డైలీ సీరియల్

శుభసంకల్పం... శుభ ఫలితమే( కాలయవనుడు -2 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడలో వనమాల, చేతిలో పిల్లన గ్రోవి, తలపై నెమలి ఫించం పట్టుకొన్నవాడు, పొడుగాటి చేతులు కలవాడు...నల్లని మోము కలవాడు శత్రువులను కూడా ఆకర్షించే చక్కని ముఖారవిందం కలిగినవాడు...’’ ఇలా చెప్పుకుంటూ ఆనందిస్తూన్నాడు నారదుడు.
‘‘ఆపు ఆపు నారదా అతడేమి నీకు మేలు చేయలేదు. ఇంతగా చెబుతున్నావు. తిండి నిద్రా లేదు నీకు అహర్నిశమూ ఈ మహతిని పట్టుకొని ఇల్లు వాకిలి లేకుండా సుఖభోగాలే కాదు కనీసం కూర్చోవడానికి, హాయిగా నిద్రపోవడానికి కూడా వీలు కల్పించకుండా కాలికి చక్రాలు కట్టాడు. నీవు ఉన్న చోటు ఉండకుండా లోకాలన్నింటినీ తిరుగుతూ ఉంటావు. వాడు నీకు చేసిన హానిని తలవక ఇంకా మహావిష్ణువే కృష్ణునిగా పుట్టినట్లు ఆయన రూపవిశేషాలను చెబుతున్నావు. ఆ కృష్ణుడు మహావిష్ణువు కాదు. అతడు కేవలం యశోదానందుల కుమారుడు నాకు తెలుసు..చేతిలో వెదురు బొంగు పట్టుకొని ఆవులను అదిలించాలి కదా అందుకే అది పట్టుకొన్నాడు. ఏమీ పనిలేక దానికి రంధ్రాలు కలిగించి దాన్ని ఊదుకుంటూ తిరుగుతుంటాడు. చూడు కావలంటే సంగీతనాట్యాదులు చేయడానికి నా దగ్గర ఎంతోమంది అపర్ససలను తలదనే్న సుందరీమణులు నా దగ్గర ఉన్నారు. వారు వాయించే వాయిద్యాలను వారు పలికించే రాగాలను విను అపుడు నీకు అసలు రాగం గురించి తెలుస్తుంది’అన్నాడు కాలయవనుడు.
కాలయవనుడు చెప్పే మాటలు నారదుడు వింటూ వీనికి బాగా పొగరెక్కింది. వీనికి శ్రీకృష్ణుడే బుద్ధిచెప్పగలవాడు. వీనికి మదమణచాల్సిందే అనుకొన్నాడు.
‘కాలయవనా! నీవు చెప్పేది నిజమే! వెదురుబొంగునే పిల్లనగ్రోవిలాగా పట్టుకొని ఉంటాడు. మరి అటువంటి వానిని చూసి నీవు భయపడుతున్నావెందుకు? వాని చేతిలోనే కదా నీ స్నేహితుడు, క్రూరుడన్న పేరు తెచ్చుకున్న జరాసంధుడు అనేక మార్లు ఓడిపోయాడు’అన్నాడు.
కాలయవనుడు ఓ నిముషం పాటు ఏమీ మాట్లాడలేదు. అంతలో ‘అంతేకాదు కాలయవనా! నీవు, జరాసంధుడు కలిసి వస్తే కూడా నన్ను జయించలేరు’’అని అందరితో చెబుతున్నారట. యాదవ వీరులంతా అందుకే కృష్ణుడు ఉంటే చాలు ఇంక ఎవరి వల్ల భయం లేదు అని హాయిగా మరో ధ్యాస లేకుండా ఉంటున్నారట. ’అని ఇంకా ఏదో చెప్పబోతుండగా
కాలయవనుడు ‘నారదా! ఆపు ఆపు. ఇక చాలు ఆ యదువీరుని వీరత్వం. నేను జరాసంధుడు కలసి వెళ్తే కాదు నేనొక్కడినే మధురానగరంపైకి దండెత్తి వెళ్లానంటే కేవలం నా ఒక్కని చేతిలోనే కృష్ణుడు పిండి పిండి అయిపోతాడు.అదే ఏదో కాలం కలసి రాక జరాసంధుడు ఓడిపోయాడేమో లేక కృష్ణుడు చాలా మాయలు పన్నుతాడని విన్నాను కనుక ఏదో మాయ జేసి ఈ జరాసంధుడు ఓడి పోయినట్లు చేశాడేమో అంతేకానీ కృష్ణుడు బలవంతుడు కాదు’అని కాలయవనుడు చెప్పాడు.
‘నాకు అదంతా తెలియదు కానీ ఇప్పుడు నీవేమైనా యుద్ధానికి వెళ్లేటట్లు అయితే చెప్పు అపుడు నేను ఆ యుద్ధం చూసి నీవు గొప్పవానివా కాదా అని చెబుతాను’అన్నాడు.
‘సరే సరే .. నేను కొంత ఆలోచించి యుద్ధానికి వెళ్లి ఆ యదువీరుల సంగతి తేల్చేస్తాను. లేకపోతే నీలాగా మరికొందరు మా గురించి చెడుగా అనుకొనే ప్రమాదం ఉంది’అన్నాడు.
***
కాలయవనుని సంగతి కృష్ణునికి తెలిసింది. బలరామకృష్ణుడు సమావేశం అయ్యారు. జరాసంధుని, కాలయవనుని గూర్చి తలపోశారు. వీరిద్దరూ కూడా క్రూరకర్ములే. వీరి నుంచి మనవారిని మనం కాపాడుకోవాలి అనుకొన్నారు. ఆపని ఏదో నీవే చేయమని బలరాముడు కృష్ణుడిని ప్రోత్సహించాడు.
***
కృష్ణుడు సాగరుడిని పిలిచి కాస్త స్థలం ఇవ్వమని అందులో ఓ నగరం నిర్మించుకుంటామని చెప్పాడు. అంతకంటే భాగ్యమేమున్నదని సాగరుడు ఆనందించాడు. నా గర్బంలో ఉన్న మణులు మాణిక్యాలు కూడా అందచేస్తానని అన్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచి మాకందరికి నివాసయోగ్యంగా సాగర మధ్యమంలో ఓ పురాన్ని నిర్మించమని కృష్ణుడు చెప్పాడు.
విశ్వకర్మ ఆ ఆదేశాన్ని పూర్తి చేస్తానని బ్రహ్మ,విష్ణువుల మందిరాలకన్నా గొప్ప నగరాన్ని మీకు నిర్మించి ఇస్తానని మాట చెప్పి సాగర మధ్యలోకి వెళ్లాడు. అక్కడ లోకంలో కెల్ల అద్భుతమైన నగరాన్ని అతి తక్కువకాలంలో నిర్మించాడు. ఆ విషయం కృష్ణునికి చెప్పాడు. విశ్వకర్మకు మంచి బహుమానం ఇచ్చి కృష్ణుడు ఇక మేమంతా ఆ నగరం మధ్యలో ఉంటాము అని చెప్పి అతడిని పంపించివేశాడు.
***
బలరామునికి చెప్పి యదుప్రముఖులను పిలిపించాడు. రాబఓయే కష్టాలను వివరించాడు. ఆ కష్టాల నుంచి మనలను మనం కాపాడుకోవాలి. దానికోసం నేను విశ్వకర్మచేత సాగరమధ్యలో ఓ పురాన్ని నిర్మింపచేశాను.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804