డైలీ సీరియల్

ప్రాణి పాట్లు.. పరమాత్మ భజన ( గజేంద్రమోక్షం - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవె తప్ప ఇతఃపరం బెరుగు అని వేడుకున్నవారిని రక్షించేనాథుడు భగవంతుడొక్కడే అని గజరాజు యోచించాడు.
మరికొద్దిసేపటికి అసలు కలండు కలండు అనే వాడు కలడో లేడో కదా. ఒకవేళ ఉన్నా నేను పిలిస్తే వస్తాడా రాడా.. అయినా ఏ దేవుని నేను పిలవాలి అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు అనుకొన్నాడు.
లేదు లేదు ఆ భగవంతుడు అన్నీ లోకాలకు ఆవల చిన్మయుడై వేయి వెలుగులతో ఉంటాడు. ఆ వెలుగును చూడడానికి కూడా నాకు శక్తి లేదు. నా ప్రాణాలు ఠావుల్ తప్పుతున్నాయి. ఇక ఆ భగవంతుడు తప్ప నన్ను రక్షించగలవారెవరూ లేరు. ఓ భగవంతుడా! ఓ సర్వసృష్ట కర్తా! వైకుంఠంలో పాలసముద్రం మధ్యలో లక్ష్మీదేవి పక్కన ఉన్న ఆ మహానుభావా! భక్తులను బ్రోచడానికి వెనుకడగు వేయని వాడా! నాలో ధైర్యం తగ్గిపోయింది. నా పంచప్రాణాలుకదలబారుతున్నాయి. మూర్చ వస్తోంది. శరీరం వడలిపోయింది. నీకు నీవు తప్ప మరెవరూ లేరు కమాలాక్ష! వరదా! దయాసముద్రుడా! పూరేకుల వంటి సుతిమెత్తని మనసు కలవాడా! దీనులను బ్రోచేవాడా! నా మొర వినవా... ఉత్తమ గుణాలను మెచ్చుకునేవాడా.. శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటివాడా మునీంద్రులకు అతి ప్రియమైనవాడా.. ఓ భగవంతుడా నేను నిన్ను సంపూర్తిగా నమ్మాను. నాకు నీవు తప్ప మరెవరూ లేరు. నన్ను నీవు ఉన్నవాడివి ఉన్నట్టుగా వచ్చి నన్ను కాపాడు. నీవు కాపాడిన వారిని నేనెరగుదును. వారంతా నీపై అచంచలమైన నమ్మకమున్న వారే. కనుక నేను కూడా నీ భక్తుడినే నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఓ కమలాలయా! నన్ను కాపాడు స్వామీ! అని గజరాజు వేడుకున్నాడు. ఇక ఆ భగవంతుడు తప్ప అన్యులెవరూ నన్ను కాపాడలేరు అని స్థిర నిర్ణయం చేసుకొన్నాడు.
***
అలవైకుంఠ పురంలో లక్ష్మీదేవితో సేవలందుకుంటున్న నారాయణుని చెవులకు గజేంద్రుని ఆర్తనాదం వినిపించింది. అయ్యో నేను ఎలాగైనా ఈ గజేంద్రుడిని కాపాడాలి అనుకొన్నాడు.
అజ్ఞానంతో గర్వం పొందిన హూహూ అనే గంధర్వుడే కదా దేవలముని వల్ల శాపం పొంది మొసలి రూపాన్ని ధరించాడు.
ఇదిగో ఈ సమయమే కదా హూహూ గంధర్వుని శాపం తీరే సమయం. ఇక నేను నా పాంచజన్యాన్ని పూరించి ఆ హూహూ కు శాపవిమోచనం కలిగించాల్సిందే అనుకొన్నాడు ఆ వైకుంఠ వాసుడు.
ఇటు చూసినా ననే్న నమ్ముకున్న గజేంద్రుడు. పూర్వజన్మలో ఇతడే కదా ఇంద్రద్యుమ్నుడు. నా గురించి తపస్సు చేస్తూ నా గురించిన ధ్యానం చేస్తున్నపుడే కదా అక్కడికి అగస్త్యుడు వచ్చింది.
నా నామస్మరణలో మైమరిచి ఉండడం వల్లనే కదా అగస్త్యుని గౌరవించలేకపోయింది. కానీ ఇదేమి తెలియని అగస్త్యుడు ఇంద్రద్యుమ్నుని అజ్ఞానం తాండవమాడే ఏనుగుగా పుట్టమని ఆ అగస్త్యుని శాపం ఇచ్చాడు కదా. ఆ శాపాన్నిన తొలగించి తిరిగి నా దరికి చేర్చుకోవాల్సింది నేను కదా. ఎవరైనా సరే భగవంతుడిని ఎంత మెప్పించినా భాగవతులను అగౌరపరిస్తే వారి కోపానికి గురి కావాల్సిందే అని ఈ ఏనుగుగా పుట్టిన ఇంద్రద్యుమ్నుడు తెలియచెప్పాడు. ఇక నేను ఏమాత్రం జాగు చేయకుండా ఆ ‘హూహూ’ ను, ‘ఇంద్రద్యుమ్నుని’ సంరక్షించాలి సుమా అనుకొంటూ తన చేతిలో ఉన్న లక్ష్మీదేవి చీర చెంగును వదలిపెట్టకుండానే ఎవరికీ ఏమీ చెప్పకుండానే అలా వేగంగా ముందుకు నడిచాడు.
***
అరవింద దళాయ తాక్షుడు, వరదుడు, భక్తవత్సలుడు ఉన్నట్టుండి తన చెంగును వదలిపెట్టకుండానే ముందుకు వెళ్లిపోతున్న వైకుంఠుని చూసి లక్ష్మీ దేవీ ఏమి చేయాలో తోచక ఆయన అడుగులో అడుగు వేసుకొంటూ వైకుంఠుని వేగంతో పోటీ పడుతూ ఆయన వెంట వెళ్లుతోంది.
ఇదేమిటి లక్ష్మీనారాయణులిద్దరూ ఇంత హఠాత్తుగాను, ఇంత హడావుడిగాను మాట మాత్రంగానైనా చెప్పకుండానే వెళ్లిపోతున్నారే.. ఎక్కడి కై ఉంటారు సుమా అనుకొంటూ గరుడుడూ స్వామి అమ్మవార్లవెంట పరుగులెత్తారు. వీరందరూ వెళ్తున్నారు అనుకొంటూ శంఖు, చక్రం కూడా బయలుదేరారు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804