డైలీ సీరియల్

దూతికా విజయం-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రుని మూతిమీద మీసం పౌరుషాన్ని ప్రదర్శించకపోతుందా అని.
‘‘మీరు స్ర్తిలవటమే మీ సౌకర్యం. ఆడది చెప్పే అబద్ధం గోడవలె ఉంటుంది. మగాడు చెప్పే అబద్ధం తెరలాటిది. అదీగాక అది మీ మందిరం. మీకు స్థానబలిమి హెచ్చు. ఎటొచ్చీ నేనే కదా పరాయివాణ్ణి! నేనే కదా అన్ని నీతి నియమాలూ, చట్టాలు అతిక్రమించిన నేరస్థుణ్ణి! నేను ఎదుర్కోవలసింది ఒక్కడ్నే ఐనా వాడికా స్థానంలో ఎంతో అధికారం వున్నది. కల్మషాత్మతో నిర్వీర్యుణ్ణయి ఉన్న నేను వాడితో పోట్లాడటం, అధవా పోరాడినా గెలవడం అసంభవం- కాదా?’’
‘‘మేము మాత్రం కోరి అలాటి విషమ పరిస్థితి రానిస్తామా? మాకు ఎంత ధైర్యం లేకుంటే రుూ సాహసానికి పూనుకుంటామో కాస్త ఆలోచించండి. విధి బలీయమై ఎటూ మరి దారిలేక పరాజయమే ప్రాప్తమయ్యే పక్షంలో మీతోపాటుగానే మా కంఠాలక్కూడా యముడు కాలపాశాన్ని చుట్టక మానడు! గత్యంతరం లేక ఆ విధంగానే జరిగితే నలుగురితో చావు పెళ్ళిలాంటిదని సరిపెట్టుకోవలసి వుంటుంది’’
‘‘నలుగురెక్కడ? నీవూ, రాణీ, నేనూ- ముగ్గురమేగా!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘ద్వారపాలకుడు తప్పించుకోగలడనుకుంటున్నారా? రుూ ఎదుర్కోవటమూ, పోరాటమూ అంతా కోట లోపలే జరుగుతుంది. కానీ వెలుపల కాదు కదా! అసలు ఆ తాటి చెట్టంత ఎత్తువున్న ప్రహరీ దాటి మీరు లోనికి ఎలా రాగలిగారో రాజు విచారించరా? మన రాజుగారు ధర్మపాలురు- ధర్మశీలురూనూ! అదీగాక ఇంత దూరం వచ్చాక, వాడి ప్రాణాలను మేము కాపాడుతామని మీరు అపోహపడనక్కర్లేదు. నాకూ రాణికీ ఎలాగు మరణదండన తప్పదు కనుక, దీనికి కారణం ఆ కాపలావాడే కనుక, వాడు తప్పించుకోకుండా చూసి మా కసి తీర్చుకోవటమేగాక, మీ ఆత్మకు శాంతి చేకూర్చమా!’’ అన్నది సరస్వతి.
శరీరానికి లేని శాంతి ఈ బోడి ఆత్మకు - అందునా అది అనంత విశ్వంలో కలిసిపోయాక లభిస్తుందంటే ఎవడిక్కావాలి? వింటుంటేనే ఇంత భయంకరంగా ఉంటూ వాడి మొన గలిగిన బల్లెపు కొన తన పొట్టలోంచి దూసుకొనిపోవటం, పిచికారీలోంచి చిమ్మే ఆ ఎర్రని రక్తానికి తను కళ్ళుతిరిగి, విరుచుకొనిపడటం మొదలైనవి ఊహించుకుంటేనే ఇంత భయంకరంగా ఉంటే, నిజం జరగటమంటే తాను భరించి, బతికి, బైటపడి బట్టకట్టగలడా?
‘‘మా రాణీ ఆకాశదీపం. మీబోటి సామాన్యులు ఆమెను అందుకోగలగటం స్వప్నంలో సాధ్యమని నేను అనుకోను. ఐతే ఆకాశ దీపమే మీ అదృష్టదేవత తరమగా, తమను ఆహ్వానించింది. ఆ దీపాన్ని తాము అందుకునేందుకు వీలుగా ఒక పెద్ద నిచ్చెన వేసి, కింద నేనూ, ద్వారపాలకుడూ అది బెసగకుండా తొక్కిపట్టి ఉంచాము. మీరు మెట్టు మెట్టుగా ఎగబాకుతూ వెళ్లాలి. మీరు భయపడి కాలు జారితే ఆకాశదీపం నేల రాలి, తునాతునకలలవుతుంది. మీరు సరాసరి ఆ ఎత్తు నుంచి మా మీద పడతారు కనుక, మీతోపాటు మేము కూడా ముక్కలు ముక్కలవుతాము. మన మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని అనుసరించి ఒకరి కీడు అందరికీ సంబంధించినదిగానూ, అదేవిధంగా ఒకరి మేలు నలుగురికీ చెందేదిగానూ ఉంటూన్నది!’’ సరస్వతి తన మాటల ప్రభావం వీరభద్రునిలో ఎలా ప్రతిఫలిస్తున్నదో గమనించింది.
వీరభద్రుని ముఖ కవళికను అనుసరించి అతను జారిపోతున్నాడని సరస్వతి గ్రహించింది. ఎలాగైనా అతనికి నచ్చచెప్పవలసిన దూతికా చాతుర్యాన్ని ప్రర్శించటం తన విధిగా భావించి అన్నది:
‘‘ఇదంతా ముందుగానే చెపుతున్నానంటే పరిస్థితుల్ని ముందుగానే ఆకళింపు జేసుకొని, తదనుగుణంగా సర్వసన్నద్ధులుగా ఉంటారనే కాని తమను భయపెట్టేందుకు కాదు. పోతే మీకు ఎంత బలసంపన్నతా, తెలివితేటలూ, విజ్ఞానమూ ఉన్నప్పటికీ ఆ విధి కూడా సహకరించాలి. మీ ప్రయత్నం లేకుండా విధి మీ జోలికిరాదు. ‘్ధర్యే సాహసే లక్ష్మి’ అన్న సామెతకు తోడుగా రుూ సందర్భంలో ‘రతీ’ అని కూడా జేర్చుకోండి’’.
వీరభద్రుడు ‘రతీ’పదం వినగానే చలించినట్లు తోచింది సరస్వతికి- కనుక ఆ ‘రతి’నే విపులంగా విశదీకరిస్తే గురిచూసి విడిచిన వాడిబాణం వలె తగలక తప్పదనే నిర్ణయానకి వచ్చిందామె.
‘‘మా రాణి అందచందాలు వర్ణించే పాటి భాషాజ్ఞానం నిజంగా నాకు లేదు. మానవులమైన మనమెవ్వరమూ రతీదేవినైతే చూడలేదు కాని, మా రాణిని చూసినవారు మాత్రం రతీదేవి ఇంతకన్నా సౌందర్యవతి అంటే నమ్మలేరు. ఆమె కన్నార్పక, కదలక మెదలకున్నట్లయితే మహాశిల్పి రూపొందించిన పాలరాతి విగ్రహమే అనుకోక తప్పదు. ఆమెను స్నానం చేయిచేటప్పుడు సాటి స్ర్తిని నాకే మోహావేశం కలుగుతుందంటే నమ్మండి. ‘నేనే పురుషుణ్నయితేనా?’ అని రాణితో అంటే ఆమె నవ్వి ‘నిజానికి నాకు అంతకన్నా కావలసిందేముందే సరూ! అయితే నీవు పురుషుడివి అయితే రాణివాసంలోకి ప్రవేశించడం మాట అటుంచి, నన్ను కనె్నత్తయినా చూసే అవకాశం ఉండేదా?’ అంటుంది. నిగనిగలాడే నున్నని ఆమె నగ్న శరీరంలో ఎదుటి వ్యక్తి నిలువుటద్దంలో వలె తన పరిపూర్ణ ఛాయను చూసుకోవచ్చు. యవ్వనంతో మిలమిలా మెరిసిపోయే ఆమె పొందును స్వప్నానుభూతిగా పొందినా ఎంతో అదృష్టం పట్టినట్లే!’’’
‘‘ఆమె సౌందర్యాన్ని చూసి స్పర్శించిన నీ అదృష్టానికి ఈర్ష్యజెందుతున్నాను’’ అన్నాడు వీరభద్రుడు లోలోన లొట్టలువేస్తూ.
‘‘నాది అదృష్టం ఎలా అవుతుంది? నాకన్న రాణి ఉపయోగించే నలుగుపిండిది గొప్ప అదృష్టమంటాను. ఎందుకంటే ఆ పిండి రాణి శరీరంలోని అన్ని భాగాల్లోనూ వొత్తి వొత్తి రాసుకుని, లాగే కాసేపు ఆమె దేహానికి అతక్కుపోగలదు కదా!! గనిలోంచి రత్నాన్ని బైటికి తీసినవాడిదా అదృష్టం, దాన్ని ధరించేవారిదా? నాదీ ఆ నలుగుపిండిది మొదటి తెగకు సంబంధించిన అదృష్టం. మీలాంటివారిది ఆమెను అనుభవించే అదృష్టం!’’
‘‘కాని రాణితోడి అనుభవం నిప్పుతో చెలగాటమే కదా!’’’
‘‘నిజమే! మీరెంత అమాయకులు! రాణితోడి అనుభవానికి ఒక ప్రాణాన్ని పణంగా వొడ్డటం అధికమనుకుంటున్నారా?
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు