డైలీ సీరియల్

వందే శంభుముమాపతిం! ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం కీర్తించేది నిజానికి ఆ అద్వయ పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడినే!
‘‘ఓంకార సూచితం దేవం, సర్వజ్ఞం సర్వ సాక్షిణం
అద్వయం పరమం వందే, పరబ్రహ్మాణ మీశ్వరం’’ అని పరబ్రహ్మ పంచరత్న మాలికలో కీర్తింపబడిన ఆ పరమేశ్వరుడే
‘‘ఓం నమశ్శివాయ గురవే, సచ్చిదానంద మూర్తయే
నిష్ప్రపంచాయ శాంతాయ, నిరాలంబాయ తేజసే’’
అంటూ తన దక్షిణామూర్తి స్వరూపాన మహాయోగుల చేత వినుతింపబడ్డాడు. ‘యజుర్వేదం’ శిరస్సుగా, ‘రుద్రము’ తన ముఖముగా, పంచాక్షరీ మంత్రం తన జ్ఞాననేత్రముగా ప్రకాశించే ఆ పరమేశ్వరుని పరతత్వము పూర్తిగా అవగాహన చేసుకోవటము ఆయనకి తప్ప మరెవరికీ సాధ్యం కాదు.
శివ తత్వము
‘శివతత్వము’ అనే పదంలో శివుని తత్వమే కాక శివ చరితమూ, భక్త రక్షణానుగ్రహాల కోసం ఆయన చేసిన అసుర సంహార మూ, అన్నీ ఇమిడి ఉన్నాయి. నిర్గుణుడూ, నిరాకారుడూ అయిన ఆ పరబ్రహ్మ సృష్టి కార్యం తలపెట్టటమే ఆయన అద్భుత లీలా విన్యాసం.
అందుకు పర్యవసానంగా ఆ చిత్ ప్రకాశం నుండి ఆది దంపతులైన పరమేశ్వరీ, పరమేశ్వరులనే రెండు రూపాలుద్భవించి, ఆ పరబ్రహ్మ లీలా సృష్టిగా సర్వోత్కృష్టము అయిన ‘మణి ద్వీపం’లో వెలిసాయి. మణిద్వీపం అన్ని లోకాలకీ పైనున్న సర్వోత్కృష్టమైన రక్షాలోకం కనుక అది ‘సర్వలోకం’గా వ్యవహరించ బడుతోంది. ఆ సర్వలోకంలోని పరమేశ్వర స్వరూపం నుండి ఆయన తన అంశలుగా మహేశ్వర, సదాశివ, ఈశ్వర రుద్రాంశలని సంభవింపజేశాడు.
తన వామభాగాన ఉపస్థిత అయి ఉన్న తన సహధర్మ చారిణి అయిన పరమేశ్వరి చేత ప్రకృతి రూపిణిగా అనంత కోటి బ్రహ్మాం డాలుగా విశ్వ సృష్టి చేయించటమూ, అం తా కూడా ఆ సర్వేశ్వ రుని లీలావినోదమే!
ఒక ప్రక్క బ్రహ్మాండాలలోని అనేకానేక లోకాలను సాక్షీ భూతుడిగా మాత్రమే వీక్షిస్తూ నిర్గుణ తత్వుడై భాసిల్లుతూనే, తన లీలలో భాగంగా మరో ప్రక్క తన సగుణ తత్వానికి ప్రతీకలైన బ్రహ్మ విష్ణు రుద్రుల చేత ప్రతి బ్రహ్మాండాలైనా ‘సృష్టి స్థితి లయా’ కార్యక్రమాలు జరిపింపజేయటం ఆ పరమేశ్వరుడి కొక్కడికే సాధ్యమయే పని.
ఈ విశ్వమంతా ఆయన లింగాకారమే! ఏకాక్షరీ మంత్రమయిన ప్రణవ మంత్రం ఆ లింగరూపంలో నుండి ఆవిర్భవించినదే! ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం కల ఆయన తత్వం అనిర్వచనీయమూ, అద్వితీయమూ కూడా! అటువంటి ఆయన తత్వాన్ని ఆయన తనంతట తానై వివరిస్తే తప్ప మరో విధంగా ఎవరు తెలుసుకోగలరు?!
ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా, ఏడు సంహితలుగా రచింపబడిన అద్వితీయమూ, అపూర్వమూ అయిన వ్యాస విరచిత శివపురాణంలోని సారాంశం ఏ కాస్త అవగతం చేసుకున్నా చాలు మన జన్మ జన్మల పాపాలూ, భవబంధాలూ తొలగిపోయి మనం కైవల్య పదంలోనికి ప్రవేశిస్తామనటంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఇందులో పరమేశ్వర చరితామృతమే కాక ఆయన శక్తి అయిన దేవీ పరమేశ్వరీ మహిమలైన మహిషాసుర, దుర్గమా సుర, శుంభ నిశుంభుల వదలను కూడా వ్యాస భగవానులు ప్రస్తావించారు.
పరమేశ్వరీ, పరమేశ్వరులు ఆ పరబ్రహ్మానికి రెండు రూపాలు అన్న విషయాన్ని స్పష్టీకరిం చటమే ఇందులోని ముఖ్యోద్దేశ్యం.
ఆలస్యం ఎందుకు?! మరిక ‘శివ గాధాలహరి’లో ఓలలాడి తరిద్దాం.

‘‘వందే శంభుముమాపతిం
సురగురుం వందే జగత్క్రారణం
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని
నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త
జనాశ్రయంచ వరదం
వందే శివం శంకరం’’
వ్యాసం వశిష్ఠ
నప్తారం శక్తే పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం
వందే శుక తాతం తపోనిధమ్.
‘‘పరబ్రహ్మ స్వరూపా! నీవు ఈశుడివి. అనగా సర్వవ్యాపివి. గిరులన్నింటికీ ప్రభువువైన గిరీశుడివి. జనులు సేవించే నరేశుడివైనా, పరతత్వం కల పరేశుడివైనా, మహత్వంగల మహేశుడివైనా అన్నీ నీవే!
నీవు బిలంలో నివసించే భయంకర సర్పాన్ని అలవోకగా మెడలోని ఆభరణంగా మలచుకుని భూషించే
‘బిలేశుడి’వి. ‘స’ ‘అంబా’ అనగా అంబా సహితుడివైన సాంబుడివి నీవు. వైరాగ్యం మూర్త్భీవించిన సదాశివుడివీ, అర్థ నిమీలిత నేత్రాలతో ‘శాంభవీ’ ముద్రలో విలసిల్లే శంభుడివీ, శుభములు కలిగించే శంకరుడివీ కూడా నీవే! అట్టి నీ దివ్య చరణ యుగానికి మేము శరణమంటున్నాము’’ అంటూ అద్భుతంగా కీర్తించారు.శ్రీ ఆది శంకర భగవత్పాదులు తన ‘సువర్ణ మాలాస్తుతి’లోని నాలుగవ పద్యంలో.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె