డైలీ సీరియల్

ష్‌...-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ బాబాల్లో నూటికి తొంభై తొమ్మిదిమంది బూటకపు బాబాలేనట’’ అంది కిరణ్మయి.
లేదు కిరణ్మయి.. ఇతని మహిమల గురించి టీవీ చానెల్స్‌లో కూడా వచ్చింది చెప్పింది ప్రియంవద.
విచిత్రంగా చూసిన కిరణ్మయి-
‘‘తనకి తెలిసి ప్రియంవద ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మేవ్యక్తి కాదు. మరి.. బహుశా మానసిక సమస్యతో...’’
ప్రియంవద అలవాటైన ప్రాంతంలో నడిచినట్టు నడుస్తోంది. ఆ ప్రాంతంలో చాలాచోట్ల సిసి కెమెరాలు వున్నాయి. ప్రియంవద విశాలమైన కాటేజ్ దగ్గర ఆగింది. ముందు సెక్యూరిటీ... మహిళా సిబ్బంది వాళ్ళను చెక్ చేసి లోపలికి పంపించారు.
ఏసీ గదిలో వాళ్ళిద్దరూ కూచున్నారు. వాళ్ళ ప్రతీ కదలిక అక్కడ రికార్డు అవుతుంది.
సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత చిన్న కలకలం...
గాలిబాబా ఆ గదిలోకి వచ్చాడు.
సింహాసనం లాంటిదానిలో కూచున్నాడు. ప్రియంవద లేచి బాబా పాదాలకు నమస్కరిస్తూ... కిరణ్మయి వంక చూసింది. కిరణ్మయి బాబా పాదాలకు నమస్కరించలేదు.
ఆ విషయాన్ని బాబా కనిపెట్టాడు.
ప్రియంవద ఏదో చెప్పబోయింది.
‘‘నాకంతా.. నువ్వు ఒక సమస్యలో చిక్కుకున్నావు.. నీతో ఓ దుష్టశక్తి ఆడుకుంటుంది. నీ భర్తమీద హత్యాప్రయత్నం జరిగింది’’ బాబా చెప్పాడు.
ప్రియంవద పరమానందభరితురాలైంది.
‘‘బాబా నా మనసులో మాట చెప్పారు. మీరు సాక్షాత్తూ దేవుడే’’ రెండు చేతులు జోడించి అంది భక్తి పారవశ్యంతో కళ్ళుమూసుకుని.
ఎందుకో.. ఆ సిట్యుయేషన్ కృతకంగా అనిపించింది. ప్రియంవదలాంటి వ్యక్తి ఇలా దిగజారి వుండకూడదు అనిపించింది. తను ఇక్కడికి వచ్చి పొరపాటు చేసిందా? ఎంత త్వరగా ఇక్కడినుంచి వెళ్లిపోతే అంత బావుండు అనిపిస్తోంది.
‘‘నా సమస్యకు పరిష్కారం లేదా బాబా?’’ అడిగింది ప్రియంవద.
‘‘ఉంది.. అది త్వరలోనే నేను చెపుతాను.. ఈలోగా ఈ విభూది.. అంటూ చేతిని గాల్లో లేపి విభూది ఉండను ప్రియంవద చేతిలో పెట్టి.. రోజూ ఉదయమే దీనిని నాలుకపై రాసుకో’’ అన్నాడు.
మరోసారి బాబాకు నమస్కరించి లేచింది.
‘‘ఈసారి వచ్చేటపుడు ఈ భక్తురాలికి తెల్లని చీర కట్టించి తీసుకురా.. త్వరలో వివాహ యోగం కలుగుతుంది’’ చెప్పాడు కిరణ్మయి వంక చూస్తూ గాలిబాబా.
కిరణ్మయికి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. మొదటిసారి ప్రియంవద మీద కాసింత కోపం వచ్చింది. వాళ్ళు బయటకు వెళ్తుంటే ఓ భక్తుడిని పిలిచి వీళ్ళ వైపు చూస్తూ ఏదో చెప్పాడు...
కిరణ్మయి ఆటోకోసం ఎదురుచూస్తోంది. గాలిబాబా ఆశ్రమం నుంచి బయటకు వచ్చాక తను దారిలో దిగిపోయింది. తను ఈవేళ ఇంటికి వెళ్ళకపోతే అక్క బావను టార్చర్ చేస్తాడు.
కిరణ్మయి చాలా డిస్ట్రబ్‌గా ఉంది. నిన్నటివరకూ ప్రియంవద మేడం మీద వున్న అభిప్రాయం మారిపోతోంది. ఒక్కోసారి మన అభిప్రాయం మారిపోవడానికి అట్టే సమయం పట్టదు.
ఒక వ్యక్తిమీద ప్రేమ పుట్టడానికి కారణాలు కనిపించకపోవచ్చు. కానీ వెతికితే ఉంటాయి. అనే్వషిస్తే తెలుస్తాయి. అయితే ఒక మనిషి మీద ద్వేషం పుట్టడానికి కారణాలు సరిగ్గా తెలుస్తాయి.
ఓ పక్క బాస్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో మేడం ప్రవర్తన ఆమెకు విచిత్రంగా అనిపిస్తోంది. బహుశా మానసికమైన సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు.
అలా ఆలోచిస్తూ ఉండగానే ఓ ఆటో ఆమె ముందు వచ్చి ఆగింది. సరిగ్గా తనకోసమే వచ్చినట్టు.. ఆటో ఎక్కి అడ్రెస్ చెప్పింది.
***
సులోచన పెరట్లో నవారు మంచంమీద పడుకుంది. రెండు చేతులు తలకింద దిండులా పెట్టుకుని ఆకాశం వంక చూస్తోంది. ఆ క్షణం భర్త గుర్తొచ్చాడు.. ఆ ఫీలింగ్ ఆమెలో ఎలాంటి అనుభూతిని కలిగించలేదు. ఎందుకంటే భార్యని కేవలం ఐదు నిమిషాల అవసరంగా భావించే భర్త యాంత్రికత్వం తన స్ర్తిత్వాన్ని నొక్కిపెట్టింది. ఈ వెనె్నల వేళ మనసైన వ్యక్తి జ్ఞాపకం ఎంత బావుంటుంది.
ఆమెకు రెండు రోజుల క్రితం చదివిన కథ గుర్తొచ్చింది.
భార్య పుట్టింటికి వెళుతుంది. భర్తను వదిలి వెళ్ళాలని లేదు. బస్సు కనుమరుగు అయ్యేవరకు భర్తనే చూస్తుంది. పక్క సీట్‌లో భర్త వున్న ఫీలింగ్.. అతని భుజంమీద తలపెట్టి పడుకున్న జ్ఞాపకం...
ఉలిక్కిపడి చూసింది.. అతను తన పక్కనే...
‘‘నాకోసమే ఆలోచిస్తున్నావా? ఆమె తలమీద చేయి వేసి నుదురు మీద చుంబన సంతకం చేస్తూ’’ అడిగాడు.
సులోచన కళ్ళుమూసుకుంది.. ఆ అనుభూతిని అనుభూతిస్తూ..
‘‘నామీద బెంగ పెట్టుకున్నావా?’’ ఆమె మీదికి వంగి అడిగాడు.
ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర...
అవునన్నట్టుతలూపింది..
‘‘నేను వచ్చేసానుగా’’ ఆమె తలను లేపి తన గుండెలకు హత్తుకుంటూ అన్నాడు.
అతడిని చుట్టేసి వెక్కుతోంది.
‘‘ఇంకెప్పుడూ
నన్ను వదిలిపెట్టద్దు.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482