డైలీ సీరియల్

ష్‌...-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదంతా నాకు ఏదో చేతబడిలా అనిపిస్తుంది. నాకెందుకో ఒక్కసారి గాలిబాబా దగ్గరికెళితే బాగుండనిపిస్తుంది’’ అంది ప్రియంవద.
వెంటనే కిరణ్మయి నొసలు ముడివేసి ‘గాలిబాబా.. అతనెవరు?’ అడిగింది.
వెంటనే ప్రియంవద ‘‘అతనికి తెలియని విషయం లేదు. పురాణాల నుంచి సైన్స్ వరకు ఎన్నో చెప్పగలడు’’ అంది.
కిరణ్మయి ఆశ్చర్యంగా కాసింత అనుమానంగా చూసి ‘‘సరే మీ ఇష్టం’’ అంది.
ప్రియంవద వెంటనే హుషారుగా ‘‘అయితే వెళ్దామా’’ అంటూ తయారవసాగింది.
***
గాలిబాబా ఆశ్రమం..
ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. మనిషి బలహీనతతో ఆడుకునేవాడు. ఒకడు రాజకీయ నాయకుడు, మరొకడు ఇలాంటి బాబాలు.. వ్యాపారంలో కల్తీ చేస్తే.. ఇలాంటి బాబాలు మనుషుల మూఢ నమ్మకాలతో, బలహీనలతో, భయాలతో ఆడుకుంటారు.
నమ్మకం మనిషికి ఆత్మ విశ్వాసం. తార్కిక జ్ఞానం మనిషికి కలిగించాలి. కాని గాలిబాబా లాంటి వాళ్ళు.. మనుషుల నమ్మకాలకు.. అపనమ్మకాలు జోడించి, భయాన్ని భూతద్దంలో చూపించి వారి బలహీనతలను ‘క్యాష్’ చేసుకుంటారు. పదుల ఎకరాల్లో విస్తరించి వున్న ఆ ఆశ్రమంలో చాలాచోట్ల రహస్య కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. గాలిబాబా ముసుగు.. ఒక తోడేలుకు మనిషి ముసుగు వేసినట్టుగా ఉండే వాడే గాలిబాబా..
***
ఎతె్తైన సింహాసనం మీద పొడవాటి గడ్డం (అది పెట్టుడు గడ్డం అని ఊహించలేనంత టెక్నాలజీ విదేశాలనుంచి తెప్పించబడింది)
కేవలం మాట్లాడే టెక్నిక్‌ను ఆసరా చేసుకుని తన మాటల గారడీతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నాడు. అతని చెవికి వున్న బ్లూటూత్ నుంచి మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని మీటర్ల దూరంలో వున్న రికార్డర్ వాయిస్ ద్వారా అతని చెవిలో చేరుతున్నాయి.
ఒక విధంగా సినిమాలో ప్రామ్టింగ్‌లాంటిది. గాలిబాబా పెదవులు కదులుతున్నాయి.
‘‘విష్ణువు నాభి నుంచి కమలం ఉద్భవించింది. ఆ కమలం నుండి బ్రహ్మ పుట్టాడని భాగవతం చెప్తుంది. భూమిపై నిలబడి పరిశీలిస్తే ఈ అనంతకోటి గెలాక్సీలతో వున్న విశ్వరూపం.. ఆది అంతాలు మనకు తెలియవు.
విష్ణువు నాభి స్థానానికి చేరిన బ్రహ్మకు ఎదురైన పరిస్థితి ఇదే. అనంతమైన విశ్వరూపం అతనికి అర్థంకాలేదు. తిరిగి తన కమలంలోకి చేరుకున్నాడు. యోగనిద్రలోకి వెళ్లిపోయి వంద సంవత్సరాలు గడిపాడు. అప్పుడు మహావిష్ణువు కనిపించి.. తానే ఆ విశ్వానికి మూలమని, అంతా తనలోనే ఇమిడివుందని, జీవసృష్టి చేయమని ఆదేశించాడు..’’ అని అక్కడున్న జనం వైపు చూసి ‘‘నా భక్తులారా ప్రకృతి ఉద్భవించిన నాటినుండి యుగాల లెక్క మొదలవుతుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపి ఒక మహాయుగంగా లెక్కవుతుంది. ఒక వేయి మహాయుగాలు కలిపితే ఒక కల్పకం అవుతుంది.
ప్రస్తుతం నడుస్తున్నది శే్వత వరాహకల్పం. కల్పక కాలాన్ని పదునాలుగు మంది మనువుల పరిపాలన కాలంగా చెపుతారు.
ఆగి.. చెవులు రిక్కించి అవతలివైపు నుంచి వస్తున్న రికార్డ్ వాయిస్ వింటూ తిరిగి కొనసాగించాడు. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ తాపసి, రైవత, వైవస్వత, సూర్య, అగ్ని, బ్రహ్మ, రుద్ర తదితరులు పదునాలుగుమంది మనువులు. వీరు వ్యక్తులు కాదు శక్తులు అని గంభీరంగా చెప్పి జనం వైపుచూశారు.
జనం తన్మయులై వింటున్నారు. వారికి అర్థంకాని విషయం అయినా వింటున్నారు. ఎంత గొప్ప పాండిత్యమని మురిసిపోతున్నారు.
ఆ జనంలోనున్న బాబా అనుచరులు ‘గాలి బాబాకు జై’ అన్నారు. అంతే.. అక్కడ ‘గాలిబాబాకు జై’అన్న నినాదాలు మారుమోగాయి. దీనే్న ‘మాస్ హిస్టీరియా’ అంటారు..
ఆశ్రమం ముందు కారాగింది.
సెక్యూరిటీ గార్డు ఆ కారు నెంబరును నోట్ చేసుకుని ఎలక్ట్రానిక్ గేట్‌ను తీశాడు. కారు లోపలకి వెళ్ళే ముందు కారు లోపల ఏమైనా మారణాయుధాలున్నాయేమోనని చెక్ చేశాడు.
కిరణ్మయికి మింగుడుపడని విషయం.. ‘‘ఒక బాబా ఆశ్రమం ఇంత పకడ్బందీగా, శతృదుర్బేధ్యంలా ఉంటుం దా?’’
‘‘ఆ క్షణం కిరణ్మయికి తెలియదు, తాను మృత్యువును వెతుక్కుంటూ వచ్చానని..’’
***
సులోచన కిరణ్మయికి ఫోన్ చేసింది.. హాస్పిటల్‌లో ప్రద్యుమ్న గురించి, ప్రియంవద గురించి అడగాలని.. కానీ కిరణ్మయి ఫోన్ రీచ్ అవ్వటంలేదు.
కాసేపాగి మళ్లీ ప్రియంవద మేడమ్ ఫోన్‌కు కాల్ చేసింది. ప్రియంవద ఫోన్ స్విచ్చ్ఫా వస్తోంది.
***
‘‘మేడమ్... మీకు ఈ బాబా తెలుసా?’’ అడిగింది కిరణ్మయి ప్రియంవదని.
‘‘మా ఫ్రెండ్‌కు తెలుసు.. చాలా మహత్తు వున్న బాబా.. నీకు నమ్మకం లేదా?’’
‘‘లేదు మేడం.. ఒక పుస్తకంలో ఒక రచయిత రాసిన కథలో.. సారీ సీరియల్‌లో చదివా..
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482