డైలీ సీరియల్

విలువల లోగిలి-81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకు పరిచయం అయిన వాళ్ళందరూ అనే మాట అదే.. వాళ్ళతో రెండు నిముషాలు మాట్లాడినా.
‘‘సరే అక్కా! ఉండనా! ఫొటో దిగడానికి పిలుస్తున్నారు’’ అన్నాడు ఫణి.
‘‘అలాగా! వెళ్ళు. కంగ్రాట్స్ నాన్నా!’’ అంది విశ్వ.
‘‘్థంక్స్ అక్కా!’’ అని ఫోన్ పెట్టేశాడు.
ఎంతో అభిమానం వుంటేగానీ ఆ సమయాలలో ఫోన్ చెయ్యరుగా అని అనుకోకుండా ఉండలేకపోయింది విశ్వ.
ఆ రోజంతా అది పదే పదే గుర్తువస్తూనే వుంది. చందూకి వెంటనే ఫోన్ చేసి చెప్పింది ఆగలేక.
విశ్వకి కూడా కంగ్రాట్స్ చెప్పాడు చందూ, ఫణికి అంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చినందుకు.
‘‘చందూ ఏమైనా వెరైటీ’’ అనుకుంది విశ్వ.
చందూని తలచుకుంటేనే మది ఉప్పొంగిపోతుంది ఇన్ని ఏండ్లయినా. ఎప్పటికీ ఇలాగే ఉండాలని తన ఆశ.
***
‘‘బామ్మా! నిన్న దగ్గు అన్నావుగా! తగ్గిందా?’’ ఆప్యాయంగా ప్రక్కన కూర్చుంటూ అడిగింది విశ్వ.
‘‘ఆ! మిరియాల కషాయంలో తులసి ఆకులూ, అల్లం దంచి స్పెషల్‌గా ఇమ్మన్నావంటగా. దెబ్బకు జలుబు ఎగిరిపోయింది మనవరాలా’’.
‘‘ఒక్కసారికే. వెరీగుడ్’’ అంది.
‘‘ఒకసారి మన డాక్టరుగారికి చూపించుకుంటావా బామ్మా?’’
‘‘అక్కర్లేదు విశ్వా! ఏదైనా తేడా ఉంటే నేనే చెబుతాగా’’
‘‘అయితే సరే బామ్మా’’ అని ప్రక్క బెడ్ వైపు వెళ్లింది.
‘‘ఏమిటి నీరజక్కా! పూలు టకటకా కట్టేస్తున్నావ్?’’ అడిగింది విశ్వ.
‘‘అలవాటయిన పని కదా. ఈనాటిదా ఏమిటి? చిన్నప్పటినుంచీ కడుతున్నాను’’.
‘‘గుడి దగ్గర పూలకొట్టువాళ్ళది. లారీ డ్రైవర్ తాగిన మత్తులో పూల కొట్టుమీదకు ఎక్కించేశాడు. దానితో పూలు అమ్ముతున్న ఆమె భర్తఆ యాక్సిడెంట్‌ల చచ్చిపోయాడు.
ఎవరూ లేకపోవటంతో ఒక్కర్తే బయట ఉండటం ఎందుకని ఇక్కడకు వచ్చేసింది. ఖాళీగా కూర్చోదు. పూలు అమ్మేవాళ్ళకు చెప్పి వాళ్ళతో పూలు తెప్పించుకొని కడుతుంది. దానికి ఇచ్చిన సొమ్మును విశ్వకి విరాళంగా ఇచ్చేస్తుంది, వద్దు ఉంచుకోమని ఎంత చెప్పినా!
‘‘ననే్న మీరు చూసుకుంటున్నపుడు నాకు డబ్బులెందుకు? అంతగా కావాలంటే అడిగి తీసుకుంటా’’ అంటుంది కానీ పైసా కూడా దాచుకోదు. తప్ప త్రాగి డ్రైవ్ చేయటంవల్లే కదా నీరజక్క జీవితం అలా అయ్యింది. అందుకే తాగుబోతులంటే తనకు అసహ్యం. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చెడగొట్టుకోవటమే కాకుండా ప్రక్కవాళ్ళ ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటున్నారు మతులు తప్పి.
వ్యసనం అని తెలిసి కూడా దానిని ఎలా అలవాటు చేసుకుంటారో అనుకుంటూ వీల్ ఛైర్‌లో వున్న ఎల్లమ్మ దగ్గరకు వెళ్లింది.
‘‘ఏంటి ఎల్లమ్మా! షికారు తీసుకువెళ్ళనా?’’
‘‘నేను వెళతానులేమ్మా! నడిపించుకోగలను గదా బండిని’’ అంది.
రైల్వే స్టేషన్‌లో జామకాయలు అమ్ముకుంటుంది. హోల్‌సేల్‌గా కొని, కాస్త లాభం వేసుకొని అమ్మేది.
ఒంట్లోకి షుగర్ ఎలా చేరిందో ఆమెకే తెలియదు. టెస్టు చేయించుకోవాలని ఎవరూ చెప్పలేదు. ఒకరోజు కాలిలో ఇనుప మేకు గుచ్చుకుంది. అదీ తెలియలేదు. టీటీ ఇంజెక్షన్ పడలేదు. తెలుసుకునేటప్పటికే సమయం మించిపోయింది. పాదం తీసెయ్యాలన్నారు. లేకపోతే శరీరం మొత్తానికే ప్రమాదం అన్నారు. అందుకే అక్కడిదాకా తీయించేసుకుంది. కుంటి కులాసంతో కాపురం ఏమిటని మొగుడు వదిలేసాడు. అవిటితనమే తనకు తోడు అనుకుంటూ ఇక్కడ చేరింది.
అదే అతను అలా కుంటివాడు అయితే ఆమె వదిలేసేదా? వదిలేది కాదు. నాకయితే వాడు చేయడా అని కళ్ళల్లో పెట్టుకుని చూసేది. ఎంతైనా మగవాళ్ళకు ప్రేమ తక్కువే అనుకుంది విశ్వ.
‘‘ఏదీ నా ముఖం చూసి చెప్పు’’ అన్నాడు చందూ ప్రక్కన నిలబడి ఆలోచనల్లో అదృశ్యంగా.
‘‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’’ అన్నట్టు చందూ నువ్వు వేరు. ఇలాంటి వాళ్ళతో నినె్నందుకు కలుపుతాను చెప్పు?
అయినా మగవాళ్ళు అంటే అందరు మగవాళ్ళూ అని కాదు అర్థం. మంచితనం తెలియనివాళ్ళూ అని’’ అంతరంగానికి పూర్తి వివరణ ఇచ్చింది విశ్వ.
‘‘అమ్మగారూ! మీ కోసం ఎవరో వచ్చారు’’ అని గంగ చెప్పటంతో ‘‘వస్తున్నా గంగా!’’ అంటూ వాళ్ళందరికి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లింది.
ఎదురుగా ఫణి.. ఆశ్చర్యంగా చూసింది విశ్వ.
‘‘అప్పుడే వచ్చేసావా?’’
తన కాళ్ళకు నమస్కరిస్తున్న ఫణిని లేపుతూ.
‘‘ఎంతసేపు వస్తాను.. అవార్డు తీసుకున్నా.. ట్రైన్ ఎక్కా.. ఇక్కడ దిగా’’.
‘‘అబ్బో.. బాగా అలిసిపోయి వుంటావు.. పదా.. ఏమన్నా తిందువుగానీ’’ లోపలికి తీసుకువెళ్లి అమృతకి పరిచయం చేసింది.
‘‘అత్తయ్యా! తను ఫణి.. శాంతి తెలుసుగా.. దాని మరిది. నాకు తమ్ముడు’’.
‘‘నమస్తే అమ్మా!’’ అంటూ ఆవిడ కాళ్ళకు కూడా నమస్కరించాడు.
‘‘చల్లగా ఉండు బాబూ’’ అని దీవించింది అమృత.
ఇంతలో ప్లేటులో టిఫిన్ సర్ది తీసుకువచ్చింది విశ్వ.
టిఫిన్ తిన్నాక టీ కలిపి ఇచ్చింది.
ఒక గంట దాకా కబుర్లతో కాలక్షేపం చేసారు.
‘‘స్నానం చేస్తావా ఫణీ?’’
‘‘లేదక్కా! వెళ్ళిపోతాను. కనిపించి వెళదామని వచ్చాను’’
‘‘్భలేవాడివే. నాలుగు రోజులు ఉండి ఇక్కడ ఉన్నవన్నీ చూసి వెళ్ళు. అక్క దగ్గరకొచ్చి అలా వెళ్లిపోతావా?’’
‘‘వద్దులే అక్కా’’
‘‘ఏమిటీ.. ఇదంతా మొహమాటమే.. నథింగ్ డూయింగ్. నువ్వు ఉంటున్నావు.. అంతే. ఇక్కడ నీ కోసం చేసేది ఏమీ ఉండదు. అయినా నువ్వు వెళతానంటే నేను పంపేస్తానా?’’
‘‘సరే.. ఉంటాను’’ అన్నాడు.
అతనికి తను గెస్ట్‌రూమ్ చూపించింది.
రెడీ అయి వచ్చాక తనే దగ్గరుండి తన కాంపస్ అంతా చూపించింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206