డైలీ సీరియల్

పట్టుదలతోనే సత్ఫలితం( సగరుడు -4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతే వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏరా మా యాగాశ్వాన్ని దొంగలించి తీసుకొని వస్తావా.. నీకెంత పొగరు అంటూ పెద్దపెద్దగా అరుస్తూ ఆయన మీదికి దూకారు. ఎంతకీ ఆయన కళ్లు తెరవకపోయేసరికి వీళ్లకు కోపం ఎక్కువై అక్కడ పక్కన ఉన్న చెట్లను పెరికి ఆయన మీదకు విసిరేశారు. ఆయన శిఖను పట్టుకుని లాగారు.
ఆ రణగొణధ్వనికి కపిలునికి తపోభంగం అయంది. కపిలుడు కనులు తెరవగానే ఎదురుగా ఉన్న సగరుని పుత్రులు కనిపించారు. ఆయన తపోశక్తి జరగబోయేదానిని చూశాడు. బ్రహ్మ రాసిన రాతను అవలోకిస్తుండగా సగరుని పుత్రులు కనులు తెరిచి కూడా కపిలుడు మాట్లాడడం లేదని ఒక్కసారిగా ఆయనపైకి దూకి కపిలుడిని గాయపర్చి తమ యాగాశ్వాన్ని తీసుకొని వెళ్దాం అనుకొని పెద్దగా అరిచారు. అంతే కోపోద్రిక్తుడు అయన కపిలుడు ఒక్క హుంకారం చేశాడు.
సగరుని అరవై వేలమంది పుత్రులు కపిలుని క్రోధాగ్నిలో మండి మాడి బూడిద కుప్పలుగా మారిపోయారు.
ఇవేమి తెలియని సగరుడు వీరికోసం ఎదురుచూశాడు.
యాగాశ్వమూ, తన కుమారులు ఎన్నాళ్లయినా రాకపోయేసరికి యజ్ఞం పరిసమాప్తి ఎలా చేయాలో తెలియక సగరుడు వేదపండితులను మార్గం చూపించమని అడిగాడు. వారు చెప్పిన ప్రకారం తన మనమడు అయిన అంశుమంతుడిని యాగాశ్వాన్ని, పినతండ్రులను చూసి రమ్మని పంపించాడు. అంశుమంతుడు వారిని వెతకడానికి వెళ్లాడు. ఆయనకు దారిలో వైనతేయుడు కనిపించాడు. వైన తేయుని వల్ల తన పిన తండ్రుల సమాచారం అంశుమంతునికి తెలిసింది. అతడు వారికి ఎలా ఉత్తమ గతులు కల్పించవచ్చు అని వైనతేయుడిని అడిగాడు. వైనతేయుడు ఇది నీ వల్ల కాదు. నీవు వెళ్లి సగరుని చేత యాగాన్ని పరిసమాప్తి చేయించు. ఆ తరువాత వీరి గురించి ఆలోచించుము. వీరికి ఉత్తమ గతులుకలగాలంటే ఆకాశ గంగ భువిపైకి రావాలి. ఆ గంగ స్పర్శతో వీరికి మోక్షం కలుగుతుంది అని చెప్పాడు.
ఇది తెలుసుకొన్న అంశుమంతుడు ఎంతో బాధపడి యాగాశ్వాన్ని తీసుకొని తన నగరానికి వెళ్లి జరిగిందంతా సగరునికి చెప్పాడు. అతడు పుత్ర శోకం తో కుమిలిపోయాడు. ఆ తరువాత పండితులు సూచన మేరకు సగరుడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు.
కొన్నాళ్లకు సగరుడు కూడా పరమపదించాడు. ఆ రాజ్యాన్ని అంశుమంతుడు ధర్మయుతంగా పాలించాడు. ఆ వంశంలోని భగీరథుడు తీవ్ర ప్రయత్నం చేసి శివుని మెప్పించి ఆకాశగంగను భువికి రప్పించి తన పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించాడు.
ఇలా సగరుని వంశం పేరు ప్రఖ్యాతులు పొందింది.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804