డైలీ సీరియల్

అద్వితీయమూ సర్వశక్తిమయమూ (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు పిమ్మట వ్యాసుల వారు నాకు వివరించినదీ, కలి కల్మషాలకు విరుగుడు అయినదీ అయిన శివ మహా పురాణాన్ని మీకు వినిపిస్తాను. మీ వంటి ఉత్తమ శిష్యులకి అంతటి మహత్తర పురాణాన్ని వినిపించ గలగటం నా భాగ్యంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఎంతటి వక్తకైనా తాను ప్రవచించే విషయాలను పరిపూర్ణ భక్తితో ఆలకించే శ్రోతలు లభిస్తేనే కదా సంతృప్తి లభించేది!
భక్త సులభుడైన ఆ గంగ జటాధరుడి గాథను ఎంతోకాలం పూర్వమే నైమిశారణ్యంలోని పూర్వ మునులకు ఒకసారి సనత్కుమారుడూ, మరొక పర్యాయం వాయుదేవుడూ వినిపించారు. ఆ పరమేశ్వరుడు స్వయంగా తనకు లక్ష శ్లోకాలలో తెలిపిన శివ పురాణాన్ని సనత్కుమారుడు మా గురువైన వ్యాస మునీంద్రునికి వివరించగా ఆయన దానిని నాకు బోధించి, శంకరుని పరమేశ్వర, మహేశ్వర, ఈశ్వర, రుద్ర, లింగ స్వరూపాల గురించీ, శివ తత్వాన్ని గురించీ విశే్లషించారు.
అటువంటి అద్భుత చరితాన్ని మా గురువుగారు నాకు తెలిపిన విధంగా అనగా, నందీశ్వర సనత్కుమారులకి ఒకప్పుడు జరిగిన సంవాదరూపంగానూ, బ్రహ్మ నారదుని ప్రశ్నలకు తెలిపిన సమాధానాలుగానూ మీకు వినిపిస్తాను.’’ అంటూ అపూర్వమైన శివపురాణాన్ని ప్రవచించటం ప్రారంభించారు సూతమహర్షి.
‘శివపురాణ’ వైశిష్ఠ్యం
‘‘పరాత్పరం సర్వ శక్తి సంపన్నం,
సర్వ వ్యాపిన మాత్మగం
అద్వయం పరమం వందే పరబ్రహ్మాణమీశ్వరం’’
పరమ శివుని విశిష్ఠతను వర్ణించే పంచ రత్న మాలికా స్తోత్రంలోనిది ఈ శ్లోకము. ఏకమూ, అద్వితీయమూ, సర్వ శక్తి సంపన్నమూ, ఆత్మలన్నింటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపమూ అన్నీ కూడా ఈశ్వరుడేననీ, ‘అద్వయం’ అనగా రెండవ పదార్థ మింకేదీ లేదనీ నిర్ణయించిన శ్లోకమిది.
సూతుల వారు శివపురాణ వైశిష్ట్యాన్ని గురించి ఇలా వచించసాగారు.
‘‘మహర్షులారా! పరమ శివుడు సనక సనందనాదులకు పనె్నండు సంహితలలో లక్ష శ్లోకాలుగా తెలిపిన ‘శివమహా’ పురాణ సారాంశాన్ని మా గురువుగారు ఏడు సంహితలలో నాకు వివరించారు.
ఆ సంహితల నామాలు విద్యేశ్వర, రుద్ర, శతరుద్ర, కోటిరుద్ర, ఉమా, కైలాస, వాయవీయ సంహితలు. శివుడు అదనంగా తెలిపిన వినాయక, మాతృ, ఏకాదశరుద్ర, సహస్రకోటి రుద్ర, ధర్మ సంహితలనబడిన ఐదు సంహితలలోని ముఖ్య విషయాలు కూడా తన ఏడు సంహితలలోనే మిళితం చేసి మా గురువర్యులు శివపురాణాన్ని నాకు వినిపించారు.
విద్యేశ్వర సంహితలో శివలింగ పూజా విధానము, పార్థవ లింగ విశిష్టతా, ఓంకార మహిమా తెలుపబడగా, రుద్ర సంహితలో శంకరుని వివాహమూ, అసుర సంహారమూ వివరించబడింది. ఉమా సంహిత దేవీ లీలలనూ, కైలాస సంహిత మోక్ష సాధనాలనూ, వాయవీయ సంహిత ‘పశుపత’ వ్రతాదులనూ, శతరుద్ర, కోటిరుద్ర సంహితలు వివిధ లింగాలూ, ఉపలింగాలనూ గురించీ విశే్లషించాయి.
కైలాస సంహిత ఓంకార భరితం కనుక, నిత్యమూ ఆ సంహితను పఠించిన వారికి మోక్షం కరతలామలకవౌతుంది. ప్రణవ మంత్రమయిన ఓంకారం గురించి ‘కార్తికేయ-వామదేవ’ సంవాదంలో కార్తికేయుని చేత వామదేవుడికి కైలాస సంహితలో వివరించబడింది’’ అన్నారు సూతమహర్షి.
వ్యాసులు మనకందించిన శివ పురాణం ప్రామాణిక గ్రంథము. వేదములతో సమానము. ఇది పరమేశ్వరుని కథా ప్రశంస. శ్రేష్ఠమైన మంత్రాల సంకలనము. సాక్షాత్తూ పరమ శివునిచే ప్రతిపాదింపబడిన శివ తత్త్వ విశే్లషణము. ఉత్తమ గతులను ప్రసాదించే సాధనము. ఇటువంటి శ్రేష్ఠమైన శివపురాణ శ్రవణ ఫలాన్ని గురించి సూతమహర్షి మహర్షులకి ఈ విధంగా విశదీకరించారు.
‘‘శౌనకాది మహామునులారా!
శివ పురాణం ఒక కల్పవక్షం వంటిది. ముఖ్యంగా కలియుగంలో ధర్మం పాటించక అధర్మయుతులై, కలుషిత మనస్కులై చరించే ప్రజల పాపాలు తొలగించటానికి ఆ మహా పురాణ శ్రవణ, మనన, కీర్తనాలు తప్ప వేరే సాధనం లేదు.
కల్ప వృక్షానికి సాధ్యం కాని మోక్షాన్ని ప్రసాదించే శక్తి శివ పురాణానికి ఉంది. కలి దోష నివారణకూ, పాప ప్రక్షాళణనకూ, యజ్ఞ యాగ దానాదులన్నింటి కన్నా విశేష మైనది శివ పురాణ శ్రవణమూ, అందులోని సారాన్ని అర్థం చేసుకోవటమూ మాత్రమే! ఆ పురాణ శ్రవణం చేయదలచిన వారు పాటించవలసిన నియమ నిష్ఠలను తెలుపుతాను. శ్రద్ధగా వినండి.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె