డైలీ సీరియల్

దూతికా విజయం-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ద్వారం దగ్గిర్నుంచి రాణివాసం కొద్ది దూరాన ఉండటం మనకు మరో అనుకూలం! .. రాజుగారు రారని నిర్థారణ చేసుకొని నేను తమకు తెలియపరుస్తాను. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెపుతాను- మీరు సరాసరి రావొచ్చు-’’
వీరభద్రుడికి అంతా కళ్ళకు కట్టినట్లయింది. కత్తెర బోనులాంటి రాణివాసంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగిరావటమంటే గరళం మింగి హరించుకోవటం లాంటిది; శవం సజీవమవటంలాటిదేననే అభిప్రాయం ఏర్పడుతోంది.
ఐతే తాను పిరికిపడిపోవటాన్ని సరస్వతి గ్రహించటం ఇష్టంలేదు. మగవాణ్ని చూసి ఆడది నవ్వటం, అవమానించడమే కదా! అందుకని తనను తాను సంభాళించుకుంటూ, అన్ని అనుమానాలూ తీర్చుకున్నాక సంతాన గోపాలుని ఆజ్ఞ కన్న తన ప్రాణమే గొప్పది కనుక, రుూ ఆహ్వానాన్ని తిరస్కరించవచ్చని నిర్ణయించుకున్నాడు.
‘‘ఒక్క సందేహం’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘రుూ దక్షిణ ద్వారం దగ్గిర ఒక్కడేనా కాపలావాడు?’’
‘‘ఔను’’
‘‘వాడి దగ్గర ఆయుధాలేమీ ఉండవా?’’
సరస్వతి పెదవులమీద చిరునవ్వు నాట్యమాడింది.
‘‘ఆయుధాలు లేకుండా రాజప్రసాదాన్ని పహారా కాస్తారా? ద్వారపాలకుడు బలహీను డు కాదు. యోధుడు. శస్త్రాస్త్రాలను చాకచక్యంగా ప్రయోగించగల చతురుడు. చేతిలో వాడి అయిన బల్లెం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బొడ్డున బాకూ, పక్కనే వేలాడే వరలో పదునైన కత్తీ ఉంటవి. ఆగంతకుడు ఎలాంటివాడో, ఎంత బలశాలో ఏయే ఆయుధాలతో వస్తాడో, ఎప్పుడు ఎదురౌతాడో తెలియదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తమై ఉంటాడు!’’
‘‘వాడే ఎదురుతిరుగుతే?’’ లాలాజలాన్ని ఒక్క గుటక వేశాడు వీరభద్రుడు.
‘‘సింహం లాంటిదాన్ని మానవుడు మచ్చిక చేసుకుంటున్నాడు కదా! అన్ని బలహీనతలు వున్న మానవుణ్ణి మచ్చిక చేసుకోలేమా? సువర్ణమే చాలు వాణ్ణి కట్టిపారేసి మనకు అనుకూలంగా తిప్పుకునేందుకు!’’
తాను లొంగిపోతున్నట్టే ఇతర్లు కూడాను! ఇన్ని బలహీనతలవల్ల మానవుడు ఎటైనా తేలిగ్గా తిరిగేందుకు వీలుగా అమర్చబడిన జీవి అవుతూన్నాడు. స్వార్థమనేది నీడవలె వెంటాడుతూండగా తన స్వార్థాన్ని సాధించుకుంటూనే పరమార్థాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది.
కేవలం తాన్కొడికే మేలు జరిగేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మేడ కట్టుకునేవాడు తానూ తన కుటుంబీకులు హాయిగా సకల భోగాలనూ అనుభవించేందుకే సుందర హర్మ్యాన్ని నిర్మించుకుంటాడు. ఐతే మేడ నీడలో అనేకమంది పాంధులూ, అలగాజనమూ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నది. యజమాని ఉద్దేశ్యం ఇతరులకు ఒక సౌకర్యాన్ని కల్పిద్దామని కానే కాదు. కాని మేడ నీడ పడకుండా చేయగలగటం వాడబ్బ తరం కాదు. కనుక, ఆ సానుకూలం ఇతరులది!
ఈ విధంగా కల్తీలేని స్వార్థం లేనే లేదు. తాను ఆశించిన రుూ అర్థకామాలు తాను సాధించటంతోపాటు, రాణి కోర్కె తీరి సంతానవతి అవుతోంది. దూతికా వృత్తిలో చాకచక్యాన్ని చూపుతూ, ప్రాణాంతకమైన రుూ కార్య నిర్వహణను సరస్వతి స్వీకరించిందంటే ఇందువల్ల రాణికి మరింత సన్నిహితమవుతూ, ఆమె దయకు పాత్రురాలవుతోంది. అంతకన్నా రాణే సరస్వతికి లొంగిపడి ఉండటం జరుగుతుందనటం సమంజసం! ఇక కాపలావాడికి ముట్టే లంచంతో వాడు లాభిస్తున్నాడు. ఇష్టమున్నా లేకున్నా రుూ కూటమి కలిసికట్టుగా ఒక్కటై కార్యసాధనకు పూనుకోగలుగుతుంది.
ఈ తర్కాన్ని అనుసరించి కాపలాడి బెడద అంతగా ఉండకుండటం సంభవమే. ఐతే విజ్ఞుడు కీడెంచి మేలెంచాలి కనుక, పరిస్థితులు విషమిస్తే ఏం చేయాలో ఇప్పుడే సిద్ధాంతరీత్యాన్నా తేల్చుకోకపోవటం, గృహదహనవౌతూంటే బావి తవ్వే ప్రయత్నాలు చేయటం లాంటిదవుతుంది కదా!
‘‘అధవా తారుమారైతే?’’ అన్నాడు వీరభద్రుడు ఆ దృశ్యాన్ని తలుచుకునేందుకే కుంగిపోతూ.
సరస్వతి నవ్వింది.
‘‘ఏవౌతుందో మీక్కూడా తెలిసే అడుగుతున్నారు. ఐనా నా విధి కనుక చెపుతూన్నాను. ఈ విషయాలన్నీ ముందే తెలుసుకొని తగిన ప్రక్రియలను ఇప్పుడే ఆలోచించి ఉంటే విషమ పరిస్థితుల్లో ఎటూ తోచక తొందరపడి ఎదురైన ప్రమాదాన్ని మరింత గొప్ప ప్రమాదంగా రూపొందించుకోవటం తప్పవచ్చు. అందునా జీవన్మరణంలాటిదాన్ని గూర్చి ముందుగానే విపులంగా పథకం వేసుకోవలసిన అవసరం అందరికీ వున్నది. మీ అసలు ప్రశ్నకు జవాబిది: కాపలావాడే కనుక ఎదురుతిరిగితే ముందుగా మీ మీదికి ఉరికి ఎదుర్కొంటాడు!’’
వీరభద్రునికి కంపరం పుట్టింది.
‘‘మీరు వాణ్ణి ఎదుర్కోవాలి. ఎలాగో వాణ్ణి మట్టుపెట్టి మీ ప్రాణాలను కాపాడుకొని, మా ప్రాణాలనూ, మానాలనూ కూడా కాపాడవలసి ఉంటుంది!’’
‘‘సాధ్యమా!’’ అని సరస్వతికి వినిపించేట్లే గొణుక్కున్నాడు వీరభద్రుడు.
‘‘బలప్రదర్శనలో దేశంలోకల్లా ప్రథములని ఇన్ని బహుమతుల్ని పొందిన మీలాంటి వీర, బల, తేజో సంపన్నులకు ఒక్కడితో పోరాడటం సాధ్యంకాదని ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కావటంలేదు. ఉక్కు కడ్డీలనే వంచగలిగిన కండబలం, తిలల నుంచి తైలాన్ని పిండగల బాహుబలం తోడు నీడగా మీ వెంటనంటి ఉండగా, ప్రాణాపాయ స్థితిలో కూడా అవి మిమ్మును విడనాడుతాయని ఎందుకు అనుకుంటున్నారు?’’
‘‘కాపలావాడు బల్లాన్ని నా చేతికిచ్చి వొంచమంటే వొంచటమే కాదు విరిచి అవతల పారేస్తాను. ఖడ్గాన్నిచ్చినా తునాతునకలు చేస్తాను. కాని బల్లాన్ని వాడు నా పొట్టకు గురిచూసి బలంగా గుచ్చితే అది దిగబడకుండా ఉంటుందా? వీపులోనుంచి దూసుకొని ముందుకు రాకుండా ఆగుతుందా? ఉక్కు కడ్డీలను వొంచే నా శరీరం ఉక్కుతో చేయబడలేదే!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘స్ర్తిలమైన మాకున్న పాటి ధైర్యసాహసాలు కూడా మీకు లేవా?’’ అన్నది సరస్వతి
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు