డైలీ సీరియల్

పరస్పర సహకారమా ఇది? (శంకుతల -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లని మలయమారుతంగా గాలి వీచింది. ‘ఆహా! ఎంత హాయిని గొలిపే చల్లదనాన్ని, సువాసనను మోసుకొస్తోందీ గాలి. మా తండ్రి ఎర్రని ఎండలో తిరుగుతున్నారో లేక వానలో తడుస్తున్నారో ఎలా ఉన్నారో ఏమో, వేళకు తింటున్నారో లేదో అని తండ్రిని తలుచుకుని శంకుతల నిట్టూర్చింది.
ఆ నిట్టూర్పులోని వేడి గాలిని గబగబా లాగేసుకొని చెట్లు శకుంతలకు ఉపశమనం కలిగించే చల్లగాలిని పంపుతున్నాయి.
అదిగో అపుడే దుష్యంతుడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. పూల న్నీ ‘ఆహ్వానం మహారాజా!’ అన్నట్టు ఊగుతున్నాయి. తననే పిలుస్తున్నట్లు అనిపిస్తున్నాయేమిటో ఈ పూలు అనుకున్నాడు దుష్యంతుడు.
కొద్దిదూరంలోనే చిన్న కొలను. ఆ కొలను నిండా పరుచుకున్న కలువలు మనసును ఆకట్టుకున్నాయి. అక్కడే చిన్న చిన్న జింకలు లేలేత పచ్చికను కొరుకుతూ గుమి కూడి ఉండడం చూసి ఎవరైనా అక్కడ ఉన్నారేమో అన్నట్టు చూశాడు.
మంచి సువాసన లిచ్చే పూలు గుత్తులు వాటిపై మూగి ఉన్న తుమ్మెదలను చూస్తూ దృష్టి ముందుకు సాగించాడు ఆ రాజు. ఆయనకు చిక్కటి నల్లని బారు కనిపించింది. ఇదేమిటి! ఆశ్చర్యం తాచుపామును పోలిన ఈ తుమ్మెదల బారేమిటా అనుకొని ముందుకు అడుగువేశాడు.
దేవతా వస్త్రాలను కట్టుకుని ఉన్న ముగ్ధ మోహన రూపు కనిపించింది. ఈమె ఎవరు? ఈ కణ్వాశ్రమానికి వచ్చిన దేవత ఎవరు అని కన్నార్పకుండా ఆమెనే చూస్తుండిపోయాడు దుష్యంతుడు. చంద్రబింబం వంటి ముఖారవిందానికి తేజస్సు నిచ్చే కలువరేకులవంటి కనులు, సంపెగ వంటి ముక్కు, కెంపులను తలదనే్న అధరం ఆమెనే చూస్తున్న దుష్యంతుడు అలా వర్ణించుకుంటూ అందమైన శకుంతలను చూస్తుండిపోయాడు.
దుష్యంతుని రాకను చూసిన జింకలు తమ నోళ్లతో శంకుతల చీర చెంగును లాగుతూ ఎవరు వచ్చారో చూడమని చెబుతున్నాయి. తమ నడకలతో పోటీ పడుతూ నడిచే ఆ భామకు సరిజోడు వచ్చినట్లు ఉన్నాడే అనుకొంటూ నెమళ్లన్నీ బిరబిరా నడిచి శకుంతలకు తోడు నిలిచాయాన్నట్టు ఆమె చుట్టూ చేరాయి. వాటి రాకను గుర్తించిన శకుంతల తల తిప్పి చూసింది.
ఎదురుగా నవ మన్మథుని పోలిన మనిషి. వెంటనే సిగ్గు ఆవరించగా కళ్లు భూదేవికి అర్పించి ‘మా తండ్రిగారు ఆశ్రమంలో లేరండి. మీరు...’ అంది శకుంతల.
అందానికి దాసోహం అయిన దుష్యంతుడు కనులను మరల్చుకోలేక మనసులో ‘ఇదేమి ఈమె మా తండ్రిగారు అంటుంది. కణ్వుని కుమార్తె ఈమెనా.. బ్రాహ్మణ తాపసి కూతురునా.. ఐతే నా మనసెందుకు ఈమెపై లగ్నమైంది. నా హృదయమెందుకు ఈ తారామణితో ముచ్చట్లాడమని చెబుతోంది. నా మనస్సు ఈమెను వివాహమాడాలనే ఉత్సుకతను తెలుపుతోంది. ఎపుడూ అధర్మం చేయని వంశంలోపుట్టిన నాకు ఇలాంటి కోర్కె ఎందుకు కలిగింది. అసలు నా మనసెందుకు చలిస్తోంది’అని శకుంతల గురించి పలువిధాలుగా ఆలోచిస్తున్నాడు. అంతలో ఆశ్రమంలోకి వెళ్లి చల్లని నీళ్లను తీసుకొని వచ్చింది శంకుతల. ఎండలో తిరిగి బాగా అలసిపోయినట్టు ఉన్నారు. ఇదిగో ఇవి తీసుకోండి కాసేపు కూర్చోండి. మీ బడలిక తీరుతుంది అని అతిథి మర్యాదలు చేసింది.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804