డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈయన పేరు విశ్వనాథ్ గోడ్బోలే! నా దగ్గర అసిస్టెంటుగా ఉన్నాడు’’
మాణిక్‌చంద్ గోడ్బోలే ముఖం చూచి ‘‘అబద్ధం! నీవే ఆయనకు అసిస్టెంటువు. ఎందుకంటే నీ ఆర్థిక లావాదేవీలన్నీ నీ కొడుకుకు బదులు గోడ్బోలే చూసుకుంటున్నాడు’’ అన్నాడు మాణిక్‌చంద్.
‘‘నిజం నిజం’’ అని నవ్వాడు తంగిరాల శ్రీరామశర్మ సిద్ధాంతి.
గోడ్బోలేకు దీపక్‌చంద్ వ్యాపార రహస్యాలన్నీ తెలుసు.
‘‘ఈయన మా హైదరాబాదులో మంచి వైదిక పండితుడు. అతీంద్రియ విద్యలు కూడా తెలుసు. భూతవైద్యం చేస్తుంటారు’’ అని తంగిరాలవారిని దీపక్‌చంద్ పరిచయం చేశాడు.
మాణిక్‌చంద్ ఒక్క క్షణం తంగిరాలవారి ముఖంలోకి చూసి -
‘‘మీకు చేవెళ్ళలో నిరీక్షణానంద స్వామి ఆశ్రమంలోని సెక్రటరీని చంపిన దయ్యం గురించి తెలిసిందా?’’ అని ప్రశ్నించాడు.
దీపక్‌చంద్ ఆశ్చర్యపోయాడు. మాణిక్‌చంద్ సర్వజ్ఞుడు. ఈయనకు చేవెళ్లలోని సెక్రటరీ గురించి ఎలా తెలిసింది? జైనులు దయ్యాలను నమ్ముతారా? మాణిక్‌చంద్ మహారాజ్ దీపక్‌చంద్ వైపు చూసి -
‘‘నీ కుమారుణ్ణి సిఐడిలు ఎక్కడికో తీసుకుపోయారు. బహుశా దయ్యాల కొంపను అనే్వషించందేకు కావచ్చు’’ అన్నాడు.
దీపక్‌చంద్ భయపడ్డాడు.
నిర్ఖాంతపోయాడు.
ఆశ్చర్యపడ్డాడు.
మాణిక్‌చంద్ మహరాజ్‌కు అతీంద్రియ శక్తులు ఎలా లభించాయి? ఇతడు సామాన్య యోగి కాదు. భక్తులంతా వెళ్లిపోయిన తర్వాత దీపక్‌చంద్ ఆయన కుటుంబ సభ్యులు విశ్వనాథ్ గోడ్బోలే ఆయన కుటుంబ సభ్యులు తంగిరాల సిద్ధాంతి మాత్రమే మిగిలిపోయారు.
‘‘మీతో తత్త్వవిచారం చేయాలని అనుకుంటున్నాను. జీవుడు జగత్తు ఈశ్వరుడు - సృష్టి పునర్‌సృష్టి శే్వతాంబర దిగంబర సంప్రదాయాలు వీటిని గురించి చర్చించాలని అనుకుంటున్నాను’’ అన్నాడు తంగిరాల సిద్ధాంతి.
మాణిక్‌చంద్ ఇలా అన్నాడు.
‘‘ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని సముద్రతీరం చేరి మెల్లగా నీళ్లలోకి దిగింది. అంతే బొమ్మ అదృశ్యమయింది. ఈ తాత్త్విక చర్చలు అలాంటివే. అందులోకి దిగితే ఇక మన అస్తిత్వం ఉండదు. మనమే చర్చలుగా మారిపోతాము. ఇది దిగినకొద్దీ బయటకు రాలేని ఊబి లాంటిది’’
‘‘స్వామీ! భారతీయ సంప్రదాయంలో ప్రశ్నించడం చాలా ముఖ్యం. అదే ఉపనిషత్తుల ఆదర్శం. ప్రశ్నలో నుండి సమాధానాలు పుడతాయి.’’
‘‘ప్రశ్నలో నుండి ప్రశ్నలు కూడా పుడతాయి. విశ్వానుభూతికి ప్రశ్నలూ ప్రవచనాలు ఉపయోగపడవు. ఇవి ప్రాథమిక దశమాత్రమే’’
దీపక్‌చంద్‌కు ఈ సంభాషణ నచ్చటం లేదు. ఆయన చాలా టెన్షన్‌లో ఉన్నాడు.
పార్థుకు ఏమయింది?
ఈ మొత్తం ఏదో అయోమయంగా ఉంది.
తాను కాకతాళీయంగా యాదృచ్ఛికంగా చేవెళ్లలోని పొలం కొనాలి అనుకున్నాడు. దానికి ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు.
ఒకటిమాత్రం నిజం.
ఆ భూమి తక్కువ రేటుకు పలుకుతున్నా ఎవరూ కొనడానికి రావడం లేదంటే అందులో ఏదో బలమైన కారణం ఉండాలి కదా!’’
మాణిక్‌చంద్ దీపక్‌వైపు చూసి ‘‘గోడ్బోలే మీకు చాలా కథలు చెపుతాడు. అన్నీ శ్రద్ధగా వినండి’’ ‘‘కార్యదర్శిని దయ్యాలు చంపిన వివరాలు కూడా తెలుస్తాయా మహరాజ్?’’
‘‘వెర్రివాడా! మీకు తెలిసింది ఇదొక్కటి మాత్రమే. మెదక్ నుండి రామిరెడ్డి ఆ పొలం కొనాలని వచ్చాడు. దారిలోనే ఓ లారీ ఆయన స్కూటర్‌ను ఢీ కొన్నది. ఆయన అక్కడికక్కడే నెత్తురు కక్కి చనిపోయాడు.’’
దీపక్ చంద్ దిగ్భ్రాంతుడై వింటున్నాడు.
‘‘ఇలాంటి ప్రమాదకరమైన పనికి పార్థును సిఐడిలు పంపడం ఏమిటి?’’
మాణిక్‌చంద్ నవ్వాడు.
‘‘్భయపడకండి. పార్థు ఒంటరిగా పోలేదు. వెంట మప్టీలో పోలీసులు కూడా ఉన్నారు.’’
‘‘ఎందుకు?’’
‘‘తినబోతూ రుచులడిగినట్లుంది. ఎందుకో గోడ్బోలే చెబుతాడు’’ మాణిక్‌చంద్ మహారాజ్ బంధువులందరికీ దూద్‌పేడాలు ప్రసాదంగా పంచిపెట్టాడు.
‘‘విగ్రహారాధన జైనంతోనే మొదల యిందని కొందరు ప్రచారం చేస్తున్నారు’’
తంగిరాల సిద్ధాంతి ఏదో శాస్తవ్రాదం లేవదీశాడు.
దీపక్‌చంద్ చాలా ఆందోళనలో ఉన్నాడు.
‘‘శాస్ర్తిగారూ! ఈ విగ్రహా రాధనలు నిర్గుణోపాసనలూ చాలా పుస్తకాల్లో ఉన్నాయి. తర్వాత చర్చించుకుందాము లెండి’’
‘‘ఔనౌను - విగ్రహాలు - ఆరాధనలు’’ అంటూ మాణిక్‌చంద్ విచిత్రంగా నవ్వాడు.
ఆ నవ్వులో ఏదో అంతరార్థం ఉందని దీపక్‌చంద్‌కు తెలిసింది.
అంతా సెలవు తీసుకున్నారు.
తంగిరాల సిద్ధాంతి చిక్కడపల్లి వెళ్లిపోయాడు.
గోడ్బోలే తన కుటుంబాన్ని ఇంటికి పంపాడు.
‘‘గోడ్బోలే! పద బేగంబజారుకు పోదాం’’ అని అతనిని వెంటబెట్టుకొని దీపక్‌చంద్ తన ఇంటికి చేరాడు. అప్పటికి బాగా పొద్దుపోయింది. నగరం మెల్లగా నిద్రలోకి జారిపోతున్నది.
మేడమీద దీపక్‌చంద్ గోడ్బోలే మాత్రమే మెలకువతో ఉన్నారు.
ఎటుచూచినా నిశ్శబ్దం.
దీపక్ మనస్సుకు మాత్రం ఏదో అశాంతి.
మాణిక్‌చంద్ మొదట్లో సామాన్య జీవితం గడిపేవాడు. క్రమంగా సాధనలు మొదలుపెట్టాడు. కొంతకాలం వౌనయోగిగా ఉండి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.
సమాజానికి దూరంగా ఉండి ఒంటరిగా ఏవేవో సాధనలు చేశాడు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి