డైలీ సీరియల్

ఘటనలన్నీ దైవ నిర్ణయాలే ( యయాతి -5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగతి తెలుసుకొన్న శర్మిష్ఠ తాను ఎంత పొరపాటు చేసానో అని వాపోయింది. దీని కోసం ఇంత పెద్ద శిక్ష నా తండ్రి చేత పొందవలసి వచ్చింది. ఏమి చేద్దాం. కాలం కలసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది. మంచి రోజులు నాకును రాకపోతాయా. దేవయాని ని చూసి మా తండ్రిని నేను కష్టపెట్టబోను. తండ్రి చెప్పినట్లే దేవయానికి దాసిగా వెళ్తాను అనుకొంది. తండ్రి రాగానే నన్ను క్షమించమని అడుగుతూ తాను దాసీగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.
కూతురు మాటలు విని వృషపర్వుడు హాయిగా ఊపిరి తీసుకొన్నాడు.
***
అట్లా ఇల్లు చేరిన దేవయాని సమయం చూసి తండ్రితో యయాతి విషయాన్ని చెప్పింది. కచుడు శాపం, దేవయాని మొండి తెలిసిన శుక్రాచార్యుడు యయాతి దగ్గరకు వెళ్లి తనకు అధర్మం వల్ల వచ్చే పాపం అంటకుండా ఉండేట్లుగా చేసి దేవయానిని యయాతి మహారాజుకిచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత శర్మిష్ఠ తో సహా దేవయాని దాసీ జనాన్ని కూడా యయాతి కి అప్పజెప్పుతూ శర్మిష్ఠ గురించి చెప్పి కాలగమనంలో నీవు ఎప్పుడూ శర్మిష్ఠతో మాటలాడపోకు. నా కూతురును కష్టపెట్టబోకు. శర్మిష్ఠకు సుఖాలు కలిగించాలని తలపోయకు అని చెప్పాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే వింటూ దేవయానిని ఆమె దాసీ జనాన్ని తీసుకొని తన రాజ్యానికి వచ్చాడు.
కాలం సంతోషంగా గడిచిపోతోంది. శర్మిష్ఠను దూరంగా పెడుతూనే దేవయాని తన తో సేవలను పొందుతూ ఉంది.
***
శర్మిష్ఠ తాను చేసిన చిన్న తప్పుకు పెద్ద శిక్ష దేవుడు వేశాడని ప్రతిరోజు తలపోస్తూనే చింతిస్తూ ఉన్నది. కాలం ఎవరికోసమూ ఆగదు కనుక దేవయాని యయాతీ సుఖభోగాలను అనుభవిస్తూ మహారాణిగా గౌరవాన్ని అందుకుంటూ ఉంది. శర్మిష్ఠకు దేవయానిని చూసినప్పుడల్లా రాజకూతురి ని అయి ఉండి కూడా ఈరోజు నేను ఈమె అహంకారం వల్ల దాసీగా బతకాల్సి వస్తోంది అనుకొనేది.
శర్మిష్ఠ ఓ శుభమూహూర్తంలో పుష్పవతి అయింది. అసలే సౌందర్యవతి అయిన శర్మిష్ఠ మరింత అందంగా తయారు అయింది. ఆమెలో యవ్వన ప్రభావం వల్ల ఎన్నో కోరికలు పుట్టాయి. ఆమెలో తల్లి కావాలన్న ఆశ మొలకెత్తింది.
***
దైవ నిర్ణయం వల్ల ఓరోజు యయాతి ఉద్యానవనం లో విహరిస్తున్నప్పుడు శర్మిష్ఠను చూశాడు. ఆహా! ఎంత సౌందర్యవతి నో కానీ శుక్రాచార్యుని ఆజ్ఞ, దేవయాని షరత్తులు ఇవన్నీ శర్మిష్ఠను బాధిస్తున్నాయి అనుకొన్నాడు. అసలే క్షత్రియ వనిత. పౌరుషం , పరాక్రమమూ, నిజాయితీ ఇవన్నీ కలసిన మహిళ కనుక ఓరోజు యయాతీ ఉద్యానవనం లో విహరించడం చూసి దగ్గరకు వెళ్లి ‘ఓ యయాతీ మహారాజా! నన్ను అనుగ్రహించండి. నాకూ మీ ప్రతిరూపాన్ని ప్రసాదించండి’అని వేడుకుంది.
ఆమె మాటలు అర్థమయిన యయాతీ ఇది నా ప్రతిజ్ఞను భంగం చేస్తుంది. నేను దేవయానిని కష్టపెట్టనని మాట ఇచ్చానని చెప్పాడు. శుక్రాచార్యునికి ఈవిషయం తెలిసినా ఆయన కూడా ఊరుకోడని చెప్పాడు.
కానీ శర్మిష్ఠ ‘ఓరాజా! ఒక ఋతుమతి అయిన స్ర్తి తన కోరికను తీర్చమని అడిగినపుడు తీర్చకపోవడం కూడా అధర్మమే. మీరు క్షత్రియులు కనుక మీరు నాకోరికను తీర్చడంలో నాకు కొడుకును ప్రసాదించడంలో తప్పు ఏమాత్రం ఉండదు’అని చెప్పింది.
కొన్నాళ్లు గడిచాయి. దేవయానికి యదు, తుర్వసుడు అనే కుమారులు కలిగారు.
శర్మిష్ఠ మళ్లీ తన పంతం సాగించుకోవాలని అదునుకోసం చూస్తున్నది.
మరోరోజు ఒంటరిగా ఉన్న యయాతి మహారాజు దగ్గరకు వచ్చి తన కోరికను తెల్పింది. తన మనసులో ఉన్న బలమైన కోరికను, శర్మిష్ఠ కోరికను కాదనలేక శర్మిష్ఠను యయాతీ మహారాజు శుక్రాచార్యునికి, దేవయానికి తెలియకుండా వివాహం చేసుకొన్నాడు. వారిద్దరూ భార్యభర్తలయ్యారు. ఎవరికీ ఈ విషయం తెలియకుండా యయాతీ మహారాజు, శర్మిష్ఠ ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. కానీ ఇది దాగని విషయాలను వెల్లడి చేసే విషయమే కదా.
దైవ నిర్ణయాల వల్ల జరిగే ఘటనలు ఎవరూ ఆపలేరు అన్నది నిజమే కదా.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804