డైలీ సీరియల్

ఆగ్రహమే అనర్థాలకు హేతువు ( యయాతి -6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లకు శర్మిష్ఠ గర్భవతి అయింది. ఆమెకు ద్రుహ్యుడు అన్న కుమారుడిని కన్నది. శర్మిష్ఠ ఎంతో ఆనందించింది. యయాతీ మహారాజు కూడా తన కుమారుడిని చూసుకొని తన ప్రతిబింబమే అనుకొని ముచ్చట పడ్డాడు.
కాలం హాయిగా గడుస్తున్నపుడే శర్మిష్ఠ అనువు, పూరువు అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. వారు ముగ్గురు దిన దిన ప్రవర్థమాన మవుతూ సూర్యుని వలె మహాతేజోవంతులు అవుతున్నారు. వారిలో కొట్టవచ్చినట్లు యయాతీ పోలికలు కనిపిస్తున్నాయి.
***
మరికొన్నాళ్లు గడిచాయి. దేవయాని ఉద్యాన వన విహారానికి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న యయాతి ముగ్గురు కుమారులను చూచింది. యయాతీ వలె ఉన్న వీరిని చూసి దేవయానికి అనుమానం వచ్చింది. వీరు తప్పక శర్మిష్ఠ కుమారులై ఉంటారని అనుకొన్నది. వెంటనే వారిని పిలిచింది. మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. అమాయకులైన ఆ పిల్లలు శర్మిష్ఠ యయాతీ మహారాజులు మా తల్లి దండ్రులు అని చెప్పారు. కోపం మితిమించింది.
వెంటనే రాజభవనానికి వచ్చింది. నేరుగా యయాతీ మహారాజు దగ్గరకు వచ్చింది. యయాతిని నిలదీసింది. ఇచ్చిన మాటను కాదని ఈ తప్పు ఎలా చేశావని గట్టిగా అడిగింది. ఏదో మనసు ఊరుకోక కోరికను నిగ్రహించుకోలేక ఇలా జరిగిపోయింది అని యయాతీ మహారాజు చెప్పాడు.ఇంద్రియాలను జయంచడం చాలాకష్టంకదా అని యయాతి అన్నాడు. ఆమె ఎవరో కాదుకదా. మా రాక్షస వంశంలోని వృషపర్వుని కూతురే కదా. ఏదో తప్పు జరిగి పోయిందిలే నేను మాత్రం నీ పట్ల అనురక్తుడై ఉన్నాను కదా. ఇక నీకు వచ్చిన కష్టం ఏమున్నది అని అన్నాడు. ఆమాటలకు మరింత కోపం తెచ్చుకుంది దేవయాని.
వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్లి నీ సంగతి వివరిస్తాననని బయలుదేరింది. యయాతీ ఆమెను ఆపి, దీనికి మీ తండ్రిదాకా ఎందుకు? ఇక పై నేను శర్మిష్ఠ దగ్గరకు వెళ్లను లే అన్నాడు. కానీ శర్మిష్ఠ వల్ల నీవు కొడుకులు పొందినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని పట్టుబట్టి వేగంగా తన తండ్రి దగ్గరకు దేవయాని వెళ్లింది.
***
తండ్రితో జరిగిన విషయాలన్నీ చెప్పింది. శుక్రాచార్యుడు పోనీలే అమ్మా. శర్మిష్ఠ కూడా నీ ఈడు అమ్మాయినే కదా. ఏదో పొరపాటు చేశారు. నీవు క్షమించి వదిలివేయి అని చెప్పాడు. కానీ దేవయానికి మితి మీరిన కోపంతో నాతో పాటు నా దాసీ కూడా కొడుకులను కంటుందా? ఎంత పొగరు నేను సహించను. నీవు ఎట్లాగైనా వారిద్దరీనీ శిక్షించు అని తండ్రిని బలవంతం పెట్టింది. ఎంతకీ వినని కూతురు ఓ ప్రక్క, ఇచ్చిన మాటను తప్పిన అల్లుడు మరో ప్రక్క ఇద్దరి పట్లవిసిగిన శుక్రాచార్యుడు, కూతురుపై ఉన్న అతి వ్యామోహం వల్ల యయాతిని వృద్ధాప్యం పీడించుగాక అని శపించాడు.
అంతే నవ యవ్వనంతో నూతన తేజస్సుతో కనిపించే యయాతీ శరీరం ముడతలు పడిపోయింది. కేశాలన్నీ తెల్లబడి పోయాయి. చేతులు కాళ్లు వణుకుతున్నాయి. నడుం వంగిపోయింది. లేవ లేక కూర్చులేక ముసలి వానిగా మారిపోయాడు. కానీ మనసు మాత్రం యవ్వనంలో ఉండిపోయింది. తనకీ స్థితి కలిగించిన వాడు శుక్రాచార్యుడే అయి ఉంటాడని అనుకొన్నాడు. ఆయనకు ఇంత ఆగ్రహం కలగడానికి కారణమూ దేవయాని అయి ఉంటుందని అనుకొన్నాడు. వెంటనే తనను తాను రక్షించుకోవాలని అనుకొన్నాడు.
***
శుక్రాచార్యుని దగ్గరకు యయాతీ మహారాజు వచ్చాడు. గురువర్యా! అనుకోకుండా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. నన్ను కోరి వచ్చిన యువతిని సంతోషపెట్టడమూ నాకు ధర్మమే కదా కాస్త ఆలోచించండి అని అన్నాడు.
నా కూతురునిచ్చి నీకు వివాహం చేసేటపుడు నీకు చెప్పిన మాటలు ఏమి అయ్యాయి? నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని ఎందుకు భగ్నం చేశావు? ఇట్లా చేయడం ఒక రాజుగా నీకు ధర్మమేనా? అని శుక్రాచార్యుడు అడిగాడు.
దానికి యయాతి మహారాజు శుక్రాచార్యుని వేడుకున్నాడు. మీరు నా సంగతిని ఆలోచించండి. ఇందులో చేయరాని తప్పు ఏమీ లేదు. కానీ నేను కిచ్చిన మాటను తప్పాను కానీ మీ కూతురునునేను పువ్వుల్లో పెట్టి చూసుకొంటున్నాను అని చెప్పాడు. కానీ శుక్రాచార్యుడు కోపం తగ్గని దేవయానిని చూశాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804