డైలీ సీరియల్

పొగడ్తలూ అహానికి సమిధలే ( కాలయవనుడు -1 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టులను నిర్మూలించడానికే కృష్ణుడు యశోదానందనుడయ్యాడు. అందుకే కంసాది వీరులంతా చావుపుట్టకలు లేనివాడిని, యశోదానందనుడిని చంపాలని ఎదురుచూశారు. దేవకీదేవి గర్భాన ఉన్న సమయంలోనే వారికి మనలను మట్టుపెట్టే జగత్ప్రభువు వస్తున్నాడని తెలుసుకొన్నారు. ఎందరో దుర్మార్గులు వారి ఆటలు ఇక సాగవని చిన్నపుడు బాలకుడుగా ఉన్నప్పుడే మహావిష్ణువు అవతారంగా భావిస్తున్న నందనందనుని చంపేయాలని కలలు కన్నారు. ఎంతో మంది రాక్షసులు వారికున్న కామరూప విద్యతో ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ స్వామీ చిన్మయుడు కదా. చిద్విలాసంతో చిరునవ్వు చెదరనివ్వకుండానే శత్రువులను చిత్తు చేస్తునే ఉన్నాడు. ఆయన వేసే వ్యూహ్యాలను ఎవరూ కనిపెట్టలేకపోయేవారు.
అట్లాంటి సమయంలోనే పదిహేడు సార్లు పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని వెంటపెట్టుకుని వచ్చి బలరామకృష్ణులతో పోరాడి ఓడి వెనుకకు తిరిగేవాడు. కానీ ఈసారి జరాసంధుడు గట్టిగా అనుకొన్నాడు. బలరామకృష్ణులను ఎలాగైనా తరిమివేయాలి. సంహరించివేయాలి. లేకుంటే ఇన్ని సార్లు దండెత్తి వెళ్లినాకూడ నేను ఓడి పోతూనే ఉన్నాను.
మరీ ఈసారి అయితే బలరాముడు తన పిడికిలి పోటుతోనే నన్ను హతమారుస్తున్నాడా అని ఎదురు చూస్తుంటే కృష్ణుడే వచ్చి ‘అన్నా వద్దు వద్దు వీని చంపబోకు. ఈసారైనా బుద్ధి తెచ్చుకుంటాడులే వీడు వదిలిపెడుదాం. వీని బుద్ధి చెడుమార్గం పట్టింది. ఇపుడు ఇన్ని సార్లు మనతో తల పడ్డాడుకదా. ఇక నేమి వీడు మారుతాడు వదిలిపెట్టుము అన్నా ’ అన్నాడు. ఆ యదునందనుడు నన్ను చూసి భయపడడం లేదా? నేను వీరాధివీరుడిని కదామరి ఎందుకు ఓడిపోతున్నాను. నేను వారికి చిక్కినా కూడా మరలా వదిలి పెట్టాడేమిటి? తిరిగి బలం కూడకట్టుకుని తిరిగి నాపైకి యుద్ధానికి రండి అని చెప్పి పంపించడంలో అర్థం మేమిటి? అని పలుసార్లు పలువిధాలుగా తన్ను తాను తర్కించుకున్నాడు.. విమర్శించుకున్నాడు. పదేపదే కృష్ణుని మాటలను తలపోసుకొన్నాడు. కానీ అర్థం ఏమీ కనబడలేదు.
నేను ఇంతగా ఆలోచించినా ఒరిగేది ఏమీలేదు. ఈసారి ఎలాగైనా ఆ యదువీరులను మట్టు పెట్టాల్సిందే. దీనికి నేను ఎవరెవరని కూడగట్టుకోవాలి. ఎంతటి బలాన్ని నేను చేకూర్చుకోవాలి అని ఆలోచించసాగాడు జరాసంధుడు.
***
ఆ సమయంలో కాలయవనునికి నారదుని దర్శనం లభ్యమైంది. నారదుడు లోక కళ్యాణ కారుడు కదా. అందుకే కాలయవనుని సమయం పూర్తి అయింది వీనికి బుద్ధి చెప్పుదాం అనుకొన్నాడు.
‘కాలయవనా! ఎలా ఉన్నావు, ఏమీ చేస్తున్నావు? నీ పౌరుషమంతా ఏమి అయింది? నీలో ఈమధ్య పరాక్రమము తగ్గుతున్నట్టు ఉంది. ఇది ఏమైనా వయస్సు ప్రభావమా ’అన్నాడు.
కాలయవనునిలో కోపం ఉబికింది. వయస్సు ప్రభావం అంటారా అనుకొన్నాడు. ఇట్లా నా గురించి తలపోసేవారికి నా ప్రభావాన్ని తప్పక చూపించాలి అనుకొన్నాడు.
‘నారదా! నీ వీరత్వానికి ఏమి మరుగు ఏర్పడలేదు. నా శూరత్వానికి నిలిచే బలవంతులు ఎవరులేరు. ఉన్నదంతా అర్భకులు. గోవులు కాచుకునేవాళ్లు అందుకే నేను వారి జోలికి వెళ్లడం లేదు’అన్నాడు. ‘అయ్యో! కాలయవ్వనా! నీవీలాగు అనుకొంటున్నావా.. ఆ బలరామ కృష్ణులు మాత్రం మేము జరాసంధుడు ఎన్ని సార్లు ఎంతమందిని తీసుకొని వచ్చినా మేము తరిమి తరిమి కొట్టాం. పోనీలే అని ప్రాణాలతో వదిలిపెట్టాము. ఈ లోకంలో పరలోకంలోకూడా మేమే పరాక్రములం. ఎవరూ మా ధాటికి నిలువలేరు’ అని అందరికీ చెబుకుంటూ తిరుగుతున్నారు అన్నాడు.
‘ఆ! వాని కి ఇంత పొగరా.. ఆ గోవులు కాచుకుంటూ వెన్నదొంగతనం చేసుకొని తింటూ ఉండేవానికే అంత పొగరు ఉంటే నాకెంత ఉండాలి?’ అన్నాడు.
అదే కదా నేను చెప్పేది. నీవెలాగైనా ఆ యదువీరులను ఒక్కసారి చూడాలి అన్నాడు నారదుడు.
ఇంతకీ ఆ గోకులంలో అందరూ ఒకేలాగా ఉంటారు. అందరూ పిచ్చి పట్టినవారిలాగా కృష్ణుని రూప విశేషాన్ని తమ ముఖాలకు కూడా దిద్దుకుని ఉంటారు. ఎవరు కృష్ణులో ఎవరు కారో నాకు అంతగా తెలియడం లేదు. కనుక నీవు ఒకసారి ఆ కృష్ణరూపాన్ని చెప్పుము అని కాలయవనుడు నారదుడిని అడిగాడు.
‘‘కృష్ణరూపం నీకు తెలియదా.. ఒక్కసారి స్మరిస్తే చాలుకదా. ఒక్కసారి చూచినట్లయితే మరలా మరిచిపోనీ రూపం కదా ఆయనిది. గోపికలంతా ఆయన సమ్మోహన రూపాన్ని చూసి కదా ఆయన్ను వదలక తిరుగుతుంటారు’’ అన్నాడు నారదుడు.
‘‘మరీ అంతగా పొడగకు కానీ వాని రూపాన్ని ఒక్కసారి గుర్తుచేయుము’అని అడిగాడు.
‘‘దానిదేమి భాగ్యం చెబుతానుండు తామరల వంటి కన్నులు గలవాడును, సింహం నడుము వంటి నడుము కలవాడును, వక్షస్థలాన లక్ష్మి గలవాడును, శ్రీవత్సమనే పుట్టు మచ్చగలవాడును, సోముని వంటి మోము గలవాడును, ....
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804