డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కినవి సికిందరాబాదు ఆవులమందలోని లక్ష్మీనారాయణ స్వామి గుడిలో ఆవులకూ, పావురాలకూ దాణా కోసం పంచిపెడుతున్నాడు. హనుమాన్ వ్యాయామ శాలకు చందాలు ఇస్తున్నాడు.
పార్థూ! పూర్వం ఇక్కడ తెలంగాణలో చిన్న చిన్న సంస్థానాలుండేవి. వారిలో కొందరు తమ సంపదను దానధర్మాలకోసం వాడేవారు. గద్వాల సంస్థానంలో కవి పండితులను పోషించేవారు. సాగర తీరంలో ఒకాయన పేరు కుక్కల జమీందారు. ఎందుకంటే ఆయన సీమజాతి కుక్కలను తెప్పించి పెంచేవాడు. ఇంకొకాయనకు గుర్రాల పిచ్చి. మీర్జాపూర్ రాజా సినిమాలు తీసేవాడు. కృష్ణవేణి అనే సినిమా తీర ఆయన కంపెనీ నుండి వచ్చింది.
డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి కరిచి చివరికి దానిని కుక్కలు, పిల్లులు, గుర్రాలు, దేవదాసీలను పెంచడం కోసం ఖర్చు పెట్టడం మనం చూస్తున్నాము.
కొందరు రాజులు రాళ్లపైన డబ్బులు ఖర్చుపెట్టేవారు. రాళ్లు అంటే విలువైన వజ్రాలవంటివి. రాళ్లు అంటే దేవాలయాల్లో ఉపయోగించే రాళ్లు. రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత ఇలాగే పుట్టింది’’.
పార్థూ ఇలా అన్నాడు -
‘‘జుత్తు ఉంటే ఏ జడ అయినా సరే వేసుకోవచ్చు. అసలు డబ్బే లేకుంటే మంచి లేదా చెడ్డపనులు ఎలా చేయగలడు?’’
‘‘అందుకు షార్ట్‌కట్స్ పనికి రావు. దుర్మార్గపు సంపాదన వద్దు. మా బంధువు ఒకాయన లంచాలు పుచ్చుకొని లక్షలు సంపాదించాడు. కొడుకు రోడ్డు ప్రమాదంలో పోయాడు. ఆయనకు గాస్టిక్ రోగం వచ్చింది. గంజి, మజ్జిగ తప్ప ఏమీ తీసుకోకూడదని డాక్టర్లు చెప్పారు. సారాంశం ఏమిటంటే చేవెళ్లలో దయ్యాల వ్యాపారం వెనుక ఏదో అసాంఘిక దుర్మార్గం ఉందని నా నమ్మకం. దీనిని మనం ఛేదించాలి’’
‘‘నేను ధైర్యంగా దెయ్యాలతో పోరాడు తాను’’
‘‘ఉత్తరకుమార ప్రజ్ఞలు వద్దు. పని చేసి చూపు. అప్పుడు రీల్ హీరో కాక రియల్ హీరో అవుతావు’’
శ్రీ్ధర్ ఇంకా ఇలా చెప్పాడు
‘‘నిజాం నవాబు కాలంలో కొన్ని నమాజు చేసే ప్రదేశాలుండేవి. అవి 1948 తర్వాత విద్యాలయాలుగా మారాయి. కొన్ని చోట్ల బాల్‌రూం డాన్సులు చేసేవారు. అవి ప్రస్తుతం స్టార్ హోటళ్లు అయినాయి. ఆ రోజుల్లో గడిలో ఆడపాపలు ఉండేవారు. వారు డాన్సులు చేసి పటేల్ పట్వారీ, జాగీర్‌దార్లను మెప్పిస్తూ ఉండేవారు. అప్పుడు బొంబాయి నుండి మద్రాసు నుండి నాట్యకత్తెలు వచ్చేవారు.
ఆ రోజుల్లో సికిందరాబాదులో బూరుగు మహాదేవ, జూలూరి వీరేశలింగం, వంగపల్లి విశ్వనాథం వంటి వైశ్యులు ధర్మపోషణ కోసం సంపదను వినియోగించేవారు. వరంగల్ కొండూరు రామలింగం, బుచ్చి రాజలింగం, మంకయ్య లింగం, ఆకారపు నరసింహం శ్రేష్టి వంటివారు హిందూ ధర్మం, శైవమతం పోషించేవారు. దేవాలయాలు నిర్మించేవారు.
1948 రజాకార్ల ఉద్యమ కాలంలో చాలా దేవాలయాలు ధ్వంసమైనాయి. బహుశా ఈ చేవెళ్ల గుడి ఆ కాలంలో శిథిలావస్థకు వచ్చి ఉండవచ్చు. మరికొందరు తమ దేవాలయాలకు ఇతరులకు కనబడకుండా భూగర్భంలో నిర్మించారు. పైన ఇల్లు ఉంటుంది. మెట్లు దిగి కిందికి పోతే విశాలమైన దేవాలయం ఉంటుంది. ఇలాంటివి ఇప్పటికీ మనం హుస్సేనీఆలం కమాన్, టోలీచౌకి, కర్మన్‌ఘాట్ వంటి ప్రాంతాల్లో చూడవచ్చు.
కొందరు తమ సంపదలను శత్రువులకు భయపడి భూగర్భంలోను, స్తంభాలలోను దాచిపెట్టేవారు. నా ఊహ సరియైనదే అయితే ఈ శిథిలాలయంలో ఎవరో నిధి దాచి ఉండాలి’’
‘‘ఎవరు?’’ ‘‘ఎవరైనా కావచ్చు, నీవైనా కావచ్చు’’ పార్థు గాలిలో ఎవరితోనో పోరాడు తున్నాడు.
పిడిగుద్దులు గుద్దుతున్నాడు.
తిడుతున్నాడు. మైమ్ అభినయిస్తున్నాడు.
‘‘పార్థూ! ఏం చేస్తున్నావ్?’’ అని శ్రీ్ధర్ ప్రశ్నించాడు.
‘‘ఇదిగో! ఈ దయ్యం దొరికింది. ఇది గాలి దయ్యం. వెకిలినవ్వులు నవ్వుతున్నది. పట్టుకుందామంటే దూరంగా పారిపోతున్నది. అందుకని హనుమాన్ చాలీసా చదువుతూ దాని జుట్టు పట్టుకొని నేల కీడ్చాను. ఫెడీ ఫెడీమని కొట్టాను’’
‘‘ఔరా! బాంబే ఫిలిం హీరోవు అయినావే!’’
‘‘వాళ్లు డమీ బాక్సింగ్ చేస్తారు. నేను నిజంగా గాలి దయ్యాన్ని పట్టుకొని కండలు కండలుగా నరికివేశాను.
‘మహావీరా! నన్ను వదలపెట్టండి. బాంచను నీ కాల్మొక్తా’ అంటూ దయ్యం ఏడుస్తున్నది.
‘పోవే! పో దొంగదయ్యమా! ఇప్పటికి ఎంతమందిని చంపావే?’’
‘‘చాలా మందిని చంపాను స్వామీ! నేను అసఫ్‌జాహీల కాలం నుండి ఇక్కడే కాపురముంటున్నాను. ఇప్పుడు మెల్లగా నా సంతానం హైదరబాదు, సికిందరాబాదు నగరాల్లోకి ప్రవేశించింది. రాత్రివేళల్లో కొందరు మగవాళ్లలో ప్రవేశించి ఆడవాళ్లను చితకబాదేటట్లు చేస్తున్నాయి. కొందరు ఆడవాళ్లలో ప్రవేశించి మగవాళ్ల మాటలు వినకుండా జారిణులుగా మారేటట్లు చేస్తున్నాయి. నిజాయితీగల ఆఫీసర్లను పట్టుకొని పీడించి పైరవీలు చేసి డబ్బులు సంపాదించేటట్లు, అవినీతిపరులుగా మారుస్తున్నాయి.
ఒక దయ్యం బంజారాహిల్స్ దగ్గర కృష్ణనగర్ దగ్గకు చేరింది. మద్రాసులోని పాండీ బజారు లాంటిది సినిమా వేషాల కోసం వచ్చి మకాం వేసిన వారిని పట్టి పీడిస్తున్నది. మరో సైతాన్ దారుస్సలాం చేరి మతపిచ్చులు రేపుతున్నది. కొందరిచేత కల్లు తాపించి కోతిలా గెంతేలా చేయిస్తున్నది.
అమ్మో! ఎన్ని దయ్యం పిల్లలో కనపడకుండా వికారంగా గెంతుతూ భయపెడుతున్నాయి.’’
‘‘పార్థూ! నీ ఇల్యూషన్ చాలా రసవంతరంగా ఉంది. పద ఆశ్రమం వచ్చింది.

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్