డైలీ సీరియల్

భక్తే భవరోగాలకు మందు ( శంకుతల -4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటిదాకా అనుభవించిన రాజ్యసుఖభోగాలను తృణప్రాయంగా వదిలివేశాడు.చీనీ చీనాంబరాలు కట్టిన మేనికి నూలు వస్త్రం కట్టాడు. తళతళామెరిసే పోతూ శత్రువుల గుండెల్లో నెత్తురిడికించే కరవాలాన్ని దూరంగా విసిరేసి కమండలం పట్టుకొన్నాడు. తాను ఎలాగైనా బ్రహ్మర్షి అయిన తరువాత వేరు ఆలోచన చేయాలి అప్పటిదాకా బ్రహ్మర్షి కాగలిగే తపస్సే నా ఆలోచన అంటూ ఆలోచనాసంద్రాన్ని కట్టడి చేసేశాడు.
తపోభూమికి తరలి వెళ్లిపోయాడు.
ఏకాగ్రతతో నిశ్చల మనస్సుతో పరమేశ్వరుని ధ్యానం ఆరంభించాడు. విశ్వామిత్రుని తపోగ్నిలో లోకాలన్నీ తల్లడిల్లుతున్నాయి. విశ్వామిత్రుడు మాత్రం నిశ్చలంగా కూర్చుని సమాధినిష్టుడు అయ్యాడు. దేవేంద్రుడు నారదుని ద్వారా విశ్వామిత్రుని భోగట్టా సేకరించాడు. ఎట్లాగైనా విశ్వామిత్రుని తపస్సును భంగం చేయాలని పూనుకొన్నాడు. పూర్వాశ్రమంలో రాజునే కాబట్టి , ఆ వాసనలు ఇంకా మిగిలి ఉంటాయని తలపోశాడు. వెంటనే మేనకను పిలిపించాడు. తన ఆజ్ఞగా ఎంచి ఆ విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేయమని చెప్పాడు. మేనక హడలిపోయింది. ‘అమ్మో ఆ ఋషి తపస్సు చాలా తీవ్రమైంది. పైగా ఆయనకు కోపం ఎక్కువ. తపస్సు చేసుకొంటున్న ఆయన్ను నేను కదల్చానంటే త్రినేత్రుని వలె నాపై కోపాగ్ని కురిపించి నన్ను ఏరాయోనో రప్పనో చేసేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నేను పోలేను అక్కడికి అని దేవేంద్రునితో విన్నవించుకుంది మేనక.
తపస్సులను పరీక్షించే అధికారి దేవేంద్రుడే కనుక మేనక చెప్పింది ఆయన వినలేదు. నీకు మేమంతా అండగా ఉంటాం. లోకరక్షణ చేయడం నీకు బాధ్యతే. నీ బాధ్యత నీవు విస్మరించకూడదు. పైగా ఇది నా ఆజ్ఞ. రాజాజ్ఞను కాదనకూడదు నేను చెప్పినట్లుగా వెళ్లు నీకు తోడుగా వసంతుని కూడా పంపుతాను. నీకు ఏ అపకారమూ జరగకుండా మేము చూసుకొంటాము అని చెప్పి మేనకకు విశ్వామిత్రుని దగ్గరకు దేవేంద్రుడు పంపించాడు.
***
విశ్వామిత్రుని తపోవాటికలో అకాల వసంతం మేనకకన్నా ముందే వచ్చింది. చెట్లు అన్నీ వసంతుని ఆగమనానికి సంకేతంగా పువ్వులతో పండ్లతో నిండి మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. విశ్వామిత్రుని మేనికి చల్లదనం తాకింది. విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు. చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించాడు. ఇదంతా దేవతారాజు పన్నిన పన్నాగమని తెలుసుకొన్నాడు. నాలో పట్టుదల ఎక్కువే ఉంది కనుక మరేంఫర్లేదు తపస్సును కొనసాగిస్తాను అనుకొని స్థిరాసనంలో కూర్చున్నాడు.
కొంతసేపటికి మేనక వచ్చింది. విశ్వామిత్రునికి నమస్కారం చేసింది. తాను కావాలని ఏమీ చేయడంలేదని, రాజాజ్ఞను కాదనలేని పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నానని మనసున చెప్పుకుని మరీ నమస్కారం చేసింది. తరువాత విశ్వామిత్రుని తపోవాటికకు దగ్గరగా ఉన్న సరస్సులో జలకాలాటలకు వెళ్లింది. చక్కని గొంతుకతో కోయిలను అనుకరిస్తూ తీయని పాటలు పాడుతూ తన కేళీవిన్యాసాలను మొదలుపెట్టింది. ఆ మేనక సుమధురమైన గాత్రం, వసంతుని రాక విశ్వామిత్రుని మనస్సు తటపటాయింపుకు లోనైంది. అయినా కళ్లు గట్టిగా మూసుకుని మనస్సును అదుపులోకి తెచ్చుకుంటూ మంత్రజపం చేసుకొంటున్నాడు విశ్వామిత్రుడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804