డైలీ సీరియల్

సహవాసంతో వాసనాబలం వృద్ధి (రుక్మిణి - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యో ఎందుకు చెప్పానా ఈ విషయం అని ఆ చెలికత్తె మాట రాక ఉండిపోయింది.
‘అమ్మా రుక్మిణీ దేవీ ఎందుకంత విచారం ? మీరోమాట ఆ కృష్ణయ్యకు చెబితే సరిపోతుంది కదా. ఇక ఆ కృష్ణుడే వచ్చి రుక్మి ని మూలన కూర్చోబెట్టి మీ చేతిని అందుకుని ప్రాణిగ్రహణం చేసుకొని వెళ్తాడు కదా. దీనికే ఇంత విచారం వ్యక్తంచేయాలా.. ఆ చిలుక చూడండి. మీరు చిన్నబోయారని తన ముందున్న దానిమ్మ గింజలను తోసివేసింది.’అంది మరో చేలియ.
రుక్మిణి కన్నుల్లో నీరు తిరుగుతుండగా గిర్రున వెళ్లి తన పర్యంకంపై పడిపోయింది. ఆమె చింత చూసి చెలికత్తెలందరూ ఏం చేయాలో తోచక వీవనలతో విసురుతూ ఉన్నారు. ముఖాన్ని దిండులో గుచ్చి మరీ తన కన్నీళ్లను మరుగు చేస్తోంది రుక్మిణి.
***
భీష్మక మహారాజు అంతఃపురానికి వెళ్లాడు. అక్కడ మహారాణి మహావిష్ణువు పూజలు చేస్తోంది. మల్లెలతో ఆ విష్ణువుకు అలంకారం చేసి స్తోత్రాదులను చదువుతోంది.
మహారాజు విచ్చేశారని తన మది చెప్పగా మహారాణి దేవర పూజ ముగించుకుని పతి సేవకు వచ్చింది.
‘మహారాజుగారు ఏదో పరాకుగా ఉన్నారే.. ఇదుగో మన కుమార్తె వివాహం అంగరంగ వైభోగంగా చేయాలని ఆ మహావిష్ణువును కోరుకుంటున్నాను. అంతలో మీరు విచ్చేశారు’అంది మహారాణి.
‘ఆఁ అదే..’ అన్నాడు నిరాసక్తంగా మహారాజు.
‘ఏమిటో ఆ విచారమెందుకో మాతో చెప్పితే ఏదైనా విచార భారం ఉపశమిస్తుంది కదా’ అంది మహారాణి.
‘ఏం చెప్పమంటావు మహారాణి! మన రుక్మి మనకు తలవంపులే కాదు.. మనకు దుఃఖకారణుడు అయ్యేటట్టుగా కనిపిస్తున్నాడు’ అన్నాడు మహారాజు.
‘రుక్మినా’అంది మహారాణి.
‘అవును. నేను మన చిన్ని తల్లిని ఆ దేవకీవసుదేవుల కుమారులకిద్దామన్న తలంపును తనయులతో పంచుకున్నాను. వారంతా అంగీకారయోగ్యంగానే కనిపించారు నిన్నటి దాకా. నేడు రుక్మి ఆ నందనందునుడిని తూలనాడాడు. వానికా మన అమ్మాయిని ఇచ్చేది? అని అంటున్నాడు. వీని మనసున ఏమున్నది ఎవరు వీని మనసును చెడగొడుతున్నది. మన అమ్మాయి మనసులో కూడా ఆ కృష్ణుడినే నమ్ముకొంటోందని నేను చెలికత్తెల ద్వారా తెలుసుకొన్నాను. ఈ మాట వింటే చిన్నతల్లి ఎంతగా బాధపడుతుంది నాకు ఏం చేయాలో తోచకున్నది’ అన్నాడు మహారాజు.
ఆ మాటలకు మహారాణి వదనమూ మూగపోయింది. నిజమే రుక్మి ఈమధ్య జరాసంధునితో స్నేహం చేస్తున్నాడని విన్నాను. జరాసంధుడు మహా రాక్షసుడు అమిత క్రోధుడు. వానితో వీనికి సఖ్యమేమిటో అని మనసున తల్చుకుంటూనే మహారాజుకు తన మాటలను చేరవేసింది మహారాణి. ఇద్దరూ ఖిన్నులై కూర్చున్నారు.
గోపబామలతో సరసాలు ఆడుతున్న గోపాలుడు ఉన్నట్టుండి వౌనంగా కూర్చున్నాడు. వేణువు చేతిలో ఉన్నా దాని వంక చూడడం లేదు. ఎందుకో చిరునవ్వుతో కళకళలాడే ఆయన ముఖం చిన్నబోయింది. ‘‘చిన్మయునికే చింతనా’’ అని అక్కడ్నుంచి వెళ్లే నారదుడు అనుకొన్నాడు. తటాలున శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చేశాడు.
నారాయణ నారాయణ అంటూ తన దగ్గరకు వస్తున్న నారదుని చూస్తూ కూడా కన్నయ్య ఉలకకుండా పలకకుండా కూర్చున్నాడు. దగ్గర దాకా వచ్చి ‘‘కృష్ణా! ఇంతగా ఆలోచించాల్సిన పనిలేదువయ్యా.. నీ పై వలపు పెంచుకున్న వనిత నిన్ను కాదని ఎక్కడకు వెళ్లుతుంది’’ అన్నాడు. అక్కడే ఉన్న గోపబామలందరూ వనితా!నా ఆమె ఎవరు? మేము ఇంత మంది ఇక్కడ ఉండగా ఆ వనితాశిరోమణి గురించి ఆలోచన చేస్తున్నారా..? ఇంతకీ ఆమె ఎవరు స్వామి? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆమె గురించిన అన్నీ వివరాలు మాకు తెలియాలి. మా కన్నయ్య మనసును దోచుకున్న ఆ వగలాడి ఎవ్వరు అన్నదో లావణ్యమూర్తి.
‘‘అయ్యయ్యో అంత మాట అనకండి. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఎవరూ నోరెత్తరు? కాబోయే పట్టపురాణి. నంద నందుని మనసులో గట్టిగా తిష్టవేసుకొని కూర్చుని ఉంది. ఆమె అందం ఎలాంటిదంటే ఆ మణిద్వీపంలో ఉండే లలితాపరమేశ్వరియా అనిపించేంత అందంగా ఉంటుంది ఆ లలనామణి. ముట్టుకుంటే కందిపోయేంత ఎర్రదనంతో, తామరరేకుల వంటి కన్నులతో మన్మథుని విల్లంబుల వంటి గనుకొమ్మలతో, మోదుగ పూలవంటి పెదవులతో ఆహా ఆమె నడుస్తుంటే ఆ నల్లని కారు మేఘం లాగా కదులు తుండే వంటి కేశసౌందర్యం చెప్పనలవి కాదు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి