డైలీ సీరియల్

దూతికా విజయం-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు అనుకుంటున్నాను. మీలో కూడా విజ్ఞానభానుడు ఉదయించాడని!’’
‘‘దానికి కారణం నీవే! నీవు విజ్ఞానభానుడివి- నేను కరదీపికనై ఆ కాంతిలో కనిపిస్తున్నాను అంతే!’’అన్నాడు వీరభద్రుడు.
‘‘వృథాగా ప్రాణాలను బలిపెట్టకుండా జీవితానికి ఒక ఆశయాన్ని ఏర్పరచుకోవటమేగాక, దాన్ని సాధించేందుకు సకల సన్నాహాలతో ముందుకు సాగేందుకు నిర్ణయించిన మిమ్ము అభినందిస్తున్నాను!’’
వీరభద్రుడు మాట్లాడలేదు.
‘‘పై సంవత్సరంలో మీకన్న బలశాలి తయారైతే మిమ్మెవ్వరూ గమనించరు. లేదా ఏ కుస్తీలోనో పాల్గొంటే ప్రతిపక్షీయుడు వేసే మెరుపుదెబ్బ ఆయువుపట్టుకు తగిలితే ఆవలించకుండానే ఢామ్మని చావొచ్చు. లేదా ఏ శాశ్వత అంగవైకల్యమో సంప్రాప్తించవచ్చు. ఇక జీవితమంతా అడుక్కు తినవలసిందే! నిష్ప్రయోజనంగా జీవితాన్ని బలిపెట్టవలసిన అవసరం లేకుండా రుూ అదృష్టం యెదురైంది. పరమ మూర్ఖుడు మాత్రమే దీన్ని ఒదులుకుంటాడు. సరిగ్గా ఆలోచించి దీనికి అంగీకరించిన మీ మేధస్సును మెచ్చుకుంటున్నాను!’’ అన్నది సరస్వతి.
ఆ అదృష్టాన్నిగూర్చే వీరభద్రుడు ఆలోచిస్తున్నాడు.
సరస్వతి అన్నది:
‘‘ప్రపంచంలో ప్రతివారూ అదృష్టంకోసం నిర్విరామంగా అనే్వషిస్తూనే ఉంటారు. దాన్ని పట్టుకోవాలని ఊపిరందినంత వేగంగా నలుదిశలకూ పరుగెత్తుతూనే ఉంటాడు. ఐతే అది ఎక్కడున్నదో ఎవ్వరికీ తెలియదు. నిజంగా అదృష్టదేవతే వరించదలిస్తే నీవు ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా అదే పరుగుపరుగున వచ్చి లంకించుకుంటుంది. ఇప్పుడు మీపట్ల ఇది ప్రత్యక్షంగా రుజువైంది. కాస్తలో దాన్ని శాశ్వతంగా జారవిడుచుకునేవారు కదా!’’
‘‘నా కళ్ళు తెరిపించావు నీవు! అంతేకాదు ప్రతీదీ స్పష్టంగా చూసేందుకు తగినంత కాంతిని వెదజల్లావు. నీకు కృతజ్ఞత ఎలా తెలియజేయాలో అర్థంకావడం లేదు సరస్వతీ!’’అన్నాడు వీరభద్రుడు.
‘‘నాకు చూపదలచిన కృతజ్ఞతను మా రాణిపట్ల చూపండి చాలు!’’
‘‘ఈ సమావేశం యెప్పుడు జరుగుతుంది?’’
వీరభద్రునిలోని ఆతృత సరస్వతి ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింది.
‘‘సాధ్యమైనంత త్వరలో కృష్ణపక్షపు రోజులు ఆరంభమైనవి కదా! కాపలావాణ్ణికూడా ఆకట్టుకున్నాను. మీ అంగీకారమూ ఐనది. రంగస్థలాలంకరణలు పూర్తిచేసి పాత్రలను ప్రవేశపెట్టటమే తరువాయి. త్వరలోనే నేను వచ్చి కలుస్తాను...’’
‘‘విజయానికి సారథివి నీవు!’’
‘‘నన్ను స్తుతించకండి. మరో మాట. ఈసారి ఈ సింహద్వారం నుంచి ప్రవేశించను. దొడ్డిదోవలో వస్తాను. ఏ రాత్రికి సమాగమం నిర్ణయించబడుతుందో ఆ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందుగానే వచ్చి చెప్పివెళ్తాను. కనుక మీరు ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందునుంచి దొడ్డితలుపు దగ్గరవేసి ఉంచటమేగాక, ఏకాంతంగా ఇంట్లోనే ఉండాలి. వీలు చూసుకొని వస్తాను-’’
వీరభద్రుడు తల వూపాడు.
సరస్వతి చెప్పసాగింది:
‘మరో ముఖ్య విషయం. సమావేశం ఏర్పాటైనప్పటికీ మీరు వచ్చే సమయానికి ఆకాశం మేఘావృతమై వున్నా లేక వానపడుతున్నా రానవసరంలేదు. ఎందుకంటే ఉరుములూ, మెరుపులూ అంటే మా రాణికి మహాభయం. అలాంటి వాతావరణ సూచనలు కనిపించగానే రాజుగారు ఆమె మందిరంలో పడుకుంటారు. అదీకాక వాన కురుస్తుంటే నేను దక్షిణద్వారం దాకా రావటమంటే తడవక తప్పదు. వొచ్చేది మిమ్ము వెళ్లిపొమ్మని చెప్పటానికే కదా! ఎవరైనా చూస్తే అనుమానపడతారు. మామూలు రోజుల్లో అయితే వాహ్యాళికి వచ్చానని చెప్పి తప్పించుకోవచ్చు. వానలో వాహ్యాళి అంటే ఎవరూ నమ్మేమాట కాదు.. అన్నిటికన్నా ముఖ్యం, ఆకాశంలో మెరిసే ప్రతి మెరుపూ మన ఉనికిని బహిరంగ పరుస్తూనే వుంటుంది. అవి మన చెప్పు చేతల్లో ఉండవు కదా!.. అందుకని మీరలాంటి సమయాల్లో రారాదు. అంతేకాదు- మరే అసందర్భమైనా ఐతే నేను దక్షిణ ద్వారం దగ్గరికే రాను. మీరు కాస్సేపు ఎదురుచూసి తిరిగి వెళ్లిపోండి. ఎందుకు రాలేకపోయానో మర్నాడు విన్నవించుకుంటాను!’’ అన్నది సరస్వతి.
వీరభద్రుడు తన సమ్మతిని సూచించి అన్నాడు.
‘‘నీ రాకకై ఎదురుచూస్తుంటాను!’’
వీరభద్రుని వ్యవహారం పాకంలో పడిందని సరస్వతి పసిగట్టింది. తన విశ్వప్రయత్నాలు వృథా కానందుకు ఆమె సంతోషించింది. తన సమర్థతకూ, తెలివితేటలకూ ఎంతో గర్వం కలిగి ఆమె శరీరం పులకరించింది. ఇకముందు జరగవలసిన కథ కూడా విజయవంతవౌతుందనే గట్టి నమ్మకం ఆమెలో పాతుకొని పోయింది.
‘‘్ధర్యంగా ఉండండి. కీడు శంకించే ఆలోచనల్ని పారద్రోలండి. ఆ స్వర్గ సౌఖ్యాలను గూర్చి ఆలోచిస్తూంటే మనసు ఎటుపడితే అటు తిరిగే బలహీనతను కోల్పోయి- దృఢంగా శిలా శాసనంవలె నిలబడి ఉంటుంది. తెల్లవారుతోంది.. వస్తాను - మరి శెలవు!’’ అని సరస్వతి లేచి నిలబడింది.
వీరభద్రుడు ఆమెను దొడ్డిగుమ్మందాకా సాగనంపాడు. వెళ్తూ ఆమె నమస్కరిస్తే, ప్రతి నమస్కారం చేసి తేలికైన మనస్సుతో ఇంటిలోకి వెళ్లాడు.
***
అర్ధరాత్రి. చీకటి, గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కానరావటంలేదు.
రెండు ఆకారాలు కోట దక్షిణ భాగం వెలుపల కలుసుకున్నవి. ముందు స్ర్తి, వెనుక యువకుడు- కొద్దిదూరం నడిచారు. స్ర్తి యువకుని చేయి పట్టుకుని నడిపిస్తోంది.
ఒకచోట ఆగి, పక్కనే వున్న దుబ్బుల్లోంచి ఒక చిన్న మూట తీసి రహస్యంగా ‘‘కానీండి.. ఆ దుస్తులు విప్పి ఈ చీరా అదీ కట్టండి’’ అన్నది స్ర్తి.
‘‘నాకు చేత కాదే’’ అన్నాడు పురుషుడు.
‘‘ఆ మగ దుస్తులు తీసేయండి. నేను కడతాను. ఏం చేస్తాం?’’

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు