డైలీ సీరియల్

దూతికా విజయం-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకని అవేమీ ఉండేందుకు వీలుండదు.. ఏమైనా మీరు వేషం మార్చుకోక తప్పదు..’’
వీరభద్రుడికి అర్థమవలేదు. ‘‘అంటే?’’అన్నాడతను.
‘‘ప్రేక్షకుల ఎదుట మీరు బలప్రదర్శన యిచ్చేందుకు రావడం లేదనేది గుర్తుంచుకోండి. రాణివాసంలోకి వచ్చి రసమయి అయిన మా రాణి శృంగార కార్యకలాపాల నిమిత్తం ఆహ్వానించబడ్డారు కదా! పోతుటీగ కూడా రాణివాసంలోకి జొరబడేందుకు సాహసించదు. మీరీ పురుషాకృతిలో రావటం మీకూ, మాకూ కూడా గొప్ప ప్రమాదం!’’
‘‘ఆడ వేషంతో రావాలంటావా?’’
‘‘ఔను. ఎవరైనా చూసినా స్ర్తి అనుకుని మీ జోలికి రారు. మీ రహస్యం ముగ్గురికి రాణికి, నాకూ, కాపలాదారుడికి మాత్రమే తెలుసు. యాదృచ్ఛికంగా మరెవరి కంటనైనా పడినప్పటికీ రాణివాసపు దాసిగా భావించబడాలి. ప్రమాదాన్ని సూటిగా ఎదుర్కోకుండా, సాధ్యమైనంతవరకూ తప్పించుకునేందుకే రుూ ఏర్పాట్లన్నీ’’
సరస్వతి ఆలోచన చాలా తెలివిగానూ, సబబుగానూ ఉన్నట్లు తోచింది వీరభద్రునికి.
‘‘ఐతే ఇంటినుంచి బయలుదేరేముందే ఆడవేషం వేసుకోమంటావా?’’అని అడిగాడు వీరభద్రుడు.
‘‘వొద్దు. మిమ్ము స్ర్తిగా భావించి రాత్రి సమయంలో ఏ రసికుడన్నా మిమ్ము వెంటాడవచ్చు. లేదా రాజభటుల కంటపడితే ఒంటరిగా అర్ధరాత్రి సమయాన యువతి దొరకనే దొరికింది కదానని ఏ సందులోకో లాగి గుంపుగుంపూ వరుస తప్పకుండా అనుభవించాలని నిశ్చయించుకొని మీ రహస్యం బైటపడగానే తమకు కలిగిన నిరాశతో కండలుదేరిన మీ శరీరం మీద కొత్త పీఠభూములను సృష్టించి, రుూ దొంగ వేషం వేసేందుకు కారణం అడిగి, మీ జవాబు సరిగా లేనట్లయితే సరాసరి కారాగారానికి మోసుకొని వెళ్తారు!’’
ఈ పథకంలో ప్రతి స్వల్ప విషయాన్నీ సరస్వతి ఎంత చక్కగా ఆలోచించి తగిన కట్టుదిట్టాలతో బిగించి ఉంచిందో వీరభద్రునికి స్ఫటికమంత స్పష్టంగా తెలిసివస్తోంది.
‘‘మరి రుూ వేషం ఎక్కడ?’’
‘‘కోట దక్షిణ ద్వారం బైట... నేను నిర్ణయించి తమకు తెలియపరచిన సమయానికి అక్కడికి జేరితే అక్కడే వేషంలో మార్పుచేసి మిమ్ములోనికి తీసుకుని వెళ్తాను. మీరు పాదరక్షలు వేసుకొచ్చినప్పటికీ అవి కోట బైటనే ఉంచాలి. లోపలికి వచ్చేటప్పుడు అవి వుండరాదు-’’
‘‘ఏం? అసలే పొదలూ అవీ అంటున్నావు కటిక చీకట్లో నేలమీద ఏమున్నదో తెలియని అయోమయంలో కాళ్ళకు పాదరక్షలు కూడా లేనట్లయితే ఏ పామో కాలిమీద కాటేస్తే?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మానవుడు తనకన్నా విష పూరితుడనే విషయం పాముక్కూడా తెలుసు. అందుకనే మనిషి అలికిడి వినగానే అది సమీపంలో ఉన్న కన్నంలోకో లేదా ఏ పొదలోకో మాయమవుతుంది. దానికి హాని కలిగితేనే కాని అది మీ జోలికి రాదు. మామూలు పాములేవో ఉంటాయని మీరు భీతి చెందుతున్నారు.
మా ప్రాణానికి మాత్రం మీరు మహాసర్పాలు! ఎంతో జాగ్రత్తగా మిమ్ము రాణివాసానికి జేర్చి, ప్రణయ కలాప సుమాలతో మంగళ హారతి పాడి, తిరిగి కోట బైటకు జేర్చేవరకూ మా ప్రాణాలు గిలగిల్లాడుతూనే ఉంటాయి. మిమ్ము రాణివాసంలో దాయటం పక్కలో బల్లాన్ని పెట్టుకొని పడుకోవడం లాటిది.. ఇక పాదరక్షల విషయం- చర్మంతో తయారైన ఈ పాదరక్షలు వేసుకొని వస్తుంటే వాటి శబ్దం, మనను పట్టి ఇస్తుంది. అంతకన్న ఎంత మొద్దుగా మారిన పాదాలైనా మెత్తగా శబ్దంకాకుండా వుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో పరుగెత్తవలసి ఉంటే రుూ పాదరక్షలు గొప్ప ప్రతిబంధకాలు! అవి పాదాలను రక్షించినా, మిమ్మూ, మమ్మూ కూడా భక్షించేందుకు ప్రయత్నం చేయవచ్చు కనుక అవి నిషిద్ధం!’’ అన్నది సరస్వతి విపులీకరిస్తూ.
సరస్వతికి వున్నపాటి లోకజ్ఞానమూ, విజ్ఞతా, తెలివితేటలూ తనకు లేనందుకు వీరభద్రుడు కించపడ్డాడు. ఐతే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఆమె చాకచక్యంమీదనే కదా తన పంచ ప్రాణాలు ఆధారపడి ఉన్నవి!
గొప్ప సేనతో ముట్టడి చేసేటప్పుడు ఎనె్నన్ని సమస్యలూ, క్లిష్ట పరిస్థితులు ఏర్పడగలవో వాటన్నిటిని జాగ్రత్తగా తర్కించి, స్వల్పాతి స్వల్పమైన విషయాలను కూడా గణనకు తీసుకొని పథకం తయారుచేయందే విజయం లభించదు కనుక, నిజంగా యుద్ధరంగంలో పోరాడే సైనికుడు ఐనప్పటికీ సేనాపతి పథకమే ఆ విజయాన్ని సాధిస్తుంది. ఆ మాటకొస్తే ఇదీ రణరంగమే - కాముని కదనం కదా!
పరిస్థితుల్ని అనుసరించి మెలకువగా, తెలివిగా రొమ్మిచ్చి పోరాడేది తనే ఐనప్పటికీ, తనను నడిపించి, ప్రయోగించి, క్రీడా విశేషాల ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేసి, వేయి కన్నులతో పరాజయం దరిజేరకుండా కాపాడుతూ, బహుకొద్ది నష్టంతో తన చాకచక్యంతో విజయాన్ని సాధించే బాధ్యత రుూ సరస్వతిదే!
తాను రాణికి నాయకుడైతే, తనకీ సరస్వతి నాయకురాలు. ఆ మాటకొస్తే రాణికూడా నాయకురాలే! నటన సూత్రధారి అయిన ఈమె మాటలు పొల్లుపోకుండా అక్షరమక్షరమూ అనుసరించడంలోనే తన రక్షణా అభివృద్ధీ ఆధారపడి ఉండటం వల్ల ఆమె సలహాలు ఆజ్ఞలుగా భావించి తాను వాటిని శిరసావహించటమే మేలు మేలనే దృఢనిశ్చయం వీరభద్రునికి ఏర్పడింది.
సరస్వతి నిర్భయంగా తనను తేరిపార జూడటం వీరభద్రుడు గమనించాడు. తనలో కరుడుగట్టిన మూర్ఖత్వాన్ని ఆమె చూపులు చూస్తున్నవే మో?
సందేహ నివృత్తికోసం ‘‘ఏమిట లా చూస్తున్నావ్?’’ అన్నాడు వీరభద్రుడు.
సరస్వతి ముసిముసిగా నవ్వుతూ ‘‘ఏంలేదు. మీ ముఖంలో ఎంత ఆడంగితనం ఉన్నదో చూస్తున్నాను. ఆడవేషంలో మీరెంత ఒదుగుతారో అంచనా వేస్తున్నాను!’’ అన్నది.
సన్నని శీతల ప్రవాహమొకటి వెనె్నముకలోంచి దూసుకుపోయినట్లయింది వీరభద్రునికి. మగజన్మ ఎత్తి మగాడనించుకున్న తనలో ఆడ లక్షణాల్ని గమనించే ఆడదాని ఎదుట, ఎంత సిగ్గు ముంచెత్తేందుకు వీలున్నదో అర్థమయింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు