డైలీ సీరియల్

సంతోషం.. కల్లోలం! ( గజేంద్రమోక్షం - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మడుగులోనుంచి రెక్కల్లార్చుకుంటూ వెళ్లే పక్షుల రెక్కల నుంచి జారిన జల బిందువులు ఆ ఏనుగుల పైన పడి దగ్గరలోనే జలాశయం ఉందన్న భరోసాను కూడా కలిగించాయి.
అంతే గజరాజుకు చాలా సంతోషం వేసింది. తన దాహమే కాక తన ప్రియురాండ్రకు కూడా దాహార్తిని తీర్చవచ్చు అనుకొన్నాడు. ఆ ఏనుగులు గుంపు ఒకదానితో మరొకటి ఆ జలాశయం గురించి చెప్పుకుంటూ వడివడిగా ముందుకు అడుగులు వేశాయి.
అట్లా వెళ్లుతున్న గజాలకు దూరంగా ఓ మడుగు కనిపించింది. ఆ మడుగు గట్టు మీద పచ్చగా చిక్కగా పరుచుకున్న పచ్చదనం ఆ మడుగులోని నీటిలోతును తెలుపుతోంది. ఆ మడుగు అంచుల దగ్గరగా మఱ్ఱి, రావి, జువ్వి, మద్ది చెట్లు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి. ఆ శాఖలనిండా ఉన్న ఆకులు పచ్చదనంతో నవనవలాడుతూ ఉన్నాయి.
ఆ మడుగులో కలువలు విరగకాసి ఉన్నాయి. ఆ కలువ మకరందపు పరిమళాన్ని దూరంగా ఉన్న కరిరాజుల నాసికలు అందుకున్నాయి. దంతి దళాల నేత్రాలు కలువలపై వాలుతున్న తుమ్మెదల గుంపులు కనిపించాయి. ఆహా ఈ మడుగు లోని ఎంత చల్లదనాన్నిస్తాయో గదా అనుకొన్నాయి. తమ దాహార్తిని కూడా ఈ మడుగు తీరుస్తుందని గజరాజూ అనుకొన్నాడు. వెంటనే తన ప్రియురాండ్రైన ఆడ ఏనుగులకు ఆ మడుగు దగ్గరకు వడివడిగా అడుగులు వేయండని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాడు.
దగ్గరకు వెళ్లి ఆ మడుగులోకి చూచిన గజరాజుకు అందులో మొసళ్లు, చేపలు, కొంగలు, హంసలు, తిమింగళాలు కనిపించాయి. ఈ మడుగు చక్కగా లోతుగా ఉంది. మనందరమూ దీనిలో దిగి సంతోషంగా జలక్రీడలు సల్పినా ఫర్వాలేదు అనుకొంది. ఆ గజరాజు వెంట నంటి వచ్చిన మిగతా ఏనుగులన్నీ కూడా ఆ నీటిని ఆనందంగా చూశాయి. ముందుగా గజరాజు ఆయన తోపాటుగా మిగతా ఏనుగులు కూడా ఆ మడుగులోకి జొరబడినాయి. తమ తొండాలను నీటిలో గుచ్చి ఝంమ్మని జుర్రి నీటిని తాగాయి. కరి , కరిణులు అన్నీ నీటితో తమ బొజ్జలు నింపుకున్నాయి. ఇక తొండాలతో నీటిని పీల్చుకుంటూ ఇతర ఏనుగులపై జల్లుతున్నాయి. అక్కడే ఉన్న కలువలను పీకి తన ప్రియురాండ్రపై వేస్తూ నీటిని వెదజల్లుతూ హాయిగా సంతోషంగా ఈ కరికరుణులు ఆ మడుగునీటిని ఆస్వాదించాయి.
ఇక సాయం సమయం అయ్యేసరికి ఇక తమ నివాసాలకు వెళ్లడానికి గజాలు కాలు కదిపాయి.
ఏనుగులన్నీ మడుగు నీటిని వదిలి గట్టుపైకి ఎక్కుతుండగా ఆ ఏనుగుల రాజు మాత్రం ఇంకా మడుగు నీటి మధ్యలో ఉంటూ తొండాన్ని ఆ నీటి అడుగు దాకా జొనిపి గట్టిగా నీటిని పీల్చుకొని తొండాన్ని పైకి లేపి బాగా సాచి పీల్చిన నీటిని ఆకాశంపైకి ఎగజిమ్మాడు. ఆవిధంగా జిమ్మిన నీరు ఆకాశంనుంచి జడివాన కురిసినట్లుగా చూచేవారికి అనిపించింది. గజరాజు పీల్చుకునేటపుడు ఈ నీటి ద్వారానే మడుగులో ఉన్న ఎండ్రకాయలు, మకరాలు,మీనాలు ఇట్లాంటి చిన్న జంతువులు అన్నీ గజరాజు తొండంలో ఇరుక్కుని, తిరిగి ఆ గజరాజు ఆకసంపైకి ఎగజిమ్మినపుడు ఆ నీటి వేగానికి ఆ జలచరాలన్నీ ఆకశాన్ని తాకి, తిరిగి నీటిధారలతో పాటుగా భువికి చేరాయి. ఆ సమయంలో ఆకసంలో దిరిగే దేవతలు ఆశ్చర్యచకితులై చూస్తుండడాన్ని సహజ కవియైన పోతనామాత్యుడు చూచి ఆహా ! ఈ మడుగులోని ఎండ్రకాయలు, మొసళ్లూ , చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశినీ, కర్కాటక రాశినీ పట్టుకోబోతున్నాయేమో అని దేవతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా అనుకొన్నాడు. (నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్)
అట్లా ఆడుకునే గజరాజుకు ఎంతకీ ఆ మడుగు వదలాలనిపించలేదు. గుంపులుగా పూసిన కలువకనె్నలన్నింటినీ పెరికి తన జవరాండ్రపైకి విసిరేసినాడు. వారు వెనక్కు తిరిగి చిన్న చిరునవ్వుతో తిరిగి తమ నాథుని చిలిపిచేష్టలకు మురిసిపోతూ పక్కనే ఉన్న నీటిని తమ తొండాలతో తీసుకొని ఆ గజరాజుపైకి విరజిమ్ముతున్నాయి. ఇలా మహాసంతోషంతో ఏనుగుల గుంపు ఆ మడుగును కకావికలం చేసేస్తున్నాయి.
దీని నంతా ఆ మడుగులోనే బాగా బలిసి ఉన్న ఓ మొసలి చూశాడు. కలువలను పెరికి తమ వీపులపై వేసుకొనడం, నీటిని విరజిమ్ముతూ ఆ నీటిలో ఉన్న చేపలను, చిన్నచిన్న జలచరాలను పైకి విసిరి వాటికి ప్రాణాపాయం తెప్పించడం చూశాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804