డైలీ సీరియల్

ష్...11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాప చేతిలోని రిమోట్ కారు బాంబు అమర్చిన రిమోట్ కారు. ఏ క్షణంలోనైనా పేలడానికి, విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రమాద ఘంటికను సూచిస్తోంది.
కులకర్ణి వేగంగా ఫస్ట్ఫో్లర్ వైపు పరుగెడుతూనే ... అంతకన్నా వేగంగా ఆలోచిస్తున్నాడు. అతని పోలీస్ బుర్రలో మెదిలిన అనుమానం.. నిజమని చెప్పడానికి తగిన ఎవిడెన్స్ అతని దగ్గరుంది.
అయిదేళ్ల పాప ఫస్ట్ఫో్లర్‌లోనికి ఎలా వెళ్ళగలుగుతుంది. అందులోనూ ఆ పాపచేతిలో వున్న రిమోట్ కారు.. అతని అనుమానానికి మరింత బలాన్ని చేకూర్చింది.
అతను మృత్యువును వెంటాడుతూ పరుగెత్తటంలేదు. మృత్యువును ఆపటానికి పరుగెత్తుతున్నాడు.
***
ప్రియంవద పాపను ఎత్తుకుని ముద్దాడుతూ ‘‘ఎవరు పాపా నువ్వు’’ అని బుగ్గలమీద ముద్దుపెట్టుకుంటూ అడిగింది.
‘‘నేనేమో మా అమ్మ పాపను, తర్వాత డాడీ పాపను’’ అంది ముద్దు ముద్దుగా.
ప్రియంవదలో చిన్న ప్రకంపనం.
తను తల్లి అయితే తన బిడ్డ కూడా ఇలాగే ముద్దుగా ఉంటుంది కదూ. మాతృత్వపు మమకారం. ‘మమజీవనహేతునా’ అన్న భర్త జ్ఞాపకం రెండూ కలిసి ఆమె చేతిని అప్రయత్నంగా ఆమె పొట్టమీదకు చేర్చింది.
ఒక ఉద్వేగ కెరటం అనుభూతి తీరాన్ని చేరింది.
ఆ పాప కిందికి దిగి ఎదురుగా వున్న వృద్ధుడి వైపు చూస్తోంది. అతని బొటనవేలు రిమోట్ మీద ఎరుపు రంగు బటన్‌ను ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉంది.
***
కులకర్ణి వింటినుంచి సంధించిన బాణంలా ఫస్ట్ఫో్లర్‌కు దూసుకొచ్చాడు. ఆ వేగానికి పక్కన వున్న నర్సు తూలిపడబోయింది. ఆమె చేతిలోని మెడిసిన్స్ వున్న ట్రే గాల్లోకెగిరి.. అక్కడ వున్న వృద్ధుడి చేతిని తాకింది. ఆ అదురుకు.. అప్రయత్నంగా అతని చేతిలోని రిమోట్ నేలజారింది.
ఆ వృద్ధుడు ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూ అక్కడికి వేగంగా వచ్చిన కాలయముడిలా వున్న కులకర్ణిని చూసి రెండుడుగులు వెనక్కి వేశాడు.
సరిగ్గా అప్పుడే ఆ చిన్నారి పాప రిమోట్ దగ్గరికి పరుగెత్తి రిమోట్ చేతిలోనికి తీసుకుని ‘‘ఓల్డ్ అంకుల్.. మీ రిమోట్’’ అంటూ అతనికివ్వబోయింది.
కులకర్ణి క్షణంలో వెయ్యోవంతులో రియాక్ట్ అయ్యాడు.
వెంటనే అపరిచిత వృద్ధుడు యాంగ్జైటీగా ‘‘పాపా! ఆ రిమోట్ ఇవ్వు, కారు నీకే ఇచ్చేస్తానన్నాడు’’.
కులకర్ణి ముఖమంతా స్వేదం అలుముకుంది. ఆ పాపకు చెప్పే సమయం కూడా లేదు. పైగా పాపకు హాని జరిగే అవకాశం కూడా వుంది.
అతని పోలీస్ డిక్షనరీలో చేర్చిన ఒకే ఒక పదం మనిషి ప్రాణాన్ని కాపాడటం. భారత రాజ్యంగం ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షాస్మృతి చెప్పే మానవతా ధర్మం కూడా అదే. ‘‘వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక నిర్దోషి శిక్షకు గురవకూడదు’’.
పాప మార్చి మార్చి ఇద్దరినీ చూస్తోంది. అయిదేళ్ళు కూడా నిండని ఆ చిన్నారి చేతిలో కొన్ని వందల ప్రాణాలున్నాయి.
‘ఇది విధాత లిఖించని లలాట లిఖితమా’! అప్పటికే ఆ పాప తల్లిదండ్రులు కులకర్ణి దగ్గరికి చేరి తమ బిడ్డను చూస్తున్నారు. వాళ్ళకు సగం అర్థం అయింది. ప్రమాదం అవగతమయింది.
పాప నిర్ణయంమీద కొన్ని వందల ప్రాణాలే కాదు. తమ బిడ్డ జీవితమూ ఆధారపడి ఉంది.
ప్రియంవద నిశే్చష్టురాలైంది.
ఆ చిన్నారి కులకర్ణి వైపు చూసింది. తమ తల్లిదండ్రులు పోలీస్ అంకుల్ పక్కన నిలబడి వున్నారంటే పోలీస్ అంకుల్ మంచివాడు.
వెంటనే ఆ చిన్నారి ఆ అజ్ఞాత వృద్ధుడి వైపు చూస్తూ ‘‘నువ్వు బాడ్ ఓల్డ్ అంకుల్’’ అని కులకర్ణివైపు చూసింది.
కులకర్ణి అది ఆలోచించడంలేదు. అతని పోలీసు కళ్ళు.. ఎక్స్‌రే కిరణాలుగా మారి.. అపరిచిత నడుమువైపుచూసాయి.
అతని నుదుటిమీద చెమట ఎక్కువైంది. బాంబ్ హ్యూమన్ బాంబ్.. బెల్ట్ బాంబ్.. ద మోస్ట్ డేంజరస్.. సూసైడ్ పర్సన్. తనకు తాను ఆత్మాహుతి చేసుకునే ఆత్మాహుతి దళము మనిషి.
ఎవరికోసమో విధ్వంసకర రచన.. ఆలోచిస్తూనే.. తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన పాపను పాప తల్లిదండ్రులకు అప్పగించాడు.
పాప తన ఎడమ చేతిలో వున్న రిమోట్ కారును పక్కనున్న డస్ట్‌బిన్‌లో వేసి ‘బ్యాడ్ కారు’ అంది..
కులకర్ణి రిమోట్‌ను తన యూనిఫాంలో పెట్టుకుని.. రెండంగల్లో అతన్ని సమీపించాడు.
అప్పటికే అతను కిందికి పరుగెత్తాడు. క్షణాల్లో హాస్పిటల్ తలుపులు దాటాడు. అతను దొరకడని కులకర్ణికి అర్థం అయింది.
రిమోట్ బటన్‌లో వున్న వైర్లను డిప్యూజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో అతను ఓ విషయాన్ని విస్మరించాడు.
అక్కడ ప్రియంవద లేదు..
***
ఈ సంఘటన జరిగిన పదిహేను నిముషాల తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక సమాచారమందింది. వాళ్ళు వెంటనే ఆ విషయాలను ఏసిబి కులకర్ణికి చేరవేశారు. హాస్పిటల్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం పడి వుంది. కులకర్ణి వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి దృశ్యాన్ని చూసి షాకైయ్యాడు.

ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి)