డైలీ సీరియల్

సాధనే శుభఫలితానికి మార్గం (ప్రద్యుమ్నుడు -4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రద్యుమ్నునకు పూర్వజన్మ విషయాలతో పాటు ఈ జన్మలో జరిగిపోయిన విషయాలు కూడా తెలిశాయి.
అపుడు మాయావతి రూపంలో ఉన్న రతీదేవి చెప్పిన విషయాలు నిజమని నమ్మాడు. మరి నేనిప్పుడు ఏం చేయను? ఈ శంబరాసురుని చంపివేస్తాను అన్నాడు. అపుడు
మాయావతి ‘ప్రాణనాథ! నీలో వీరత్వం ఉంది. ఆ వీరత్వంతో శంబరాసురుడు సంహరించబడడు. అతడు మాయలమారి. దేవతలందరినీ అతడు తన మాయలతోనే జయించాడు. కామవిద్యావిశారదుడు. కనుక నేను నీకు ‘మహామాయ’ అనే విద్యను బోధిస్తాను. నీవు దానిని నేర్చుకుని ఆ తరువాత సమ్మోహనాది విద్యలతో శంబరాసురుని సంహరించు’అంది.
ప్రద్యుమ్నుడు ‘నీవు చెప్పింది బాగుంది. నేను ఆవిధంగా చేస్తాను’ అన్నాడు. ఆ తరువాత మాయావతి నుంచి మహామాయ అనే విద్యను నేర్చుకొని శంబరాసురుడిని యుద్ధానికి పిలిచాడు. అతి భయంకరమైన యుద్ధంలో శంబరాసురుని ప్రద్యుమ్నుడు సంహరించివేశాడు. దేవతలంతా పుష్పవర్షాన్ని కురిపించారు. లోకకంటకుడైన శంబరాసురుని పీడ వదిలిందని అందరూ సంతోషించారు.
విజయాన్ని పొందిన ప్రద్యుమ్నుడితో మాయావతి ఇక మనిద్దరమూ మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్దాం అంది.
ఆమె మాటలు విని ప్రద్యుమ్నుడు, మాయావతి ద్వారకాపట్నం వెళ్లారు. వారి రాక ను ముందుగానే తెలుసుకొన్న శ్రీకృష్ణుడు నగరమంతా అలంకరింపచేశాడు. రాజసౌధంలో, అంతఃపురంలో రుక్మిణీదేవి తన కొడుకు కోడలు కూడా వస్తున్నారని ఎంతో సంతోషపడింది. తాను పురిటిలోనే కోల్పోయిన బిడ్డ నేడు పెరిగి పెద్దవాడై తన ఇల్లాలిని తీసుకొని మరీ వస్తున్నాడని ఎంతో సంతోషంతో తన సౌధాన్నంతా అలంకరింపచేసి వారికోసం ఎదురుచూస్తుంది.
***
ప్రద్యుమ్నుడు, మాయావతి మెరుపు తీగలవలె ద్వారకాపట్నం వచ్చారు. వారిని చూసిన అక్కడి వారంతా అబ్బురం చెందారు. ఏమి అందగాళ్లు వీరిద్దరూ అని ఆశ్చర్యం , ఆనందం పొందారు. కొందరు ప్రద్యుమ్నుడిని చూసి కృష్ణుడని భ్రమపడ్డారు. దగ్గరగా వచ్చి చూసి కాదు కాదు అనుకొన్నారు.
కృష్ణుని రూపును పోలినట్లుగా ఉన్నాడని గోపభామలందరూ పరుగెత్తుకు వచ్చారు. ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడికి తగిన కుమారుడు పుట్టాడని అనుకొన్నారు. మన కృష్ణయ్య కుమారుడు కోడలు అని వారికి స్వాగతాలు పలికారు.
వారంతా ఈ ప్రద్యుమ్నుడు రాక్షసుని చేతిలో చనిపోయి ఉంటాడని అనుకొన్నాము. దైవ మాయ వల్ల తిరిగి వచ్చాడని అనుకొన్నారు. రుక్మిణీ కూడా పార్వతీపరమేశ్వరుల దయ వల్లనే చనిపోయాడు, నానుంచి పొత్తిళ్లల్లో ఉన్నప్పుడే దూరమైన వీడు నేడు అజానుబాహువుగా ఎదిగి కృష్ణుడి అందాన్ని పుణికి పుచ్చుకుని నా దగ్గరకు వచ్చాడు వీనిని ఇక జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఆ దేవుని వరప్రభావం వల్లనే మంచి కోడలు కూడా వచ్చింది అని ఎంతో సంతోషంతో కొడుకు కోడలిని ఆహ్వానించి వారికి మంచి విందుభోజనాలు వడ్డించింది.
ప్రద్యుమ్నుడు, మాయావతి రుక్మిణీకృష్ణుల దగ్గరకు వచ్చేశామని ఎంతో సంతోషించారు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి