డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపక్‌చంద్ ఔను అనలేదు, కాదు అనలేదు.
అందరినీ గౌరవించాడు.
విశ్వనాథ్ గోడ్బోలే మాత్రం వీరందరూ ఒకే తత్త్వం చెప్పడం లేదని అనుకున్నాడు.
ఎవరికి తెలిసింది వాడు ప్రతిపా దిస్తున్నాడు.
ఒకటి ప్లస్ ఒకటి రెండు కావాలి; మూడు అని చెబితే అబద్ధం అవుతుంది.
అందువల్ల వీరందరూ చెప్పిన దానిలో ఏదో ఒకటి మాత్రమే నిజమై ఉండాలి. తక్కినవి స్వకపోల కల్పితములై ఉండాలి.
దీపక్‌చంద్ పురుషరూపంలో ఉన్న మాతృత్వం.
ఒక్కొక్క అనాథబాలుణ్ణి పేరుపేరునా పలకరించాడు.
యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నాడు.
వేళకు భోజనం లభ్యమవు తున్నదా? అన్నంలో రాళ్లు రావడం లేదు కదా! భోజనంతో పాటు ఏయే స్వీటు ఇస్తున్నారు? వేళకు నిద్రపోతున్నారా? లేదా? దోమల బాధ ఏమైనా ఉందా? ఇలా ఒక్కొకకరినీ పేరుపేరునా పిలిచి పలుకరించి పులకరిస్తున్నాడు.
చంద్ అంటే చంద్రుడు.
చంద్రుణ్ణి చూచినప్పుడు సరస్సులో కలువ కనె్నలు వికసించి దరహసిస్తాయి. దీపక్‌చంద్‌ను చూచినప్పుడు ఈ చిన్నారి బాలుర ముఖాలు కొలనులోని కలువల వలె విప్పారి విస్ఫారి తములౌతాయి.
ఇదెక్కడి అనుబంధం!!
జన్మజన్మాంతర సంస్కారం!
ఇది వ్యాపారం కోసం, చందాల కోసం, విదేశీ నిధుల కోసం, పాలపొడి డబ్బాల కోటాల కోసం నడిపే జుమ్లా ఆశ్రమం కాదు. ఇదొక దైవపూజ. దీపక్‌చంద్ కన్నా పెద్ద పెద్ద ధనవంతులు ఇటు బీగంబజార్, ఉస్మాన్ గంజ్‌ను, అటు బంజారాహిల్స్‌లోను ఉన్నారు. వారంతా సుఖజీవనం గడుపుతున్నారు. కాని దానం ద్వారా కరుణ ద్వారా త్యాగం ద్వారా దీపక్‌చంద్ పొందే అతీంద్రియ ఆనందాన్ని వారు పొందలేకపోతున్నారు.
ఈ పిల్లలంతా ఈశ్వరుని ప్రతిరూపాలు మానవసేవయే మాధవసేవ అని సూక్తి. పుస్తకాలకు, మస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ అది క్రియారూపంగా అనువదింపబడింది.
ఆరాధనాయ లోకస్య - ఆ బాలల మూర్థాన్ని చుంబించి కపోలాలను శిరోజాలను స్పృశించి కనుచూపుల కరుణామృతాన్ని వర్షిస్తూ వారిని మంచి ముద్దలుగా మారుస్తూ చేసే ఆదరణ ఆప్యాయత దివ్యత్వానికి ఆమ్రేడితం - కారుణ్య స్తోతస్వినికి పర్యాయపదం.
ఓ పిల్లవాడు దేశభక్తి గీతం పాడాడు.
‘‘అజేయ భారత సంఘటనం ఆజన్మాం తం మన లక్ష్యం
అదే జాహ్నవీ సందేశం అరుణారుణధ్వజ సంకేతం
పక్షులలోన ఖగేంద్రుడు పశువులలోన మృగేంద్రుడు
భరతావని నరునికి ఉపదేశం - గీతా చార్యుని సంగీతం
బలవంతులను హతమార్చి బలం నెగ్గటం పశుధర్మం
దుర్బల జీవనమొక పాపం బలోపాసనే కర్తవ్యం
వ్యక్తికి బహువచనం శక్తి - శక్తి రహస్యం సంఘటనం
శివునిచేతిలో త్రిశూలము శ్రీహరి చేత సుదర్శనం
అసురశక్తిపై ధర్మజయం అనాదిగా మన ఆదర్శం’’
అంతా చప్పట్లు చరిచారు.
