డైలీ సీరియల్

విలువల లోగిలి-80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనురాగాన్ని అందించేవారు. అలా వారంతా బంధాలను పెంచుకున్నారు. వారంతా వెళ్లిపోతూ ‘‘మీకు విశ్వా మేడమ్‌తోపాటూ మేమంతా కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మా జీతాలలో పది శాతం మేమంతా ఇక్కడకు పంపిస్తాం. వీలు దొరికినపుడల్లా అమ్మను, నాన్నను మిమ్మల్ని వచ్చి చూసి వెళతాం’’ అని మాటిచ్చి మరీ వెళ్ళారు చిన్ని నాన్నలు.. కాబోయే నాన్నలు.
విశ్వను, సూర్యచంద్రను వారంతా పెంపుడు తల్లి, పెంపుడు తండ్రిగా అనుకునేవారు. నిజానికి వారి మనసులు మాత్రం వారే నిజమైన తల్లిదండ్రులని, అసలివారే తమకు పెంపుడు తల్లిదండ్రులులా కనిపిస్తారని ఎప్పుడూ చెబుతూ ఉంటాయి. బయటకు అలా చెబితే బాగుండదని వారిని వారు మభ్యపెట్టుకునేవారు.
బంధాలు ఎంత గొప్పవి?
ఒకరితో ఒకరికి ఒకసారి అనుబంధం ముడిపడితే అది ఎప్పటికీ తెగిపోదు. విడిపోదు. ఒకవేళ అదే జరిగినా విడిపోయినట్లు అనిపిస్తుందే తప్ప విడిపోవటం జరగదు.
ఇదే సైకాలజీ.
ఇరు మనసులను ముడివేసే మనస్తత్వాన్ని చెప్పే మనస్తత్వ శాస్త్రం.
****
‘అమృత హృదయ నిలయం’ లోగిలంతా జనాలతో నిండిపోయింది. విశ్వ అవయవదాన అవగాహనా సదస్సును అక్కడ ఏర్పాటుచేసింది. సంబంధిత అధికారులతో ముచ్చటించి ఆ మీటింగ్ పెట్టింది. పురజనులందరికీ పత్రికాముఖంగా ఆహ్వానం పలికింది.
తమ శరీరాలను కట్టెల్లో దహనం చేసే బదులు తమవల్ల మరో పదిమంది బ్రతికే అవకాశమున్నపుడు నేత్రాలు, శరీర అవయవాలు దానం చేయటమే తన ఉద్దేశ్యంలో గొప్ప కార్యమని తెలియజేసింది.
ఉన్నతాధికారులు కూడా వాటివల్ల వచ్చే ఉపయోగాలను వివరించారు. నేత్రదానం కొంతన్నా ముందుకు వచ్చింది. ఈ అవయవదానంపట్ల ప్రజలకు సదభిప్రాయం లేదని అది పోగొట్టడానికే ఈనాటి సభ అని సవివరంగా వివరించారు.
ముందుకు వచ్చినవారితో అప్లికేషన్లు పూర్తిచేయించి సంతకాలు చేయించి అడ్రసులు రాయించుకున్నారు.
విశ్వ సహాయంతో ఈ కార్యక్రమం జయప్రదం అయిందని సంతోషంగా చెప్పి వెళ్లారు అధికారులు.
****
‘చందూ! బీచ్‌కి వెళ్దామా’ అడిగింది విశ్వ.
‘‘అలాగే వెళదాం పద’’ అన్నాడు.
తను అడగటమే ఆలస్యం సిద్ధమైపోయే చందూని ఎంతో ఇష్టంగా కళ్ళల్లో నింపుకుంటుంది విశ్వ.
కాసేపటిలో అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరూ.
కళ్ళు తడవనిదే జీవిత ప్రయాణం సాగదు అన్నట్లు కాళ్ళు తడవందే బీచ్‌కెళ్ళిన ఆనందం దొరకదు అంటుంది విశ్వ.
అక్కడకు వెళ్ళటం ఆలస్యం పాదాలను జలమాతకు అప్పజెప్పేస్తుంది. అవి నీళ్ళతో ఆటలాడుకుంటాయి.
విశ్వ ఆనందంలో ఎక్కడ ముందుకెళ్లిపోతుందేమో అని ఆమె మళ్ళీ నీటిలోంచి బయటకు వచ్చేదాకా అక్కడే ఉంటాడు చందూ ఆమెకు తోడుగా.
ఆ నీటి స్పర్శ అమ్మలా ఉంటుంది విశ్వకి.
కాసేపు ఉరకలు వేస్తూ, కాసేపు నిదానంగా పయనించే ఆ కెరటాలు అమ్మను చూసిన అనుభూతిని కలిగిస్తాయి. మరి అమ్మతనంలో ఆడేప్పుడు అల్లరిగా, మిగిలినప్పుడు నెమ్మదిగా ఉండేదిగా.
అందుకే అమ్మను చూడాలనిపించినపుడల్లా ఇక్కడకు వచ్చేస్తుంది.
ఆ అమ్మ దాహం తీరాకే ఇంటిముఖం పట్టేది.
ఆ దాహం తీరటానికి ఎన్ని గంటలయినా పట్టచ్చు. కొన్ని నిముషాలయినా అవ్వచ్చు. కానీ ఆనందం మాత్రం అనంతం.
***
సెల్ అదేపనిగా రింగవుతోంది.
ఎవరు తనని అంత ఇదిగా పిలుస్తున్నారు అనుకుంటూ ఆన్ చేసి ‘హలో!’ అంది.
‘నేను ఫణిని’
‘్ఫణా! తమ పిల్లలలో ఫణి అన్న పిల్లవాడు ఎవరూ ఉన్నట్టు గుర్తులేదే! ఎవరయి ఉంటారబ్బా! తెలియదంటే నొచ్చుకుంటారు. ఎలా? అనుకొని ‘చెప్పమ్మా’ అంది.
‘‘విశ్వక్కా! నన్ను గుర్తుపట్టలేదు కదూ!’’ అన్నాడు అవతలనించి.
ఓ! ఆ ఫణీనా. తనకెప్పుడూ పిల్లల ధ్యాసే. అందుకే దృష్టి అలా వెళ్లిపోయింది.. శాంతి మరిది ఫణీనా అనుకుని.
‘‘నినె్నలా మరిచిపోతాను ఫణీ? ఆ రోజే నేను చెప్పానుగా.. ఏదో ఒకరోజు స్వీట్ న్యూస్‌తో నా ముందు నిలబడతావని. కన్‌ఫ్యూజ్ చెయ్యాలని సరదాగా అలా అన్నా’’ అంటూ కవర్ చేసుకుంది తెలివిగా.
అందులో అవతలివారిని బాధపెట్టకూడదనే సదుద్దేశమే ఎక్కువ.
‘‘నాకు తెలుసక్కా! నువ్వన్నట్లే జాతీయ స్థాయి పోటీలో ఫొటోగ్రఫిలో నేనే ఫస్ట్ వచ్చానుగా!’’
‘‘వెరీగుడ్.. పేపరులో రాలేదే! లేకపోతే నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేదాన్ని’’.
‘‘ఇప్పుడే డిక్లేర్ చేసారు.. ముందుగా నీకే చెబుతున్నా!’’
‘‘అక్కమీదున్న నీ అభిమానానికి అభినందనలు’’
‘‘్థంక్స్ అక్కా’’
‘‘అమ్మా వాళ్ళంతా బాగున్నారా?’’
‘‘నువ్వడగక్కర్లేదు. దేవతలా నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టావు. ఇంటినే మార్చేశావు’’.
‘‘ఇంటినా..?’’ ప్రశ్నార్థకంగా.
‘‘అదేలేక్కా! ఇంటి స్వరూపాన్ని అంటే ఇంట్లో వున్న వాళ్ళ వ్యక్తిత్వాలను’’.
‘‘అది ప్రక్కన పెట్టు. నీ సంగతులు చెప్పు’’.
‘‘యంబిఏ పూర్తిచేసాను. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను. అవార్డు తీసుకోగానే నీ ఆశీర్వాదం కోసం వస్తాను. అవార్డు నీకే ముందు చూపించాలి’’.
అతని మాటల్లో చెప్పలేనంత ప్రేమ ప్రస్ఫుటవౌతుంటే ఆశ్చర్యపోవటం విశ్వ వంతయింది.
‘‘ఏమిటక్కా వౌనం? రావద్దా?’’
‘‘్భలేవాడివి ఫణీ! అక్క ఇంటికి ఎవరైనా అడిగి వస్తారా?’’
‘‘కాదులే’’
‘‘మరేమిటి, వచ్చెయ్, నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను’’
‘‘నీ గురించి పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నా! ఈ న్యూస్‌తోనే నీ ముందుకు రావాలని మధ్యలో మాట్లాడలా. కానీ రోజూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను’’.
‘‘రోజూనా?’’
‘‘అవును. నిన్నొకసారి చూసాక, పరిచయమయ్యాక ఎవరు మరిచిపోతారు?’’
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206