డైలీ సీరియల్

మమకారమూ మోహాంధకారమే ( యయాతి - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్మిష్ఠ కోరిక మీద నేను తన వేయిమంది చెలికత్తెలం అందరం కలసి వనవిహారానికి వచ్చాం. ఇక్కడ చల్లని నీరున్న తటాకాన్ని చూసి మేమంతా జలకాలాటలు ఆడుదాం అనుకొన్నాం. వెంటనే అందరూ స్నానానికి ఇక్కడి పొదల్లో బట్టలు విడిచి పెట్టి ఆ తటాకంలోకాలుపెట్టాం. మేమంతా ఎంతో సంతోషంతో జలక్రీడల్లో మునిగి పోయి ఉంటే అపుడే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. పరమేశ్వరుని ముందుకు మేము నగ్నంగా ఎలా వెళ్తాం అనుకొని వారు మా చెంతకు వచ్చేలోగానే మేము చీరలు కట్టుకోవాలని తొందర తొందరగా గట్టు చేరి మేము మా వస్త్రాలు దాచిన పొదల్లోకి వచ్చాం.
అదుగో అపుడే శర్మిష్ఠ నా చీరకట్టుకునేసింది. నేను నా చీరను కట్టుకున్నావు. ఇది బ్రాహ్మణులు కట్టుకునే చీర . నీవు క్షత్రియ వనిత వి కదా. ఎలా కట్టుకుంటావు అన్నాను. అపుడు ఆ పొగరు పోతు శర్మిష్ఠ ఆ తొందరలో కట్టుకున్నాను లే. నా చీర అక్కడే ఉంది కదా దానిని నీవు కట్టుకో. తిరిగి నీకు ఇంటికి వెళ్లిన తరువాత నీచీరను నీకు ఇచ్చేస్తాను అంది. ఆ క్షత్రియ యువతి కట్టి విడిచిన చీరను నేను ముట్టుకుంటానా ? ఆ సంగతి తెలియదా ఆమెకు. అదిగో నేను వాదులాడుతుంటే నాకు బదులు చెప్పకుండా తన చెలికత్తెలను ప్రోత్సహించి నన్ను ఈ దిగుడు బావిలో పడవేసి వారంతా వెళ్లిపోయారు. నేను ఎంతో కష్టపడి ఎలాగోలా భగవంతుని దయవల్ల ఇక్కడికి వచ్చాను. నేను ఆ వృషపర్వుని రాజ్యంలోకి అడుగు పెట్టను. నీవు నా బట్టలు తెచ్చి ఇచ్చి నా తండ్రి గారి దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పి నేను కావలంటే నాకోసం ఇక్కడికి రమ్మను. నేను అక్కర్లేదనుకొంటే అక్కడే ఉండమనిచెప్పు’అని తన చెలికత్తెతో చెప్పింది.
అయోమయంగా ఉన్న విషయాన్ని విన్న చెలికత్తె పరుగు పరుగు న వెళ్లి దేవయానికి బట్టలు తెచ్చి ఇచ్చింది. ఆ తరువాత జరిగిన విషయాన్నంతా శుక్రాచార్యునికి తెలిపింది. కూతురిపై వ్యామోహం ఉన్న శుక్రాచార్యుడు గబగబా కూతురు దగ్గరకు వచ్చాడు. తాను ఎంతో బతిమిలాడాడు. రాజులతో వ్యవహారం మంచిది కాదని చెప్పాడు. దేవయానిని అపురూపంలో చూస్తానని చెప్పాడు. శర్మిష్ఠ నీకన్నా చిన్నది కనుక నీవు క్షమించమని కూడా చెప్పాడు. రాజకుమార్తె అమాయకంగా తప్పు చేసింది అనుకో. నీవు ఆమెను క్షమించి నీవు ఇంటిరా అని ఎన్నో విధాలుగా శుక్రుడు తన తనయకు చెప్పాడు. కానీ ముద్దుగా అతిగారాబంగా పెరిగిన దేవయానికి తండ్రి మాటను వినలేదు. తన పట్టును వదిలేది లేదని చెప్పింది.
***
ఇలా వారిద్దరూ అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. రాజప్రాసాదంలో ఉన్న శుక్రాచార్యుడు వడివడిగా ఎందుకు ఎక్కడికి వెళ్లాడో అని, చెలికత్తె వచ్చి ఆయనతో చెప్పిన విషయం ఏమై ఉంటుందో అని వృషపర్వుడు చాలా వేదన చెందాడు. తన చారులను పంపి జరిగిన విషయం తెలుసుకున్నాడు. దేవయాని మొండి తనం తెలిసిన వృషపర్వుడు తన కూతురును మందలించి గురువుకు ఆగ్రహం వస్తే వంశమే నాశనవౌతుంది. కనుక నేను చెప్పినట్లు నీవు వినవలసింది. నేను ఆ దేవయాని కోపాన్ని పోగొట్టడానికి వెళ్తున్నాను అని చెప్పి శుక్రాచార్యుని వెతుక్కుంటూ వెళ్లాడు.
***
దేవయానిని సంతోషపెట్టలేక, ఆమె ఆగ్రహాన్ని పోగొట్టలేక అవస్థపడుతూ సతమతమవుతున్న శుక్రాచార్యుని వృషపర్వుడు చూశాడు.
అమ్మా దేవయాని జరిగిన దానిని నేను క్షమాభిక్ష వేడుతున్నాను. నీవు కోపం తగ్గించుకో తల్లీ వృషపర్వుడు కూడా ప్రాధేయ పడ్డాడు. అహంకారి అయిన దేవయాని నేను ఒక షరత్తును విధిస్తాను. అపుడు మాత్రమే మీ మాట వింటాను అని తండ్రితో చెప్పింది.
ఏమిటో షరత్తు కనుక్కోమని వృషపర్వుడు గురువుతో చెప్పగా దేవయాని శర్మిష్ఠ తో సహా వేయి మంది చెలికత్తెలు తనకు దాసీ జనంగా ఇస్తే వృషపర్వుని రాజ్యంలోకి వస్తాను అని చెప్పింది.
హతాశుడైన శుక్రాచార్యుడు ఇట్లా అడగడం బాగులేదని తన కూతరుకి నచ్చచెప్పబోయాడు. కానీ దేవయాని పట్టిన పట్టు వదలకపోయేసరికి నిరాశ చెందాడు. అపుడు అక్కడే ఉన్న వృషపర్వుడు కల్పించుకుని నీకు నా కూతురుతో సహా ఆమె వేయిమంది చెలికత్తెలను దాసీ జనంగా ఇస్తున్నాను. మీరు ఇక లేచి రాజ్యంలోకి రామ్మా అని వృషపర్వుడు చెప్పాడు. ఆ మాటతో దేవయాని ముఖం వికసించింది. అపుడు రాజు, తండ్రి వెంటరాగా శుక్రాచార్యుని ఆశ్రమానికి దేవయాని తరలి వెళ్లింది.
***
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804