డైలీ సీరియల్

కావాలనుకొంటే..సరిపోతుందా? ( యయాతి - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటిని అధిగమించడానికి కచుడు ఎక్కువ కష్టపడుతుండేవాడు. నేను ప్రతిరోజు కచుడిని చూసి ఎంతో సంతోషంతో ఉండేదానిని. అతనిని నేను ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమాధిక్యతతో రాక్షసులు ఎన్నో మార్లు కచుడిని చంపివేసినా మా తండ్రికి వచ్చిన మృత సంజీవనీ విద్య ద్వారా నేను బతికించే ఏర్పాట్లు చేశాను. చివరకు ఒకనాడు కచుడిని రాక్షసులు అడవిలో చంపివేసి కాల్చి బూడిద చేసేశారు. అంతటితో ఆగక వారు ఆ కచుని బూడిదను అంతా సురాపానంలో కలిపివేశారు. సురాప్రియుడైన మా తండ్రి చేత ఆ సురనంతా తాగించారు.
***
కచుని కోసం ఎదురు చూస్తున్న నాకు సాయంసంధ్యాసమయంలో కచుని జాడ తెలియలేదు. ఏమి జరిగిందో సమిధలకు వెళ్లిన కచుడిని రాక్షసులు చేయకూడనది ఏదైనా చేశారేమో అని ఎంతో వ్యాకులపడ్డాను. రాత్రి గడిచినా కచుని జాడ తెలియరాలేదు. అపుడు మా తండ్రి దగ్గరకు వెళ్లి అడవికి వెళ్లిన కచుడు తిరిగి రాలేదని చెప్పాను. మాతండ్రి , నేను తెల్లవారిన తరువాత వెళ్లి వెతికాము. కానీ ఎక్కడా కచుని జాడ తెలియలేదు. దానితో నేను ఎంతో కుమిలిపోయాను. నా బాధ చూడలేక నా తండ్రి కచుడు ఏమై ఉంటాడని తనకున్న దివ్య దృష్టితో చూశాడు. అపుడు కచుడని రాక్షసులు బూడిదగా చేసినట్టు ఆ బూడిద కలిపిన సురను మా తండ్రే తాగివేసినట్టు తెలుసుకొన్నాడు.
***
నేను ఎలాగైన కచుడిని బతికించమని నా తండ్రిని వేడుకున్నాను. అపుడు కడుపులో బూడిద రూపంలో ఉన్న కచుడితో శుక్రాచార్యుడు నేను నీకు మృత సంజీవని విద్యను నేర్పిస్తాను. నీవు నేర్చుకుని నా కడుపు నుంచి వెలుపలికి రమ్ము. అపుడు నా ఉదరం చీలి పోతుంది కనుక నేను మృతుడిని అవుతాను. కానీ నేను నీకు నేర్పిన మృత సంజీవని విద్యతో నన్ను పునర్జీవితుడిని చేయుము అని కచుడితో మా తండ్రి చెప్పాడు. తాను ఎలాగూ మృతసంజీవనీ విద్యను నేర్చుకోవడానికే వచ్చా నని కనుక మీరీ విధంగా చేస్తే నేను తప్పక మీకు ఉపయోగ పడుతానని చెప్పాడు.
వెనువెంటనే మా తండ్రి మృతసంజీవని విద్యను కచుడికి ఉపదేశించాడు. అతడు దాని వల్ల శుక్రాచార్యుని ఉదరం నుంచి వెలుపలకు వచ్చాడు. తిరిగి మాతండ్రిని కచుడు తాను నేర్చుకున్న విద్య సహాయంతో బతికించాడు.
***
అపుడు కచుడు తాను వచ్చిన పని అయిందని, మీ దీవనతో నేను కోరిన విద్యను మీరుప్రసాదించారు. ఇక నాకు సెలవు ఇవ్వండి. నేను నాలోకానికి వెళ్తాను అని అన్నాడు. అపుడు మా తండ్రిగారు కూడా కచునికి సెలవు ఇవ్వడానికి ఉద్యుకలయ్యారు.
ఈ సంఘటన అంతా చూస్తున్న నాకు మతిపోయింది. నేను కోరుకున్నదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి ? అనుకొన్నాను. అట్లా మా తండ్రిగారి దగ్గర సెలవుతీసుకొని వెళ్లిపోబోతున్న కచుడిని నేను ఆపాను. నా సంగతి ఏమిటని అడిగాను. అతడు విభ్రాంతితో చూశాడు.. ఏమిటని ననే్న ప్రశ్నించాడు. అపుడు నేను సిగ్గు విడిచి నా మనసులో మాట చెప్పాను. నేను నిన్ను అమితంగా ప్రేమించాను. నీవులేనిదే నేను బతకలేనని చెప్పాను. ఎంతో బతిమిలాడాను. కానీ కచుడు మాత్రం ఇది ధర్మవిరుద్ధమైన విషయం. నీవు నాకు సోదరివి. నాకు చెల్లెలు తో సమానం. గురుపుత్రివి అయి ఉండి ఇలాంటి ప్రేలాపనలు చేయడం తగదని బుద్ధి చెప్పబోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను ప్రేమించానని చెప్పడం వల్ల నీవు నన్ను చులకన చేస్తున్నావని అన్నాను. కానీ అతడు పట్టిన పట్టు వీడలేదు. నీవు నాకు చెల్లెలివే అవుతావుకానీ ఇంకొంక సంబంధం మన మధ్య ఉండదు అని ఖరాఖండిగా చెప్పేశాడు.
నాలో కోపం ఎక్కువైంది. ఉచితానుచితాలను నేను పట్టించుకోలేదు. వెంటనే నీకు మా తండ్రి నేర్పిన విద్య నావల్లనే. నీవు ఎన్నో సార్లు చనిపోతే నేనే నిన్నుబతికించుకున్నాను. ఇదంతా కేవలం నీపై ఉన్న ప్రేమతోనే అన్నాను. కానీ అతడు నీవు నన్ను బతికించావు అంటే నీవు నాకు మాతృసమానురాలివి. కనుక నీకోరిక అసంబద్ధమైంది అని అన్నాడు.
ఇట్లా కచుడు ఎన్ని మార్లు నేను అడిగినా అతని మనసు చలించలేదు. దానితో నాకు కోపం వచ్చి నీవు నా తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య నీకు ఉపయోగపడదు అని శపించాను. కానీ అతడు వెంటనే నాకు ఉపయోగ పడకపోయినా నేను ఇతరులకు ఉపదేశిస్తాను. వారికీ విద్య ఉపయోగపడుతుందిలే అన్నాడు. అంతేకాక ....

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి