డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అప్పుడే నిద్రేవిటీ? ఇంకా బయటంతా సందడిగా ఉంటేనూ!’’
‘‘సరే.. సరే.. ఏవన్నా మాట్లాడుకుందాం. నీకు నేనెలా ఉంటే ఇష్టం?’’
‘‘మన పెళ్లి అయిపోయాక ఇహ నా ఇష్టా యిష్టాలతో పనేవుంది?’’
‘‘అంటే నాతో పెళ్లి నీకిష్టం లేదా?!’’
‘‘వయసొచ్చాక ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోవాలిగా! మా అమ్మకు మీరు నచ్చారు. అందుకే నాకు మొగుడయ్యారు. మీరెలా ఉంటే నాకిష్టమో నన్ను చెప్పమనడం కాదు. అది మీ అంతట మీరే తెల్సుకోవాల్సిన విషయం.’’
‘‘సరే.. పోనీ నువ్వెలా ఉంటే నాకిష్టమో చెప్పనా?’’
‘‘మీకు చెప్పాలనిపిస్తే చెప్పుకోండి. కానీ మీకిష్టమని నా ఇష్టాన్ని చంపుకోమంటే మాత్రం కుదరదు.’’
‘‘నా ఇష్టాలు నీక్కూడా ఇష్టమనిపిస్తేనే పాటించుదువుగానిలే! సరే.. ఇంతకూ నువ్వెలా ఉంటే నాకిష్టమో చెప్పనే లేదు కదూ? రోజూ ఉదయానే్న నాకంటే ముందుగా నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజ ముగించుకుని పొగలు కక్కుతూ ఘుమఘుమలాడే కాఫీ తప్పుతో నన్ను నిద్రలేపాలి.
తర్వాత నాకు బ్రష్‌మీద పేస్టు వేసి అందించాలి. స్నానం చేసేటపుడు నా ఒళ్లు రుద్దాలి. స్నానమయ్యాక ఒళ్లు తుడవాలి. నేనే దుస్తుల్లో బావుంటానో తెలుసుకుని ప్రతిరోజూ బట్టల్ని సిద్ధంగా ఉంచాలి. నేను బయటకు వెళ్లిన ప్రతిసారీ నాకు ఎదురురావాలి.
నేనెప్పుడెప్పుడు ఇంటికొస్తానా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడాలి. తిరిగి నేను బయటినుంచి వచ్చేసరికి మళ్లీ నవ్వుతూ నాకు ఎదురురావాలి. నా ఆఫీసు విషయాలు అడిగి తెలుసుకోవాలి. నాకేమైనా సమస్యలొస్తే తగిన సలహాలివ్వాలి. రుచికరంగా వంట చేసి పెట్టాలి.
నేను దుఃఖంలో ఉంటే అనునయంగా ఓదార్చాలి. తెలియక నేనేవైనా పొరపాట్లు చేస్తే వాటిని తేలిగ్గా తీసుకుని మర్చిపోవాలి. మనకంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతున్న వారిపట్ల కరుణ చూపించి వీలైనంత ఉపకారం చేయాలి. నా జీతాన్ని పొదుపుగా వాడాలి. మన స్థాయికి మించిన కోరికల్ని మనసులోని రాకుండా చూసుకోవాలి.
ఇరుగు పొరుగువారితో ప్రతిదానికీ పోల్చి చూసుకోకూడదు. ఇంటికి అతిథులొస్తే సాదరంగా ఆహ్వానించాలి. బంధువులో, స్నేహితులో మన సహాయం కోరి వస్తే మనకు వీలైనంతలో సాయపడాలి. మీ అమ్మా నాన్నల్ని, తోబుట్టువుల్నీ ప్రేమించినట్టుగానే మా అమ్మా నాన్నల్నీ నా తోడబుట్టిన వాళ్ళనూ ఇష్టపడాలి.
చిన్న చిన్న విషయాలకు చికాకుపడకుండా సంయమనంతో ఆలోచించి ప్రశాంతగా ఉండాలి. ఇహ పడక గదిలో నిన్నటిలా కాకుండా ప్రతిసారీ ఎన్నడూ మరచిపోలేనంతగా ఎప్పటికప్పుడే కొత్తగా వుండాలి. మధ్యలో తను మాట్లాడటం ఆపుచేస్తే తన ఇష్టాన్నిటినీ చెప్పే అవకాశం ఎక్కడ తప్పిపోతుందోనని గబగబా వాక్యానికీ, వాక్యానికీ మధ్య ఏ మాత్రమూ ఎడం ఇవ్వకుండా చెప్పాల్సిందంతా చెప్పేశాడు సామ్రాట్.
సామ్రాట్ మాట్లాడటం ఆపు చేశాక అంది సామ్రాజ్ఞి. ‘‘మీ కోరికల జాబితా మరీ ఇంత చిన్నదా? నేనింకా ఎప్పటికీ ముగియని డైలీ సీరియల్‌లా తెల్లారేవరకూ చెప్తారేమో అనుకున్నాను’’.
దెబ్బతిన్నట్టుగా చూశాడు సామ్రాట్.
‘‘ ‘వంచిన తల ఎత్తకుండా తన పని తాను చేసుకునే సామ్రాట్ లాంటి అబ్బాయి నీ భర్త కావడం ఎంతో అదృష్టం తల్లీ’ అంది మా అమ్మ. కాబోలనుకున్నాను నేను. ఎంత తెలివి తక్కువ దాన్నీ!’’
నేను కోరిన వాటిలో నువ్వంత బాధపడాల్సినవేమున్నాయి సామూ? ఇవన్నీ అందరు భార్యలూ తమ భర్తలకు చేసేవే కదా?’’
‘‘ఎవరి సంగతో నాకెందుకూ? మీరాడించినట్టల్లా ఆడ్డానికీ, మీరు కోరినవన్నీ యంత్రంలా చేయడానికీ నేనేమీ మరమనిషిని కాదు. నా నుంచి ఏవైనా ఆశించేముందు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ట్యూబ్‌లైట్ స్విచ్ నొక్కి ఇహ మంచమెక్కండి’’ అంది సామ్రాజ్ఞి రా రాత్రి సంభాషణకు తెరదించుతూ.
***
మూడో రాత్రి టాపిక్ మార్చి అన్నాడు సామ్రాట్. ‘‘నీకు కథలు చదవడమంటే ఇష్టమేనా సామూ?’’
‘‘ఏదో చదువుతానె్లండి’’ అంది సామ్రాజ్ఞి నిరాసక్తంగా.
సామ్రాట్ కళ్ళలోకి వెలుగొచ్చింది ఊహించని ఆ సమాధానంతో. ‘‘నిజంగా..! నాకెంతో సంతోషంగా ఉంది. ఏయే పుస్తకాలు చదువుతావు?’’ ఆసక్తిగా అడిగాడు సామ్రాట్.
‘‘ఏవిటీ అంతలా పొంగిపోతున్నారూ.. కొంపదీసి కథలో, కావ్యాలో రాసే పాడు అలవాట్లేమీ మీకు లేవు కదా!’
తన ఆనందం క్షణకాలమైనా నిలబడకపోవడంతో హతాశుడయ్యాడు సామ్రాట్. ‘‘అదేవిటి సామూ. రచనలు చేయడం పాడు అలవాటు ఎందుకవుతుందీ?’’
‘‘మరీ! పాడు అలవాటు కాక.. పనీ పాటా లేని వాళ్లు తమకే తెలియని అవాకులూ, చెవాకులూ కలగలిపి కథలుగానో, నవలలుగానో రాస్తే అదంతా నిజమని పొంగిపోతూ చదవాలా?
ఇంకా చెప్పాలంటే మనసులోని మాటల్ని సూటిగా ఎదుటివారితో చెప్పలేని చేతకానివాళ్లూ, పిరికివాళ్లూ ఏవేవో కలలు కంటూ కాగితాలు ఖరాబు చేస్తే వాళ్లకంటే కొంచెం తెలివైన వాళ్లు వాటిని ప్రచురిస్తే మాలాంటివాళ్లం అవి చదివి మా జన్మలేవో తరించినట్లుగా భావిస్తామని మీలాంటివాళ్లు పొరపాటున కూడా పొరబడకండి’’ అంది సామ్రాజ్ఞి.
కనీసం ఒక్క విషయంలోనైనా తమ మధ్య సారూప్యం ఉంటే క్రమేణా ఆమె మనసు గెలుచుకోవచ్చనీ ఆశపడిన సామ్రాట్ చాలా నిరాశ చెందాడు ఆమె మాటలకు. అయినప్పటికీ ఆశ చావక, ‘‘పోనీలే ఎవరి అభిప్రాయాలు వారివి. ఇంతకూ నువ్వు అప్పుడప్పుడూ చదివే పుస్తకాలేమిటో తెల్సుకోవచ్చా?’’ అన్నాడు.
‘‘ఏమో ఎవరికి గుర్తు? మా ఇంటికొచ్చే చుట్టపక్కాలు అప్పుడప్పుడూ మా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయే పుస్తకాలేవో చదివి ఉంటాను. ఏ పుస్తకంలోనైనా బొమ్మలు చూస్తానంతే!
మహా అయితే ఆ బొమ్మల క్రింద రాసి వుండే నాలుగైదు మాటలు చదువుతానేమో! అయినా మనకు తెలియనివి ఏముంటాయి. ఏ పుస్తకంలో అయినా! పుస్తకాలు రాసేవాళ్లు మనలాంటి మనుషులే గానీ పైనుంచి దిగొచ్చిన దేవుళ్లో, దేవతలో కాదుగా!’’ అంది సామ్రాజ్ఞి వెటకారంగా పెదవి విరుస్తూ.

-ఇంకా ఉంది

సీతాసత్య