డైలీ సీరియల్

కనిపించేది వాస్తవమూ కాదు.. (కాలయవనుడు -3 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందులోకి మనమందరం వెళ్లుదాం అని చెప్పాడు. వారంతా ఎంతో సంతోషించారు. కృష్ణుడు చెప్పినట్లు యాదవులంతా మధురానగర నివాసులంతా ద్వారకకు ప్రయాణం కట్టారు. అపుడే కృష్ణుడు తన యోగ మాయచేత మధురానగరంలోని ప్రజలను, పశుపక్ష్యాదులను ఇలా మొత్తం మధుర నంతా సాగరమధ్యలోని నగరానికి చేర్చాడు. ఈ సంగతి తెలుసుకొని బ్రహ్మవిష్ణు ఇంద్రాది దేవతలంతా అనేక విధాలైన బహుమతులను కృష్ణునికి అందచేశారు.దేవేంద్రుడు పారిజాత వృక్షాన్ని, సుధర్మ అనే దేవసభనూ బహూకరించాడు. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి మిగిలిన శరీరమంతా తెల్లగా మెరిసేపోతూ మనోవేగంతో ప్రయాణం చేయగల గుఱ్ఱాలను వరుణుడిచ్చాడు. మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం అనే పేర్లు గల ఎనిమిది నిధులను కుబేరుడు కృష్ణయ్యకు ఇచ్చాడు.
అట్లా మధుర ద్వారకకు చేరింది.
***
కాలయవనుడు మదిలో అనేక ఆలోచనలు చేశాడు. నారదుడు చెప్పిన వానిని చూడాలి అనుకొన్నాడు. ఆ కృష్ణుడికి తన ప్రతాపమేమిటో రుచి చూపిస్తే అపుడు యాదవులంతా కిక్కురుమనకుండా ఉంటారని అనుకొన్నాడు. వెంటనే సర్వ సన్నుధుడై మొదట నేను మధుర చేరుకొని అక్కడి పరిస్థితులనుచూసి తరువాత మీకు కబురు పంపుతాను. అపుడు మీరు రండి అప్పటి దాకా మీరంతా వేచి ఉండండి అని తన సేనలకు భద్రం చెప్పాడు. కాలయవనుడు కాలి నడకన మధురకు బయలుదేరాడు.
ఈ సంగతి కృష్ణుడికి తెలిసింది. తాను కూడా నిరాయుధుడై మధుర నుంచివెలుపలకు వస్తున్నట్లుగా వచ్చాడు.
ఆ వస్తున్న కృష్ణుడిని కాలయవనుడు చూశాడు. తామరలవంటి కనులు గలవడా. వక్షస్థలాన లక్ష్మి గలవాడు, శ్రీవత్సమనే పుట్టమచ్చగలవాడు, సోముని వంటి మోముగలవాడు అందంగా వనమాల, ముత్యాలదండలతో తన్ను అలంకరించుకున్నవాడు, చేతులకు కంకణాలు, చెవులకు కమ్మలు ధరించి, పాదాలకు నూపురాలు తగిలించుకుని ఇన్ని ఆభరణాలు పెట్టుకుని అతిసుకుమారంగా నడిచి వస్తున్నాడే ఇతని తలపై ఫించం చూస్తే కృష్ణుడు అనుకొంటాను. చేతిలో కూడా పిల్లన గ్రోవి కనబడుతూంది కదా. అరే ఆయన నడిచి నా వైపుకే వస్తున్నాడే నన్ను చూసి భయపడి పారి పోతాడనుకంటే నా ఎదురుగా నడుస్తున్నాడు. ఇతడే ఆ నారదుడు చెప్పిన కృష్ణుడు అయి ఉంటాడు. నిరాయుధుడుకదా కాస్త భయపెడుతాను. నాకు లొంగిపోతే వదిలేస్తాను. లేకపోతే యుద్ధం చేస్తాను. అపుడు నావారికి కబురు పంపిస్తాను అనుకొంటూ ముందుకు అడుగులు వేసాడు.
కృష్ణుడు ఈ మూర్ఖుని మనసు తెలుసుకున్నాడు. చిన్నగా నవ్వుకున్నాడు. చూడనట్టుగా కాసేపు నడిచాడు. తిరిగి కాలయవనుని అపుడే చూసినట్లుగా చూసి భయం చెందినవానివలె వెనుకకు చూస్తూ చూస్తూ ముందుకు పరుగు లంకించుకున్నాడు మాయామనోహరుడైన కృష్ణుడు.
దానిని చూసిన కాలయవనుడు పెద్దగా నవ్వాడు. ఓరోరి ! బాలకునివలె పరుగులెత్తుతున్నాడు. ఇతడేనా గోపభామలను మనసులు దోచినవాడు. ఇతడేనా జరాసంధుని ఓడించినవాడు, ఇతడే నా కంసుని చంపినవాడు, ఇతడేనా పూతనాదులను చంపిన వాడు నాకైతే వీనికి ఇంత బలమున్నట్లుగానే కనిపించడం లేదు. బహుశా వారికి కాలం తీరి చనిపోతే వారిని చంపినది నేనే అని అందరికీ చెప్పుకున్నాడేమో..అంత బలాధికారి అయితే నన్ను చూడగానే ఎలా పారిపోతున్నాడు. తిరిగి నేనే మన్నా వస్తున్నానేమో నని నిక్కి నిక్కి వెనుక్కు తిరిగి చెట్టు చాటున పుట్ట చాటున నిలబడి చూస్తున్నాడే ఇతడు కృష్ణుడే నా మరి ఎవరన్నా నా అని సందేహపడుతూ కూడా కాలయవనుడు కృష్ణుని వెంట పరుగెత్తుతున్నాడు.
అయినా ఒక్కసారి మాట్లాడించి చూద్దాం అనుకొన్నాడు.‘ ఓ మాధవా! నినే్న ఆగు ఆగు నేనేమీ చేయనులే.. అయినా పిరికి పందలాగు పరుగెత్తే పారిపోయేవానిని ఎవరైనా ఏం చేస్తారు. ఆగు ఆగు! నీవు నీళ్లల్లో చేపలాగా దాగినా, భూమి కింద తాబేలులాగా దాక్కున్నా, కొండలను ఎక్కే వరాహం లాగా కొండలెక్కినా, నా దగ్గరకు మారురూపంలో వచ్చినా కూడా నేను ఏమీ చేయలేనులే..నా నుంచి తప్పించుకోవడానికి వికార రూపాన్ని నరసింహరూపంలో వచ్చినా నేను ఏమీ చేయనులే.. ఆగు ఆగు.. నీవు సాగరాన్ని దాటివెళ్లినా, ఒంటి చేత్తో అందరి రాక్షసులను చంపి వేస్తానని ముక్కు మూసుకొని కూర్చుని ఉన్న వారికి అభయం ఇచ్చే వాడివైనా నీ చేతిలో ఆయుధం లేదు కనుక నేను ఏమీ చేయనులే కాసేపు ఆగు. నీ వీరత్వమొక సారి నన్ను కూడా చూడనివ్వు’ అని కాస్త పరుగు వేగం పెంచాడు.
నా ఒరలోంచి ఖడ్గాన్ని నేను తీయనేలేదు. నా చేతి నుంచి బాణాన్ని వదలనే లేదు. కనీసం ఆ వింటి మ్రోత నైనా వినిపించనివ్వలేదు. నా రథానికి కట్టిన గుఱ్ఱాల చప్పుడు కూడా రాకుండానే ఇంతగా పరుగెత్తుతున్నావా.. ఎందాకా పరుగెత్తుతావు.?
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804