డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు ( రుక్మిణి-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తల్లి చిరునవ్వు తో నమస్కారం మహర్షి వర్యా అందంటే చాలు.. నాపై ముత్యాల వాన కురిసినట్టు ఉంటుంది ఇంకా చెప్పబోతుంటే ‘ఏమిటీ మీరు కల్యాణీతో మాట్లాడి ఇక్కడకు వస్తున్నారా.. ’అన్నాడు కృష్ణుడు.
చూశారా చూశారా... ఈ దొంగ కృష్ణుడు ఇప్పటిదాకా ఇన్ని ఊసులు చెబుతుంటే ఈ ముక్కుమూసుకొని నారాయణ అంటూ తిరిగే ఈ లోకసంచారికి కోమలి అందాలు ఎక్కడ కనిపించాయన్న అనుమానం రాలేదు కానీ ఆ తల్లి నుడివిన పలుకులు నేను చెబుతుంటే ఆ పలుకులు తాను వినాలని తన గురించి ఏమి చెప్పి ఉంటుందా అని ఎంత ఆతురత చూపిస్తున్నాడో మీరు గమనించారా.. ఇంత సేపు మీతో ఆడుకున్నాడు కదా. కొత్త కోమలి రాక ముందే కుండిన నగరానికి వెళ్లిపోయాడు కృష్ణయ్య ’అన్నాడు.
అక్కడున్న గోపికలంతా అవునౌను.. కృష్ణా కృష్ణా ఇక మమ్ము చూడవా.. మాతో మాట్లాడవా.. మాతో ఆటల్లాడవా.. కృష్ణా మమ్ము విడిచి దూరంగా వెళ్తావా అని గొంతులు జీరపోగా అడుగుతున్నారు.
అయ్యోయ్యో ఈ తంపుల మారి నారదుడు మీకు ఏమేమో చెబుతున్నాడు. నేను మిమ్ము విడిచి ఎక్కడకు వెళ్తాను. ఈ నారదుడు ఏమేమో చెప్పి మీ దృష్టిని మరలుస్తున్నాడు. అంతగా వీని మాటలు వినకండి అంటూనే వారి దృష్టిని వారి మాటలను తనవైపుకు తిప్పేసుకున్నాడు లీలామాయామానుష వేషధారుడు. కృష్ణుని ఆకర్షించని వారు ఎవరైనా ఉంటారా? కృష్ణుని మాటలు విన్న తరువాత మరొకరి మాటలు వినాలని, వారి మాటలకు అర్థాలు వెతకాలని ఎవరికైనా ఉంటుం దా? అందుకే గోపికలంతా కృష్ణుడు చెప్పేమాటలకు సంగీతానికి తలులూపే ధేనువుల్లా కృష్ణ నామాన్ని జపిస్తూ వెళ్లిపోయారు.
కృష్ణుడు నారదునికి ఉచితాసనం చూపించి కూర్చోమని చెప్పి ‘నారదా ఆ రుక్మి ఏమనుకొంటున్నాడు. అతని ఉద్దేశం ఏమై ఉంటుంది’ అని ఏమీ ఎరుగని అమాయకునివోలె అడిగాడు.
‘కృష్ణా ! ముల్లోకాలను తన ఉదరంలో పెట్టుకొన్న మురారీ! నీ చిత్రాలు నాపై కూడా చూపుతావా తండ్రీ. నానోటితో వినాలనుకొంటున్నావేమో అటులనే...’ అని మనసున తలిచాడు త్రిలోక సంచారి.
‘కృష్ణా’ అని ఇంతలోనే అంత వౌనం వహించావేమయ్యా.. అన్నాడు నారదుడు. ఆ రుక్మిని ఎదుర్కోవడం కష్టమా నీకేమైనా.. అనబోతుండగానే ‘‘నేను ఈ మధ్య బహు చక్కని చుక్క అతిలోక సౌందర్యవతి ఆ రుక్మిణి అని విన్నాను. అప్పటి నుంచీ కాస్త నాకు చూడాలనీ ఉంది ఆ పూబోణి ని ఆమె గురించి చెబుదూ...’తో లాలనగా అడుగుతున్న కృష్ణుని చూసి రుక్మిణి అందచందాలే కాక ఆమె భక్తి భావాన్ని కూడా ఆమెకు పరమేశ్వరి పై ఉన్న అచంచలమైన నమ్మకాన్ని కూడా ఏకరువు పెట్టాడు ఆ నారదుడు.
‘‘ఇకనేమి ఆ పరమేశ్వరియే ఆమె కోరిక నెరవేరుస్తుంది లే. ఆ మాతేశ్వరీనే నాకునూ దారి చూపెడుతుంది. ఇక నేను నిశ్చింతగా ఉంటాన్ణు’ అన్నాడు కృష్ణుడు.
నారదుడు చిరునవ్వుతో అంతా ఆ పరమేశ్వరీ కటాక్షమే కృష్ణయ్య.. అంటూ సెలవు తీసుకొన్నాడు.
***
తన చెలికత్తెల ద్వారా తన తల్లిదండ్రులు రుక్మికి భయపడుతున్నారని వింది. మరి తాను ఆ భువనైక సుందరుడిని చేపట్టే విధానమేమిటా అని ఆలోచించింది.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి