డైలీ సీరియల్

ఒయాసిస్ 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు కేసు రిజల్ట్ మాత్రమే చెప్పారు.. కాని కేసు హిస్టరీ చెప్పలేదు.. ఆయనవల్ల నష్టపోతున్న కస్టమర్లు ఆయన ఎలాంటి తప్పులు చేశాడో తెల్సుకోవాల్సిన అవసరం ఉంది.. అందుకని పూర్తి వివరాలు చెప్పండి..’’ మీడియా ప్రశ్న.
‘‘కొంతకాలం కిందట డాక్టర్ శే్వత, డాక్టర్ హేమంత్ ఒక స్నేహితుడి వివాహానికి హాజరుకావటానికి అమెరికా వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడి తెలుగు వాళ్ళు సభ జరుపుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన శే్వతను, హేమంత్‌ను గెస్ట్‌లుగా వేదిక మీదకు ఆహ్వానించారు. వీరితోపాటు ఆ సమయంలో అక్కడున్న ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ రాజశేఖర్‌నూ వేదికమీదకు ఆహ్వానించారు. రాజశేఖర్ వేదికమీద శే్వత పక్కన కూర్చున్నాడు. అదీ వాళ్ళ తొలి పరిచయం.
అప్పుడే రాజశేఖర్ కన్ను శే్వత మీద పడింది. ఒకసారి తన కంటపడిన వాళ్ళని వదిలే స్వభావం కాదు. అతను, వాళ్ళతోపాటు కల్సి వారం రోజులు అక్కడి టూరిస్టు ప్రదేశాల్లో తిరిగాడు. ఇండియా వచ్చిన తర్వాత కూడా ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. రెండు మూడు రకాలుగా వ్యాపారాలు చేస్తున్నందువల్ల సమాజంలో డబ్బూ పలుకుబడీ గల వ్యక్తిగా చెలామణి అవుతున్నందున శే్వత అతనికి మర్యాద ఇచ్చింది.
రాజశేఖర్ శే్వత ఇంటికి వస్తూ పోతూ ఆమె భర్త అహోబలరావుకీ స్నేహితుడైనాడు. రోజూ సాయంత్రం అహోబలరావు ఇంట్లో ఆయనతో కలిసి మద్యం సేవించేవాడు. శే్వత నర్సింగ్ హోం నుంచి ఇంటికి వచ్చాక ఆమెతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు. ఈ క్రమంలో శే్వత తన నర్సింగ్ హోంను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెల్సుకున్నాడు. హైటెక్ సిటీ ప్రాంతంలో మరో యూనిట్ ప్రారంభించాలన్న అభిప్రాయమూ ఆమెకు ఉండేది.
అయితే డబ్బు సమకూర్చుకున్న తర్వాత వీటి రూపకల్పన చేయాలన్నది ఆమె ఉద్దేశ్యం.. ఏదో విధంగా ఆమెకు చేరువ కావాలన్న ఆశతో ఆమె బ్యాంకు ఖాతాలో యాభై లక్షలు జమ చేశాడు. ఆమె అడగకపోయినా.. రాజశేఖర్ ఆమెతో చనువు పెంచుకునేందుకు తనకొక సరోగేట్ మదర్‌ను చూసిపెట్టమని కోరాడు. ఆమె ఆ ప్రయత్నాలూ చేసింది. ఆ సమయంలోనే రాజశేఖర్ తనకు ఎలాంటి మార్గాల ద్వారా డబ్బు వస్తుందో కూడా చెప్పాడు.
‘‘రాజశేఖర్ దుబాయ్‌లోని కొంతమంది స్మగ్లింగ్ ముఠాదారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. తన కంపెనీల్లో వయసులో వున్న అమ్మాయిలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకేవో ఆశలు కల్పించి దుబాయ్ పంపించి వాళ్ళ చేత బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. అలా వచ్చిన అక్రమ సంపాదన సినిమా వాళ్ళకు, వ్యాపారస్తులకు, వడ్డీలకు ఇస్తుంటాడు. ఇవన్నీ చెప్పి, శే్వతను తనదాన్ని చేసుకోవాలని ఆశించాడు.
కానీ ఈ విషవలయంలో చిక్కుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడని శే్వత అతన్ని అంతదూరంలో ఉంచడం మొదలుపెట్టింది. ఎవరిదో పెళ్లిజంట ఫొటో సంపాదించి, తమ ఫొటోలతో మార్ఫింగ్ చేయించి, తనకూ శే్వతకూ పెళ్లి అయినట్లు సోషల్ వెబ్‌సైట్స్‌లో పెట్టి ఆమె పరువు తియ్యాలనీ, భార్యాభర్తలను విడదియ్యాలనీ ప్రయత్నించాడు. తన పరువు తీస్తే రాజశేఖర్ సాగిస్తున్న వ్యవహారం గురించి పోలీసులకు చెబుతానని శే్వత హెచ్చరించింది. ఒక రోజు రాత్రి రాజశేఖర్ తాగిన మైకంలో వున్న సమయంలో శే్వతను బలాత్కారం చేయబోయాడు. ఘర్షణ జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. శే్వత అతన్ని కాలితో తన్నడంతో రాజశేఖర్ అహం దెబ్బతిన్నది.
శే్వత ఇక తనకు లొంగదనీ, పైగా తన చీకటి కార్యకలాపాలను ఎప్పుడైనా బయటపెట్టే ప్రమాదం ఉందనీ గ్రహించాడు. భవిష్యత్తులో ఆమెనుంచి ఎలాంటి ముప్పూ రాకుండా ఉండాలంటే ఆమెను అంతమొందించడం ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చాడు.. ఆమెను చంపటానికి ప్లాన్ వేశాడు. తను చంపినట్లు ఎలాంటి ఆధారాలు ఎవరికీ దొరకకూడదు. ప్రత్యక్ష సాక్షులు అసలే ఉండకూడదు.. ఇందుకు అనుకూల సమయం, సందర్భం గురించి ఆమె నర్సింగ్ హోంలో పనిచేసే నర్స్‌తో సంప్రదించాడు. తనకు సహకరించేటట్లు ఒప్పించాడు.
‘‘ఆరోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో నర్సింగ్ హోంలో శే్వత ఒక డెలివరీ కేసు అటెండ్ అయింది. ఆ సమయంలో నర్స్‌లూ, ఆయాలూ అందరూ పైనే ఉంటారు. శే్వత ఇంటికి వెళ్ళేందుకు కిందికి దిగిన సమయంలో నర్స్ నుంచి రాజశేఖర్‌కి ఫోన్‌కాల్ వెళ్లింది. రాజశేఖర్ గేటు దగ్గర కార్లో వెయిట్ చేస్తున్నాడు. మరో వ్యక్తితో వాచ్‌మన్ అక్కడనుంచి చాయ్ తాగేందుకు వెళ్ళేలా చేశాడు.
‘‘అలా శే్వత తన కన్సల్టింగ్ రూంలో ఒంటరిగా రాజశేఖర్‌కి చిక్కింది. కసిదీరా ఆమెను కత్తితో పొడిచి చంపాడు. రక్తం మరకలు తనమీద చింది పడకుండా ఉండేందుకు షెర్వాణీ వేసుకుని వచ్చాడు. హత్య చేయగానే తన వొంటిమీది షేర్వాణీ తీసి అందులో కత్తిని చుట్టి, తనతో తీసుకెళ్లాడు.. ఇదీ జరిగింది..’’ అని చెప్పాడు రణధీర్.
‘‘మీరు రాజశేఖర్‌ను దూరంగా ఎందుకు నిలబెట్టారు?.. మీ వెనకాల నిలబడితే మాకు ఫొటో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది గదా..’’ అని అడిగాడో విలేఖరి.

- ఇంకాఉంది

శ్రీధర