ్రహ్మ దగ్గర కూడా శివుని తపస్సు చేయమనే ఆజ్ఞను పొంది హిమాలయాలకు బయలుదేరాడు. దారిలో సంధ్యాసమయం అయిందని ఒక కొలనులో స్నానసంధ్యలకోసం ఆగాడు. ఆయన స్నానం చేస్తుండగా అక్కడికి రెండు జింకలు వేటగాడు తరుముతున్నట్లు వేగంగా వచ్చి ఆ కొలను దూరాయి. అవి మనుష్య భాషలో ఇక మనకు భయం లేదు. ఇక్కడ పరశురాముడు జపం చేస్తున్నాడు. ఇతడు పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేయాలనుకొంటున్నాడు. కానీ ఇతడు కృష్ణ కవచం వింటే కాని తపస్సు చేయలేడు కదా.

- డా. రాయసం లక్ష్మి. 9703344804