డైలీ సీరియల్

ష్‌...-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మా పుట్టింటికి వెళ్తానన్నా పంపించవద్దు.. ఓసి నా బంగారం.. నువ్వు వెళ్ళొద్దే అని తిట్టాలి’’ అమాయకంగా, ఇష్టంగా, ప్రాణంగా అంది.
అతను ఆమెను అలానే పొదివి పట్టుకున్నాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
ఎదురుగా ఎవరూ లేరు...
కథ కలలోకి వచ్చింది. తనలోని కోరిక ఊహలా హత్తుకుంది..
సరిగ్గా అదే సమయంలో డబ్బుమీద పిచ్చితో సునందారావ్ ఓ పిచ్చిపని చేయబోతున్నాడు.. దాని పర్యవసానం తెలియక...
సునందరావ్ చెడ్డవాడు కాదు.. డబ్బుకోసం అవసరమైతే చెడ్డపని చేస్తాడు.. అయితే మంచి చెడ్డలను వాటి పర్యవసానాలను బేరీజు వేయలేదు.
‘‘డబ్బు సంపాదించడమెలా?’’ అన్న పుస్తకాలు అతని ఇంట్లో చాలా ఉంటాయి. ఆ పుస్తకాలు కొనే డబ్బుతో మనం వ్యాపారం చేస్తే... కనీసం కిళ్ళీకొట్టు పెట్టినా డబ్బు సంపాదించవచ్చు...’’ అంటుంది సులోచన.
***
ఇరానీ హోటల్‌లో కూచుని టీ తాగాలా? వద్దా? అనే విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సునందరావ్. దానికో కారణం ఉంది. సరిగ్గా లంచ్ టైంకు ఓ అరగంట ముందు, అతని మైబైల్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
సాధారణంగా అతనికి ఫోన్స్ రావు. అతను ఎవరికీ చేయడు. ఈ రోజు అలానే అతనికి ఫోన్ కాల్స్ రాలేదు. కానీ లంచ్‌కు ఓ అరగంట టైం ఉంది అనగా.. ఓ ఫోన్ కాల్ వచ్చింది.
‘‘మీ ఆఫీస్‌కు దగ్గరలో వున్న ఇరానీ హోటల్‌కు వెంటనే వస్తే నీకో అసైన్‌మెంట్ ఇస్తాను.. దాదాపు రెండు నెలలు కష్టపడితే వచ్చే డబ్బు.. ఒక్క గంటలో సంపాదించవచ్చు.. ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను..’’ అవతలి వ్యక్తి చెప్పాడు.
వెంటనే ‘సరే’ అనలేదు. అలా అని ‘నో’ అనలేదు. ‘‘వస్తాను.. కానీ లంచ్ టైంలో వస్తాను... మీ దగ్గరికి వచ్చాక లంచ్ చేసే టైం ఉండదు కాబట్టి.. పక్కనే వున్న హోటల్‌లో మటన్ బిర్యానీ మీరే స్పాన్సర్ చేయాలి’’ నిస్సిగ్గుగా అన్నాడు.
అవతలి వ్యక్తి సరే అన్నాడు.
మార్నింగ్ తెచ్చుకున్న లంచ్ బాక్స్ డిన్నర్‌కు పనికివస్తుంది. అదీ అతని ఆలోచన. వెంటనే ఆ విషయం భార్య సులోచనతో చెప్పాలనుకున్నాడు. కానీ అవుట్‌గోయింగ్‌కు డబ్బులు ఖర్చు.. వచ్చే అతని ఫోన్‌నుంచే చేసి చెబితే బెటర్ అనుకున్నాడు.
అతను ఇంకా రాలేదు. ఈలోగా ఆకలికోసం ఒక్క టీ తాగాలనుకున్నాడు. కానీ పది రూపాయలు.. ఆ డబ్బుతో పాల పాకెట్ తీసుకెళ్తే రోజులో మూడుసార్లు కాఫీ తాగొచ్చు.. పెరుగు తోడుపెట్టుకోవచ్చు.. ఇలా ఆలోచించి.. ‘నో’ అనుకుని ఆ వ్యక్తి ఎవరా? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
అప్పుడు వినిపించింది.. ఓ గొంతు.. ‘హలో’ అంటూ.
తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూశాడు. ఎదురుగా ఒక వ్యక్తి. నల్ల కళ్ళజోడు అతని ముఖాన్ని చాలావరకూ కనిపించకుండా కవర్ చేసింది. పెట్టుడు గడ్డం పరీక్షగా చూస్తే తెలుస్తుంది.
‘‘హలో.. నేనే మీకు ఫోన్ చేసింది’’ అన్నాడు అతను.
‘‘ముందు మనం లంచ్ చేద్దాం.. తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు’’ చెప్పాడు ఓపెన్‌గా సునందరావువ్.
అతను చిన్నగా నవ్వి.. ‘లంచ్ చేద్దామా? లేక ముందు లంచ్, డబ్బు ఓ రెండు వందలు మీకు ఇస్తే.. మన డీల్ పూర్తయ్యక మీరే హోటల్‌కు వెళ్ళి లంచ్ చేస్తారా?’’
వెంటనే సునందరావ్ ఆలోచనలో పడిపోయాడు. అవసరమైతే.. పెరుగన్నం తింటే సరిపోతుంది.. యాభై రూపాయలతో.. నూట యాభై మిగులు.. అనుకున్నాడు.
‘‘ముందు డీల్ ఏమిటో చెప్పండి’’ అన్నాడు.. అతనిచ్చే రెండు వందల కోసం చేయి చాపి.
రెండు వందల కాగితాలు ఇచ్చాడు అతను.
అవి షర్టు జేబులో పెట్టుకుని ‘‘ఇప్పుడు చెప్పండి..’’ అన్నాడు.
‘‘మీరు ఒక బొకే తీసుకువెళ్ళి ఒకతనికివ్వాలి.. అంతే’’ అన్నాడు.
‘‘ఎందుకు.. మీరే ఇవ్వొచ్చుగా.. కొంపదీసి అందులో బాంబ్‌గాని పెడతారా?’’ అనుమానంగా అడిగాడు.
అతను నవ్వి.. ‘‘ఊహూ.. మీకు డవుట్ వుంటే చెక్ చేసుకోండి. కేవలం ‘పూల బొకే..’ అందులో మొత్తం చేసుకునే ఇవ్వండి..’’
‘‘మీరే ఇవ్వొచ్చుగా’’ సునందరావ్ అడిగాడు.
‘‘ఇవ్వొచ్చు.. కానీ.. ప్రస్తుతం మాకు అతనితో మాటలు లేవు.. మళ్లీ మేము కలవాలి. ఈ పని చేసినందుకు మీ ఆఫీసులో ఇచ్చే రెండు నెలల జీతం మీకు అందుతుంది.. పైగా ఒక మొబైల్ ఫ్రీ.. మీ మొబైల్ చాలా పాతది. మాటలు సరిగ్గా వినిపించవు. ఫొటోలు కూడా తీయొచ్చు నేనిచ్చే కెమెరా మొబైల్.. ఓన్లీ గిఫ్ట్...’’
‘‘ఒక్క బొకే ఇస్తే ఇంత మంచి అవౌంట్.. కారణం ఏమై ఉంటుంది?’’ అడిగాడు సునందరావ్.

ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482