డైలీ సీరియల్

ఒయాసిస్ 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీప్తి చెప్పినట్లే రణధీర్ ఉదయం పది గంటలకు చెక్‌పోస్టు దగ్గరకెళ్లాడు. ఇతన్ని చూడగానే దీప్తి చెయ్యి ఊపింది.
రణధీర్ అక్కడికి వెళ్ళగానే, దీప్తి కంపెనీ కారులోనుంచి దిగి, అతని కారులోకి వచ్చి కూర్చుంది.
లెమన్ ఎల్లో కలర్ మెరూన్ బార్డర్ పట్టుచీర కట్టింది. మ్యాచింగ్ బ్లౌజు తొడిగింది. జుట్టు పైకి దువ్వి వెనకాల క్లిప్ పెట్టింది. బ్యూటీ పార్లర్‌కి వెళ్లినట్లుంది, కనుబొమలు ట్రిమ్ చేయించుకుంది. సీసా సెంటు గుమ్మరించుకుందేమో, గుప్పుమంటోంది వాసన.
‘‘ఏంటి ఒక్క రోజులో ఇంత మార్పు?.. నువ్వేనా అని ఆశ్చర్యంగా ఉంది?’’ అన్నాడు రణధీర్.
‘‘ఎలా ఉన్నాను చెప్పండి?’’ అన్నది నవ్వుతూ.
‘‘పైనుంచి కాలు జారిపడిన ఊర్వశిలా ఉన్నావు..’’
‘‘కాలు జారినట్లు కనిపిస్తున్నానా?’’ అని పకపకా నవ్వింది.
‘‘ఒంట్లో ఈ మెరుపు, కంట్లో ఆ మైమరుపు చూస్తుంటే అనుమానంగానే ఉంది.. డైరెక్షన్ ఎటో చెప్పు..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇక, ఇక్కడినుంచి నేను మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను.. లెఫ్ట్ టర్న్ తీసుకోండి..’’ అన్నది దీప్తి.
అయిదు నిమిషాల తర్వాత కారు ఒక విశాలమైన కాంపౌండ్‌లో ఆగింది.
కారు దిగి రణధీర్ ఆ బిల్డింగ్ వైపు చూశాడు. అధునాతనమైన డిజైన్‌లో, అందంగా, హుందాగా ఉంది.
దీప్తి ముందు నడుస్తుంటే, రణధీర్ ఆమెను అనుసరించాడు. పెద్ద హాలు, డ్యూప్లెక్స్ మోడల్‌లో ఎటు చూసినా మెరిసిపోతున్న పాలరాతి అందంతో, దృష్టి మరల్చనీయని ఇంటిరియర్ డెకరేషన్‌తో సుసంపన్నుడి నివాసం అని చెప్పకనే చెబుతోంది ఆ ఇంద్రభవనం. హాల్లో అప్పటికే కొంతమంది ఆశీనులై ఉన్నారు. మరికొంతమంది చేతులు కట్టుకుని ఒక పక్కగా నిలబడి ఉన్నారు. వాళ్ళంతా ఆయన కంపెనీల్లో పనిచేసేవాళ్ళని తెలుస్తూనే ఉంది.
రాజశేఖర్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. దీప్తి రణధీర్‌ని ఆయకు పరిచయం చేసింది. రాజశేఖర్ నల్లని కంచు విగ్రహంలా ఉన్నా తెల్లని సిల్క్ లాల్చీ, సిల్క్ పంచతో మెరిసిపోతున్నాడు.
‘‘వీరే చక్రపాణిగారు.. ఫిల్మ్ ప్రొడ్యూసర్..’’ అన్నది దీప్తి.
రాజశేఖర్ కూర్చునే షేక్‌హాండ్ ఇచ్చాడు. ‘‘నైస్ టు మీట్ యు.. నిన్న దీప్తి మీ గురించి చెప్పింది.. మీ ప్రాజెక్టు గురించి నేనూ తెల్సుకోవాలనుకుంటున్నాను..’’
‘‘ష్యూర్.. ష్యూర్..’’ అన్నాడు రణధీర్.
‘‘దీప్తి, వీరిని బ్రేక్‌ఫాస్ట్‌కు తీసుకెళ్ళు..’’ అన్నాడు రాజశేఖర్.
దీప్తి రణధీర్‌ని పక్క హాల్లోకి తీసుకెళ్లింది. అక్కడ టిఫిన్లు అన్నీ రెడీగా ఉన్నాయి. బఫే పద్ధతిలో వడ్డించటానికి, మనుషులు రెడీగా ఉన్నారు.
దీప్తి ఆయనకో ప్లేటు ఇచ్చింది. తనో ప్లేటు తీసుకుంది. కావాల్సినవి ప్లేట్లో వేయించుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
‘‘మీరేమీ సిగ్గుపడకుండా ఒకటికి రెండుసార్లు నచ్చినవి వడ్డించుకోండి..’’ కొంచెం ముందుకు వంగి ఆయనకు మాత్రమే వినపడేటట్లు చెప్పింది. ‘‘ఇదంతా మనదే..’’ అని.
‘‘మొత్తానికి నక్కను తొక్కావు.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కావు..’’ అన్నాడు రణధీర్ నెమ్మదిగా.
‘‘ఆయన నొక్కినప్పుడు మనం ఓకే అంటే, మనం నొక్కినప్పుడు ఆయన ఓకె అంటాడు. గివ్ అండ్ టేక్.. సింపుల్ ఫార్ములా.. ఇవాళ ఈ ఫంక్షన్ పేరుతో.. ఓ యాభై వేలు చీరలకీ, డ్రెస్‌లకీ ఖర్చుపెట్టించాను..’’ అని చెప్పింది దీప్తి.
దీప్తి, రణధీర్ హాల్లోకి వచ్చేటప్పటికి నలుగురు బ్రాహ్మణులు తమకు కావాల్సిన సరంజామా సమకూర్చుకుంటున్నారు. ఇద్దరు జపం చేస్తుంటే, ఇద్దరు అభిషేకాలు చేయటం మొదలెట్టారు.
స్వామీజీ భక్తులు నలుగురైదుగురు వచ్చారు. ఆయన గొప్పదనం గురించి చెబుతున్నారు.
‘‘స్వామీజీ మానస సరోవరం నాలుగుసార్లు వెళ్లారు. అంత చలిలో అక్కడ హోమం చేశారు. కేదార్‌నాథ్ పదిసార్లు పైనే వెళ్ళుంటారు. హిమాలయాల్లో పదేళ్ళు తపస్సు చేశారు. ఇప్పటికీ అక్కడ గుహల్లో అయిదారు వందల ఏళ్ళనుంచి తపోనిష్టలో ఉన్నవారిని మన స్వామీజీ చూశారట. వారు స్వామీజీని గుర్తుపట్టారట. కిందటి జన్మలో వీరూ అక్కడ తపస్సు చేశారట వారితో కలిసి. స్వామీజీ శంకరునితో మాట్లాడుతారు. ఈయన పిలిస్తే ఆయన పలుకుతాడు. స్వామివారి గొప్పదనాన్ని కీర్తిస్తున్నాడు. ముక్కుపొడుం పట్టిస్తూ.
పనె్నండు గంటలకు వరుసగా అయిదారు కార్లు వచ్చి ఆగాయి. ముందు శిష్యపరివారం దిగి, స్వామీజీ ఉన్న కారు తలుపు తీసి పట్టుకున్నారు.
రాజశేఖర్, దీప్తి మిగిలిన వాళ్ళూ వెళ్లి ఆయనకు స్వాగతం చెప్పారు. కాషాయ వస్త్రం ధరించి మరో కాషాయ వస్త్రం కప్పుకుని నుదుటిమీద విభూతిరేఖలతో తెల్లని గడ్డంతో చూడగానే భక్త్భివం కలిగించేటట్లున్నారు.
శిష్యగణం ఆయన్ను సాదరంగా తీసుకొచ్చారు. ఆయన లోపలకు రాగానే జపాలు, అభిషేకాలు చేస్తున్న బ్రాహ్మణులు లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేశారు. అందరినీ ఆశీర్వదిస్తూ, అభయం ఇస్తూ ఆయనకు కేటాయించిన గదిలోకి వెళ్లారు. అయిదు నిమిషాలు తలుపులు మూసేశారు.
లోపల ఏర్పాట్లు పూర్తిచేశాక రాజశేఖర్ ముందు గదిలోకి వెళ్లాడు. స్వామీజీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాడు. తర్వాత దీప్తిని పిల్చారు. దీప్తి తనతోపాటు రణధీర్‌నీ రమ్మని చెయ్యి ఊపింది. దీప్తి వెనకాల రణధీర్ వెళ్లాడు.
దీప్తి స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసింది.

- ఇంకా ఉంది

శ్రీధర