డైలీ సీరియల్

చెప్పని విషయాలను చెప్పేవి చేతలే! ( రుక్మిణి - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రమందారాన్ని కోయబోతున్న చేతులను చూసి, ఎర్రమందారం నేనే బాలబానుడిని అనుకరిస్తున్నానుకొంటుంటే ఈ ఎర్రదనమేమిటి నన్ను మించిన వనె్న కలిగి ఉందని విచ్చుకోబోతున్న మందారం మరింతగా వికసించింది. కనుమరుగు అవబోతున్న నెలవంక ఇక్కడ కుదురుకుందా అన్నట్టుంది ఆమె నుదురు. సూర్యునితో మరోసూర్యబింబం వచ్చిందాన్నట్లుంది ఆ నుదురుమీద తిలకం బొట్టు. ఆమె కనుగొమ్మలు మన్మథుని వింటిని పోలి ఉన్నాయి. ఆమె ఏమి ఆలోచిస్తోందో కాని మందారాలన్నీ ఆమె చేతిలో ఒదిగిపోవాలని మరింతగా వికసిస్తూ ముందుకు వస్తున్నాయి.
అంతలో‘‘ రుక్కూ మగపెళ్లి వారు వచ్చేశారు. ఆడపెళ్లి వారు ఏం చేస్తున్నారు అంటూ హడావుడి పడుతున్నారు ’’ ‘ త్వరగా రావాలమ్మా మీరు ’ అంటూ ఓ చెలికత్తె హడావుడిగా వచ్చింది.
‘అవునా పద పద అసలే వారు వియ్యాల వారు. వారికి తగిన మర్యాదలు జరపాల్సిందే సుమా ’అంటూ విదర్భ దేశాధీశుని కుమార్తె రుక్మిణి ఆ చెలికత్తెతో బయలుదేరింది.
మండపంలో చక్కని వేదికను నిర్మించి బొమ్మలన్నింటికీ మంచి వస్త్రాలను కట్టబెట్టి బొమ్మల పెండ్లిడ్లకు రుక్మిణీ ఈడువారంతా చాలా హుషారుగా పనులు చేస్తున్నారు. ‘అమ్మాయిల్లారా పెళ్లి కూతురుని చక్కగా అలంకరించండి. మగ పెళ్లివారు వచ్చేశారు. మేము వారికి ఆహ్వానాలు పలుకుతాము. మీరంతా త్వరగా వేదికను అలంకరించండి.
విప్రులు విచ్చేశారు. అమ్మాయి చేత గౌరీ పూజ త్వరగా చేయించండి’ అని గబగబా చెప్పి తన పట్టుపరికిణీ సవరించుకుంటూ ముందుకు వెళ్లింది ఆ రుక్మిణి యువరాణి.ఆమె వెంటనే చెలికత్తెలు అడుగుల్లో అడుగులు కలుపుతూ ముందుకు వెళ్తున్నారు.
అట్లా బొమ్మల పెండ్లిండ్లు చేస్తూ, గౌరమ్మను కొలుస్తూ, తల్లిదండ్రలు తన అన్నదమ్ములూ అందరూ మెచ్చుకునేట్టుగా తనకు కాబోయే మగడు రాబోయే పెళ్లికుమారుడు ఎలా ఉంటాడో ఊహించుకొంటూ బొమ్మల పెళ్లిళ్లు చేసే రుక్మిణిని చూసి భీష్మకుడు నా తల్లికి చక్కని సైదోడు ఆ మధురానగర నివాసి, ఆ గోపబాలకుల మనస్సులను దోచిన పిల్లవాడు ఆ గోపాల బాలుడే అనుకొన్నాడు. రుక్మి, రుక్మనాథుడు, రుక్మబాహువు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు అనే ఐదుగురు కొడుకులూ తండ్రి దగ్గరకు వచ్చి ‘తండ్రీ! ఇలా చెల్లిని చూసి మురిసి పోతుంటారా.. లేక చెల్లికి తగిన వరుని తెచ్చి పెండ్లి చేయాలన్న ఆలోచన చేస్తున్నారా లేదా. ఇక మన చెల్లి బావగారికోసం ఎదురుచూస్తున్నానని చెప్పలేక ఈ బొమ్మల పెండ్లిడ్లు చేస్తోంది. తనకూ వివాహం చేయమని మనలను ప్రోత్సహిస్తోంది’ అన్నారు.
‘నిజమే నా తల్లి మహాలక్ష్మికళతో సర్వ సంపద్విశేషగుణాలతో ఒప్పారుతోంది. ఈ ఒప్పుల కుప్పను చేపట్టే అదృష్టవంతుడెవరో! వానిని చూడమని మన పురోహితులకు చెప్దాం’ అన్నాడు భీష్మక మహారాజు.
‘తండ్రీ ఇంకా వెదకడం ఎందుకు? మన అమ్మాయికి సరిజోడు ఆ నంద నందునుడే. వారిద్దరూ లక్ష్మీనారాయణులవలె ఈడు జోడు వారిరువురికీ బాగుంటుంది. మీరు ఆలస్యం చేయక ఇక ఆ వసుదేవునికి వర్తమానం పంపండి’ అన్నాడు రుక్మరథుడు.
అప్పటిదాకా తుఫాను ముందర ప్రశాంతత ఉన్నట్టుగా ఉన్న రుక్మి ఉన్నట్టుండి ఉరుము వలె విరుచుకుపడ్డాడు తన సోదరులపైన. ‘మీకు ఏమైనా బుద్ధి తక్కువ అయిందా? మీకు ఆ వెన్నదొంగ తప్ప మరెవరూ మన సోదరికి తగిన వాడుగా కనిపించలేదా? అసలు వాడు పుట్టిన దెక్కడ? పెరిగిందెక్కడ? ఆ గోపాలురతో కలసి ఆవులను మేపుకునేవాడా నా సోదరికి మగడు నేనెంత మాత్రం ఒప్పుకోను కాక ఒప్పుకోను’అని వీరావేశంతో మాట్లాడి అక్కడ నుండి వెళ్లిపోయాడు రుక్మి.
రుక్మిమాటలకు తక్కిన సోదరులతో పాటుగా తండ్రియైన భీష్మకుడు కూడా చాలా బాధపడ్డాడు. ఇదేమి ఇంత చిత్రం. ఎప్పటినుంచో ఆ దేవకీ సుతునకేగా మనం మన అమ్మాయిని ఇవ్వాలనుకొంటున్నాము.
రుక్మికి ఈ సంగతి తెలియనిదా ఇపుడు ఎందుకిలా మాట్లాడాడు. వీని బుర్రలో తొలిచిన పురుగేమిటి అని ఆలోచనలో పడ్డాడు.
ఈ మాటలు విన్న ఓ విరిబోణి గబగబా వెళ్లి గుజ్జన గూళ్లు ఆడుకుంటూ కృష్ణ విగ్రహానికి కబుర్లు చెప్పే రుక్మిణికి చేరవేసింది ఒక చెలికత్తె.
ఆ మాటలు విన్నవెంటనే రుక్మిణి హతాశురాలైంది. నోట మాట రాలేదు. ఇది ఏమి నా మనసులో వారుకాక మరెవరినో నాకు వరుడిగా తేవాలన్న ఆలోచన రుక్మికి వచ్చిందా?
ఇదేమి చిత్రం. నా భవిష్యత్తు ఏవౌతుందో ని ఆ ఒక్కింత లోనే అరుణారుణ కాంతులను విరజిమ్మే ముఖార విందం నల్లని కారుచీకట్లు కమ్ముకొన్న నభోమండలంలాగా చిన్నబోయింది.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి