డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ్ధర్ పార్థును ఆశ్రమం ముందు దించాడు.
‘‘నీవు లోపలికి పో! భోజనం చేసి అక్కడే పడుకో. నేను శిథిలాలయం దగ్గర కాపలా కాస్తూ ఉంటాను. ఈ రాత్రి మనకు ఏవైనా క్లూలు దొరకవచ్చు. మరో మాట మనం ఇరువురం కలిసి వచ్చినట్లు గాని, నేను ఫలానా అని గాని నీవు ఆశ్రమంలో చెప్పకూడదు’’
‘‘సరే సరే ఉదయం నేను గుడి దగ్గరికి వస్తాను’’ అని పార్థు ఆశ్రమంలోనికి వెళ్లాడు.
అతనిని ఆశ్రమ నిర్వాహకులు ప్రేమతో ఆదరించారు. నిరీక్షణానంద స్వామివారి దర్శనము, ప్రసాదమూ లభించాయి. ఒక రాత్రి అక్కడ విశ్రమిస్తే విశేష ఫలితం అని తండ్రి దీపక్‌చంద్ చెప్పినట్లు పార్థు చెప్పాడు.
పార్థుకు ఒక రూం చూపించారు.
పార్థుకు ఆశ్రమంలోని వంట మనిషి రొట్టెలు పెట్టింది. భోజనానంతరం కొన్ని పండ్లు, మంచినీరు రూంలో పెట్టి వెళ్లింది.
పార్థు ఆమెను గమనిస్తున్నాడు.
కొంచెం పొద్దుపోయేసరికి ఆశ్రమంలో లైట్లు తీసివేశారు.
అంతా నిశ్శబ్దం.
ఎక్కడో దూరంగా కుక్కలు మొరుగుతున్న ధ్వని. బయట ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు. మెయిన్‌గేట్ తీసిన శబ్దం.
పార్థు బయటకు రావాలని ప్రయత్నించాడు. కాని అతని గదికి బయట నుండి గొళ్లెం పెట్టారు.
పెద్దగా అరుద్దామా అనుకు న్నాడు కాని శ్రీ్ధర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఏమీ శబ్దాలు చేయకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని శ్రీ్ధర్ ఆదేశం. పార్థు కిటికీలో నుండి చూచాడు. ఏమీ కనబడడం లేదు.
అంతా చిమ్మచీకటి.
కొంతసేపటికి మెయిన్‌గేటు నుండి ఎవరో బయటకు పోయినట్లు గమనించాడు.
పార్థు ఊపిరి బిగబట్టి చీకటిలో రేడియం కళ్లతో చూస్తున్నాడు. చాలా దూరంగా ఓ దయ్యం కన్పించింది. పార్థు నవయువకుడు. పైగా చాలా బాలీవుడ్ సినిమాలు చూచాడు. ఐనా ఒక్కసారి ఒళ్లు జలదరించింది.
పార్థు స్విచ్‌ఆన్ చేద్దామని ప్రయత్నిం చాడు.
కాని కరెంట్ లేదు. పోయిందా? లేక ఎవరైనా మెయిన్ ఆఫ్ చేశారా?
పార్థుకు చనిపోయిన సెక్రటరీ జ్ఞాపకానికి వచ్చాడు.
‘‘ఈ రాత్రి తన పని అయిపోయింది’’ అనుకున్నాడు.
సిఐడి శ్రీ్ధర్‌ను తిట్టుకున్నాడు. వెళ్లి దబదబ తలుపులు బాదాలని అనిపించింది. కానీ శ్రీ్ధర్ ఆజ్ఞ గుర్తుకు వచ్చి నిస్సహాయంగా గదిలో కళ్లు మూసుకొని పడుకున్నాడు. ఓ రాత్రి నిద్రపట్టింది.
అదొక అర్ధస్వప్నం. అంటే జాగృతి కాదు సుషుప్తి కాదు.
శిథిలాలయం దగ్గర పిశాచాలు నర్తిస్తున్నాయి. ఐదు తలల నాగుపాము దగ్గరకు వచ్చినవారిని కాటు వేస్తున్నది.
జనమంతా భయపడిపోతున్నారు. శిథిలాలయం నుండి ఒక సొరంగం ఉంది. అది నేరుగా గోల్కొండ కోటలోకి దారి చూపుతున్నది. అంటే అత్యవసర పరిస్థితులలో కోట ముట్టడి జరిగితే అక్కడి నుండి రాజులు రాణులు ఈ సొరంగం నుండి చేవెళ్ల శిథిలాలయం చేరుతారన్నమాట!
సొరంగంలో నుండి ఎవరో రాణి బయటకు వచ్చింది. తర్వాత ఎటుపోయిందో తెలియదు.
శిథిలాలయం కింద వజ్రవైఢూర్య గోమేధిక పుష్యరాగాలున్నాయి. మరకత మాణిక్యాలు పొదిగిన శివలింగానికి ఎవరో పాలతో అభిషేకం చేస్తున్నారు.
వీరంతా మనుషులా? గంధర్వులా? దేవతలా? అసలు భూలోకవాసులా? లేక గ్రహాంతరవాసులా??
పార్థు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని కల చెదిరిపోయింది. ముఖానికి చెమట పట్టింది.
తాను నిరీక్షణానంద స్వామివారి ఆశ్రమం లోనే ఉన్నట్లు గ్రహించాడు.
ఇంతలో ఏదో శబ్దం.
మెయిన్ గేటు తలుపులు తెరుచుకున్నాయి.
ఎవరో లోపలికి వస్తున్నట్లు అడుగుల శబ్దం.
ఆ తర్వాత ఆశ్రమంలో మళ్లీ విద్యుత్ సరఫరా మొదలయింది.
కాసేపటికి ఎవరో తన గది తలుపులకు బయట నుండి వేసిన గడియను తొలగించారు.
పార్థు కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్నాడు.
అప్పటికి తెల్లవారుజాము దాటింది.
ఆశ్రమం బయట ఆవు అంబా అంటూ అరుస్తున్నది. ఎవరో వెళ్లి ఆవుకు గడ్డి వేస్తున్న శబ్దం.
పాలు పిండుతున్న శబ్దం.
ఆశ్రమం చుట్టూ చిమ్ముతున్నట్లు చీపురు శబ్దం.
పార్థు తలుపు తీసి బయటకు వచ్చాడు. అంతా మామూలుగా ఉది. మెల్లమెల్లగా వంటగదిలో ఇడ్లీ పిండి రుబ్బుతున్న గ్రైండర్ మోత.
క్రమక్రమంగా తెల్లవారింది.
పార్థు ముఖం కడుక్కొని ఆశ్రమం బయటకు వచ్చాడు. శిథిలాలయం దగ్గరకు పోవడానికి ధైర్యం చాలలేదు. స్వప్నంలో కన్పడిన ఐదు తలల పాము, వజ్రాలగుట్టలు గుర్తుకు వచ్చాయి.
మెల్లమెల్లగా నడుచుకుంటూ మెయిన్‌రోడ్ వైపు వెళ్లిపోయాడు.
అక్కడి నుండి నేషనల్ హైవే వైపు నడక సాగించాడు.
మరికొంతసేపటికి స్కూటర్ శబ్దం వినిపించింది.
శ్రీ్ధర్ వస్తున్నాడు.
‘‘పార్థూ! స్కూటర్ ఎక్కు’’ అన్నాడు.
మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు.
‘‘రాత్రి ఏం జరిగింది?’’
పార్థు తనకు వచ్చిన కలను చెప్పాడు.
‘‘వజ్రవైఢూర్య గోమేధిక పుష్యరాగ...’’
‘‘కలలో సరే, ఇలలో ఏం జరిగిందో చెప్పు’’
‘‘చెప్పడానికి ఏమీ లేదు. ఏమీ కన్పడ లేదు. అంతా చీకటి’’
‘‘చీకటి కూడా రహస్యాలు చెబుతుంది. అక్కడ నీకేం శబ్దాలు విన్పడ్డాయో చెప్పు’’
‘‘ఏమీ వినపడలేదు. అరుపులు లేవు, కేకలు లేవు. అంతా నిశ్శబ్దం.

ఈ నవలలోని పాత్రలు కల్పితాలు

- ఇంకా ఉంది