డైలీ సీరియల్

బంగారుకల-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయితే మీరిక నాతో మాట్లాడేదేం లేదు’’ అచ్యుతరాయలు రామరాయలు మొహం మీదే అనేశాడు.
రామరాయలు తీవ్రంగా ఆలోచిస్తూ వెనుదిరిగాడు. హఠాత్తుగా అతనికి శ్రీకృష్ణదేవరాయల మరణశాసనం గుర్తొచ్చింది.
‘‘అవును అలా చేస్తేనే ఈ విజయనగర సామ్రాజ్యం మరికొన్నాళ్ళు నిలుస్తుంది...రేపే తాత ఇంట పెరుగుతున్న అసలు వారసుడు సదాశివరాయలకు కబురుచేస్తాను’’.
రామరాయలు మనస్సు తేలికపడింది. విజయనగర సామ్రాజ్య పూర్వ వైభవానికి రామరాయలు కంకణం కట్టుకున్నాడు. కానీ అప్పటికే ఆ సంగతి గ్రహించిన తిమ్మయ్య దారిమధ్యలోనే సదాశివరాయలను నిర్బంధించటంతో రామరాయలు ఖిన్నుడయ్యాడు.
ఎన్నాళ్ళనుంచో కాచుకుని ఉన్న గజపతుల సైన్యం విజయనగరం మీద దండు వెడలింది. అన్నపూర్ణాదేవి తమ పుట్టింటివారి అకృత్యానికి చాలా చిందిల్లుతూ పెదనామాత్యునికి తెలియజేసింది. రాచకార్యాలలో సాయపడే కవులు పుట్టిన గడ్డకదా విజయనగరం! పెద్దన గజపతులనుద్దేశిస్తూ ఇలా రాసి పంపాడు. అన్నపూర్ణాదేవి ఆపద్యాన్ని గజపతులకు చేర్పింది. వారది చదివి సిగ్గుపడి తమ దండయాత్రను విరమించుకున్నారు.
‘‘కవివర్యా!మీరు చేసిన మేలు మరువరానిది. కృతజ్ఞులము’’అన్నపూర్ణాదేవి పెద్దనకు చేతులు జోడించింది.
‘‘అమ్మా!రాయలవారి ఉప్పుతిని పెరిగిన శరీరమిది. అంతటి ప్రభువును మళ్ళీ వినగలామా! కనగలమా!
పెద్దన కవీంద్రుని కన్నీరు చూసి అన్నపూర్ణాదేవి కూడా శోకించింది.
‘‘అమ్మా!మిమ్ముల నేను ఇంక బాధింపలేను. మనకి రుణం తీరింది తల్లీ! వెళ్ళివస్తాను’’
పెద్దన కవి భారంగా వెళ్ళిపోయాడు.
ఇదంతా స్వయం కృతమని అన్నపూర్ణాదేవి చాలా దుఃఖించింది.
***
వృద్ధుడు, అంధుడైన తిమ్మరుసు ఇప్పుడు అతి దీనావస్థలో ఉన్నాడు. బాల్యంలో దుర్భర దరిద్రం అనుభవించినా మధూకరం ఎత్తుకొని సత్రాల్లో భోజనం చేసి సకల శాస్త్రాలు అభ్యసించిన విద్యావేత్త తిమ్మరుసు ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన మహాప్రజ్ఞను స్వహస్తాలతో సానపెట్టుకున్నాడు.
శ్రీకృష్ణదేవరాయల పేరు ప్రస్తావిస్తే తిమ్మరుసును విస్మరించలేం. విజయనగర చరిత్రకు పరిపూర్ణత తిమ్మరుసే! కటిక బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బాల్యమంతా గంజినీళ్ళతో బతికాడు. ఒకనాడు అడవిలో సొమ్మసిల్లి పడిపోతే నాగుపాము పడగతో అతనికి నీడనిచ్చిందట. ఒక సాధువీసంగతి గ్రహించి అతను చరిత్ర పురుషుడు కాగలడని నమ్మి ఇంటికి తీసుకెళ్ళి పరిచర్యలు చేసి ఒక సామంతరాజు వద్ద లేఖకుడిగా నియమింపచేశాడట. అక్కడి నుంచి తిమ్మరుసు జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఎంతోమంది రాజుల వద్ద తిమ్మరుసు తన మేధా సంపత్తితో రాణించాడు. కొన్నాళ్ళకు తిమ్మరుసు తుళువ నరసరాయల వద్ద మంత్రిగా చేరాడు. రాజు అభిమానం పొందాడు.