కార్యక్రమానికి ముందు దీపక్‌చంద్ యధావిధిగా గోపూజ నిర్వహించాడు.
ఆ ఆవు కుంటుతున్నది.
అప్పుడు విశ్వనాథ్ గోడ్బోలే ఇలా అన్నాడు -
‘‘ఈ ఆవు భారతదేశానికి సంకేతం. పూర్వం ఇక్కడ ధర్మము నాలుగు పాదాలపై నడుస్తూ ఉండేది. ఇప్పుడు కుంటుతూ ఉంది. అందుకే ఈ దేశం ఇలా అయిపోయింది’’
విశ్వనాథ్ ముఖ్య అతిథికి సమోసా, జిలేబి, చల్లచల్లని మజ్జిగ ఇచ్చాడు.
తమ ఆశ్రమ పాఠశాల విశేషాలు చెప్పాడు.
‘‘ఇక్కడ గోపూజ జరుగుతుంది. పరిసరప్రాంతాల వారు కూడా వచ్చి ఆవుకు అరటిపండ్లు, దాణా తినిపించి దణ్ణం పెట్టుకొనిపోతుంటారు. ఆవు పాలను తీసి జున్ను లేదా పాలు అమ్మటం జరుగదు. మొత్తం పాలు దూడలే తాగుతాయి. ఆవు మూత్రాన్ని, పేడను ఒక కెమికల్ ఫాక్టరీకి పంపుతారు. వారు ఆయుర్వేద ఔషధాలుగా చేసి ప్రజలకు అందిస్తారు.
ఆశ్రమంలో చెట్లున్నాయి. వాటికి వివాహం చేసే ఒక రాజస్థానీ సంప్రదాయం ఉంది. అంటే వృక్షములు, ఆవులు వారి దృష్టిలో సజీవదైవాలే. చలికాలంలో మేకలకు, ఆవులకు చొక్కాలు తొడుగుతారు. ఇది జైన సంప్రదాయం.
దీపక్‌చంద్ ఆశ్రమ పాఠశాల వద్ద ఓ ఉయ్యాల ఉంది. అక్కడ తెల్లవారే లోపల ఎవరెవరో తమ తమ బిడ్డలను వదలేసి వెళ్తుంటారు. వారంతా అక్రమ సంతానం కావచ్చు లేదా లవ్‌జీహాద్‌లో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న విధివంచిత సంతానం కావచ్చు. వారికి దీపక్‌చంద్, ఆయన భార్య ప్రభా చంద్ తల్లిదండ్రులు. రికార్డులలో కూడా వీరిపేర్లే ఉంటాయి.
మీ గోత్రం ఏమంటే వర్ధమాన గోత్రం అని చెప్పుకుంటున్నారు. ఈ వర్ధమాన మహావీరుడు జైనమత తీర్థంకరుడు.
దీపక్‌చంద్ చేస్తున్న సమాజే సేవను గుర్తించి రాష్ట్రప్రభుత్వం సామాజిక సేవావిభాగంలో సత్కారం కూడా అందించింది.
ఐతే ఈయనకు పేరు ప్రఖ్యాతులు రావడం ఇష్టంలేనివారు దీపక్‌చంద్ ట్రాన్సుపోర్టు కంపెనీ ఓ బోగస్ వ్యాపారం, ఇతడు ఎవరితోనో కలిసి దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నాడు లేకుంటే ట్రాన్స్‌పోర్టు కంపెనీ యాజమాని ఇన్ని విరాళాలు ఎలా ఇవ్వగలడు? అంటూ తమ సాడిజం ప్రదర్శించుకున్నారు.
దీపక్‌చంద్, ప్రభాచంద్ లేకుండా బీగంబజార్హ, జాంబాగ్, పత్తర్‌గట్టి ప్రాంతాలల్లో ఏ సామాజిక కార్యకలాపాలు జరుగవు’’.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి