డైలీ సీరియల్

విలువల లోగిలి-77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు ఆడపిల్లలకు రక్షణే లేకపోతోంది.
మనుషులు మృగాలుగా మారిపోతున్నారు.
మనసులో ఆలోచనల సంఘర్షణ.
‘‘సీరియస్ కేసా?’’అంది అనుమానంగా చూస్తూ.
‘‘కొద్దిగా సీరియస్సే మేడమ్. అపస్మారక స్థితిలోనే ఉంది. సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నాం.’’
‘‘అంబులెన్స్‌కి ఫోన్ చేశాను. వచ్చేస్తోంది. ఉండండి. మళ్లీ ఒకసారి చూస్తాను. ఎంతవరకు వచ్చిందో’’ అని మళ్లీ రింగ్ చేసింది.
‘‘దగ్గరలోనే ఉన్నారట. వచ్చేస్తున్నాం అని చెబుతున్నారు’’ అంది సెల్ ఆఫ్ చేస్తూ.
ఆడపిల్లలంటే ఆటబొమ్మల కంటే హీనమయిపోయారు.. ఎక్కడ చూసినా అత్యాచారాలే. అసలు వాళ్ళకి రక్షణ లేకుండా పోతోంది. తలచుకుంటేనే కడుపు రగిలిపోతోంది.
తన దగ్గిర పెరుగుతున్న పిల్లలు మాత్రం పదిమందిని ఒకేసారి మట్టుపెట్టగలిగే స్థితిలోకి వచ్చారు తన శిక్షణలో. ఆడపిల్లలు అపాయంలో వున్నపుడు ‘హెల్ఫ్! హెల్ప్!’’ అనే అరిచేకన్నా తమను తాము కాపాడుకునే శక్తిమంతులుగా ఉండాలని తను ఎల్లప్పుడూ కోరుకుంటుంది. తమకలా నేర్చుకునే అవకాశం లేదు. అందుకే తన విద్యార్థులకు ఆ లోటు లేకుండా చేయగలిగింది.
ఆమె ఆలోచనలను చీలుస్తూ హారన్ కొట్టుకుంటూ అంబులెన్స్ రావటం, ఆమెను తీసుకెళ్లటం జరిగిపోయింది.
‘‘దేముడా! ఆమెను రక్షించు.. చల్లగా చూడు’’ అని మనసులోనే ప్రార్థించింది విశ్వ.
వారం రోజులు మృత్యువుతో పోరాడింది కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు అశువులు బాసిందని వార్త చేరింది విశ్వకు.
ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు.
ఎవరో అంతకంటే తెలియదు.
ఎవరీ అత్యాచారం చేసారో తెలియదు.
అంతా మిస్టరీ..
పోలీసులు కేసును ఛేదించటానికి ప్రయత్నిస్తున్నాం అంటున్నారు.
ఏమైనా ఒక అమాయక పుష్పం రాక్షసుల కాళ్ళక్రింద నలిబిలి అయిపోయిందన్నది మాత్రం సత్యం.
అది జరిగి నాలుగు రోజులన్నా కాకముందే మరో కేసు.. అదే రీతిలో. కాకపోతే ఆమె స్పృహలోనే ఉంది.
బస్టాండులో బస్సుకోసం వెయిట్ చేస్తుంటే నలుగురు బలవంతంగా తనని వేన్‌లో ఎక్కించుకొని ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేసారని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది.
నెల తర్వాత ఆమె విశ్వసౌధంలో చేరిపోయింది.
జనారణ్యంలో బ్రతకలేకపోయానని ఏడుస్తూ ఆమె చెప్పిన మాటలు విశ్వ మనసును కలిచివేసింది.
ఆమె మాటలు పదే పదే గుర్తువస్తున్నాయి.
‘‘వాళ్ళు రేప్ చేసినది గంటే మేడమ్.. అది శరీరం మీద ప్రభావం చూపింది. కానీ బయట ప్రతివాళ్ళూ ప్రతిక్షణం రేప్ చేసారా? ఎలా జరిగింది? ఎలా చేసారు? నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయావా? శీలమే పోయాక ఎలా బ్రతుకుతావు? ఇలాంటి వంద ప్రశ్నలతో వీళ్ళే అసలే రేపిస్టులు అనిపించింది.
మొదట్లో పోరాడాను. కానీ వాళ్ళ శూలాల్లాంటి మాటలు అనుక్షణం గుచ్చుకుంటుంటే మనసు తూట్లుపడింది.
వాళ్ళు సాటి మనుషులేనా అని అనుమానం వచ్చింది. తోటి స్ర్తి ఆపదలో వుంటే ఎలా ఓదార్చాలో అని చూస్తారా? శవాన్ని పీక్కుతినే రాబందుల్లా పొడుచుకుని తింటారా? ఇదేమి న్యాయం మేడమ్?’’ అంటూ తన దగ్గిర కన్నీరు కార్చింది.
ఇక్కడ ఆమె మనసుకు స్వాంతన చేకూరింది.
అసలు మగవాళ్ళంతా భార్యతో తప్ప మరో ఆడపిల్ల దగ్గరకు వెళ్ళకూడదనని నియమం పెట్టుకుంటే, ఒకే ఒక్కరు అని పాఠం వల్లెవేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికేసినట్లే.
అలా ఎందుకుండరు?
క్షణికావేశానికి జీవితాలను ఎందుకు బలి చేసుకుంటున్నారు? అసలు ఎందుకు అలా తయారవుతున్నారో నీకు తెలియదా? అంతరంగం తీవ్రంగా ప్రశ్నించింది.
నిజమే. ఎక్కడ చూసినా స్ర్తిని వ్యాపార వస్తువుగా చిత్రీకరించటమే.
ఆమె ఒంటిమీద నిండుగా బట్ట ఉండదు.
ప్రజలలో సినిమాల ప్రభావం ఎక్కువగానే వుంటుంది. ఇపుడు వాటిల్లో హీరోయిన్ వేసే డ్రెస్సులు ఎంత ఘోరంగా ఉంటున్నాయ్?
ఇది చాలదన్నట్లు ఐటెమ్‌సాంగ్స్.
దేనికోసం ఇదంతా?
డబ్బుకోసం. డబ్బు కోసం యువతను వెర్రెక్కిస్తారా? మంచి కధుంటే సినిమా తప్పక విజయం సాధిస్తుంది. బాపూ, రమణలు స్ర్తిని ఎంత ఉన్నతంగా చూపించారు? వాళ్ళ సినిమాలు విజయం సాధించటం లేదా? చీర కట్టులో ఎంత అందముందో వాళ్ళ సినిమాల్లోనే చూడాలి. అలా మంచితో విజయం సాధించాలని ప్రయత్నించాలి కానీ ఇలా కురచ దుస్తులు వేసి సక్సెస్ పట్టాలనుకునే దృక్పథం మార్చుకోవాలి. గోడలమీద సినిమా పోస్టర్లు చూస్తుంటే తనలాంటి పెద్దవాళ్ళకే వికారం వచ్చేట్లుంటున్నాయ్. వాటి ముందు స్కూలు పిల్లలు కూడా చొంగలు కారుస్తున్నారు.
సెన్సార్ బోర్డు కూడా ఈ విషయంలో మంచి శ్రద్ధ తీసుకోవాలి. ప్రేక్షకుల మనసుల్లోకి సూటిగా ఏ ప్రభావం అయినా దూసుకువెళ్ళేది సినిమాల ద్వారానే. అలాంటప్పుడు చెడును తొలగించాల్సిందీ వాటి ద్వారానే. మంచిని నేర్పించాల్సింది దానితోనే. ఆ కృషి అటునుంచీకూడా రావాలి. ఎందుకంటే వాళ్ళకీ కుటుంబాలున్నాయి. అందులో ఆడపిల్లలూ ఉన్నారు. వయసులో వున్న మగ పిల్లలూ ఉన్నారు. వాళ్ళకి ఎదురుదెబ్బలు తగిలితే కానీ సమాజం కోసం ఆలోచించరు. చుట్టూ వున్న వాళ్ళంతా మనవాళ్ళే అనుకుంటే ఈ పద్ధతిలో అసలు సినిమాలు తియ్యరు.
కొన్ని పత్రికలూ అంతే. శృంగారానికి పెద్ద పీటవేస్తున్నాయి. అది చదివి వెర్రెక్కి ఇలా.. అందిన ఆడదాన్ని వదలని పరిస్థితిని కల్పిస్తున్నాయి. చక్కని అనుబంధం గురించి, కుటుంబం గురించి, అనురాగం, ఆప్యాయతల గురించి ఎన్నో కథలు వెయ్యచ్చు. మనసు తలుపు తట్టచ్చు. పత్రికను నిలబెట్టుకోవచ్చు. , నాలుగు డబ్బులు వెనవేకోవాలని ఆలోచించేవారు మన యువతను పెడదారి నడిపించే దిశలో తమ పాత్రకూడా ఉందని గ్రహించాలి. అలాగే టీవీల్లో ఫ్యాషన్ షోలు.
వాళ్ళ ఒంటిమీద బట్టే ఉండదు. మళ్లీ వాటితో స్టేజ్‌మీద నడక.. వయ్యారంగా.
మనకి అవసరమా?
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