అలా ప్రారంభమైన తిమ్మరుసు రాజకీయ ప్రయాణం విజయనగర చరిత్రలో సుస్థిరంగా వెలిగిపోయింది. నిలిచిపోయింది. కృష్ణదేవరాయల జీవితంలో, విజయనగర సామ్రాజ్య విస్తరణలో ప్రముఖ పాత్ర వహించిన తిమ్మరుసు కేవలం మహామాత్యుడే కాదు అంతకు మించి దైవతుల్యుడు. ఆయుధ ప్రయోగం లేకుండా తన మేధా సంపదతో శత్రువులను మట్టి కరిపించిన ధీశాలి.
అటువంటి తిమ్మరుసు మహామంత్రి తాను పెంచి పెద్దచేసి రాజును చేసిన పుత్రతుల్యుడయిన రాయల విరోధానికి గురయి అంధుడై అతి దీనావస్థలో ఉండటం అందరినీ బాధిస్తున్నది. చంద్రప్ప తిమ్మరుసుకు సహాయం చేయబోయాడు. అభిమానధనుడయిన ఆ వృద్ధమంత్రి ఎవరి సహాయాన్ని అంగీకరించలేదు.
అనేకులకు స్వయంగా దానధర్మాలు చేసిన తిమ్మరుసుకు తిరుపతి దేవాలయం వారు ప్రసాదం పంపేవారు. ఆ ప్రసాదాన్ని అమ్ముకుని బతికే దుస్థితి తిమ్మరుసుకు కలగటం ఏనాటి పాపమో అని అంతా దుఃఖిస్తున్నారు. రాయలు మరణించిన దాదాపు ఆరేళ్ళకు ఈ భూమిమీదే నరకాన్ని చూసిన తిమ్మరుసు మహామంత్రి స్వర్గవాసుడయ్యారు. విజయనగర స్వర్ణయుగ చరిత్ర పుటల్లో తనదైన విలక్షణ స్థానాన్ని నిలుపుకున్న మహనీయుడయ్యారు.
***
తిమ్మరుసు మరణం తిరుమలదేవిని, అన్నపూర్ణాదేవిని మరింత కుంగదీస్తున్నది. సకలం తిమ్మయ్య దురాగతాలు అచ్యుతరాయల సాయంతో మితిమీరాయి. అచ్యుతరాయల రాణి వరదాంబిక ఇతని ఆగడాలకు వత్తాసు పలికింది. రాజ్యమంతటా అవినీతి తాండవిస్తున్నది.
విజయనగర సామ్రాజ్యం అల్లకల్లోలంగా అవినీతి అంధకారంలో మునిగిపోవటంతో చిరకాల శత్రువు బీజాపూర్ ఆదిల్‌ఖాన్ విజయనగరంపై దాడిచేశాడు. మద్యం, మగువ తప్ప ఎరుగని అచ్యుతరాయలు తిమ్మయ్యపై బాధ్యత వేసి విందువినోదాల్లో మునిగిపోయాడు.
యుద్ధం కంటే సంధి మేలనుకున్న తిమ్మయ్య ఆ నిర్ణయాన్ని సేనాపతులకు తెలిపాడు. వారిటువంటి పిరికి నిర్ణయాన్ని అసహ్యించుకుని రామరాయలకు విన్నవించారు. రామరాయలు కోరినా యుద్ధం చేయటానికి అచ్యుతరాయలు అంగీకరించలేదు. శత్రువుల ఎదుట తలదించటం తెలియని అంధ్ర సైనికులు నిర్జీవంగా మారారు. దేశభక్తులు కుమిలిపోయారు.
అపార సంపదతో వెళ్ళిన తిమ్మయ్య శత్రువులకు ఆ సంపదలతో బాటు రాయచూర్, ముద్గల్లు, దుర్గాల తాళం చెవులు ఇచ్చి వచ్చాడు. ఈ సంఘటనలో విజయనగర పౌరులు, సైన్యం, మానసికంగా కుంగిపోయారు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి