డైలీ సీరియల్

దూతికా విజయం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎన్నాళ్లుగా జరిపించావు రుూ నాటకాన్ని?’’
సరస్వతి నిర్జీవ ప్రతిమవలె ఉండిపోయింది.
‘‘నాలుగో ముద్దాయిని విచారించవలసిన పనిలేదు!’’ అన్నాడు రాజు.
‘‘నాలుగో ముద్దాయి కూడానా? ఎవరు ప్రభూ!’’ అన్నాడు మంత్రి.
‘‘వయసుతో పదునెక్కవలసిన నీ బుర్ర, జీవితమనే సానరాయిమీద వాడి కావలసిన నీ మెదడు.. రోజురోజుకూ బండబారుతూ మొక్కవోతున్నదేం మంత్రివర్యా! .. తెలియటంలా? చిన్నరాణి వీరభద్రుని పొందు కోరింది. ఈ సరస్వతి కొన్నాళ్లుగా అతన్ని కోటలోకి తీసుకొని వస్తూనే వున్నది. రాణి ప్రణయం కాకుంటే ద్వారపాలకునికి నూట యాభై బంగారు నాణాల లంచం దేనికి?.. రుూ రాత్రి ఖర్మకాలి బెడిసికొట్టింది. వీరభద్రునికి రుూ దారంతా అలవాటయింది. అందుకనే తనను తాను రక్షించుకుందామని ఎటూ పరుగెత్తలేక, పంచేంద్రియాలూ స్వాధీనం తప్పగా, చీకట్లో కూడా కళ్లు మూసుకొని పరుగెత్తగల రుూ దారినపడి, తన షష్ఠ్యేంద్రియ సహాయంతో సరాసరి తన ప్రియురాలి సప్తదర్పణ శయన మందిరానికి బొందిని జేర్చాడు. కాని ఆ కాయం రాణి శయ్యాగారాన్ని జేరకుండానే వాకిలి దగ్గరే ప్రాణహీనమై నేలవాలింది.. తెలియటంలేదా?’’
మంత్రి తలూపాడు.
వీరభద్రుని ఇంటికి వెళ్లిన పర్యవేక్షణాధికారి అతని కొంపలో దొరికిన ఐదువేల సువర్ణ ముద్రికలున్న పెట్టెను పట్టించుకుని వచ్చాడు.
‘‘చాలా విలువైన ప్రణయం!’’ అన్నాడు రాజు. ‘‘మన బొక్కసానికి జమ చేయించండి.. వొళ్ళు దగ్గరుంచుకుని పర్యవేక్షణ సాగించు.. మొదటి తప్పిదంగా మన్నిస్తున్నాము!’’
పర్యవేక్షణాధికారి కృతజ్ఞతాపూర్వకంగా రాజుకు వందనమర్పించి వెనక్కు సర్దుకున్నాడు.
దక్షిణద్వారం దగ్గర్నుంచి మదపుటేనుగు ఘీంకరిస్తూ, జయపాలుని చావుకేకలూ స్పష్టంగా వినినిపిస్తున్నవి. అందరి రక్తాలూ గడ్డకట్టుకొనిపోతున్నట్లు అనిపించింది. నిశ్చలంగా ఉండగలిగింది రాజు, సరస్వతులు మాత్రమే!
ఇంతలో రాణికి స్పృహ వచ్చింది.
చుట్టుప్రక్కల కలియజూసి నాటకం అంత్యదశను అందుకున్నదని ఆమె అర్థం చేసుకున్నది. ముఖ్యంగా సరస్వతిని ఒక్కసారి వీక్షించి, బహుశా తన ప్రతిబింబానే్న తాను చూసుకుంటున్నాననీ, తన మొహంలో కూడా ఆ ప్రేతకళ తాండవిస్తున్నదనీ ఆమె తెలుసుకున్నది.
జయపాలుని కేకలు ఇప్పుడు వినరావటంలేదు. మదపుటేనుగు ఘీంకారాలు మాత్రం విననౌతున్నాయి. జయపాలుని భూస్థాపన బాధ్యతను మదపుటేనుగు నిర్వహిస్తూండి ఉండాలనుకున్నారు అందరూ.
కళ్లముందున్నదాన్ని, గుడ్డివారు కానివారందరూ చూడగలరు. కాని మనోనేత్రాన్ని తెరిచి, ఆ వెనుక ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలగటమే ‘నిజమైన దృష్టి’ అనే సత్యాన్ని ధర్మపాల ప్రభువు ప్రదర్శించారు.
‘‘మంత్రీ!.. మిగిలిన ఈ ఇద్దరూ రాజద్రోహులు! వీరు అబలలనబడే సబలలు! విషసర్పాలకన్నా ప్రమాదకరమైన జీవులు. ఇంత తెలివిగలవాళ్ళు ఎంతకైనా సాహసిస్తారు. వీళ్ళిద్దరూ ఈ వీరభద్రుని శవాన్ని దక్షిణ ద్వారం దాకా మోసుకొని వెళ్తారు. దక్షిణ ద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉద్యానవనపు సరిహద్దులో వీరిద్దరూ, ఆ శవమూ మొత్తం రుూ మూడు శరీరాలకూ సజీవ సమాధి కట్టించండి. స్ర్తిలు కుసుమ కోమలులు కనుక కఠినమై మరణం సమంజసం కాదు. అందుకని సజీవ సమాధి చేయించండి. ఇప్పటికిప్పుడు శిక్ష అమలు జరగాలి. ఇకముందెవరన్నా దక్షిణ ద్వారం గుండా అర్థరాత్రి రాణివాసంలో ప్రవేశించాలని చూస్తే, ముందుగా జయపాలుని భూతం అడ్డుపడి వారిస్తుంది. దాన్ని లెక్కచేయక కాస్త ముందుకు వస్తే రుూ మూడు భూతాలు తమ తమ దీనగాథలను తెలియజెప్పుకుంటవి గాక!’’ రాజు లేచి తేలికైన మనస్సుతో, ఠీవిగా నిష్క్రమించాడు.
రాణి అవమానాగ్నితో దహించుకొనిపోతోంది. సరస్వతి కానీ, బ్రహ్మదేవుడే కానీ ఆమెను ఊరడించగలిగే స్థితిలో లేరు. రాణిని కడసారి చూసేందుకు రాణివాసపు స్ర్తిలందరూ ముందుకు తోసుకొని రాసాగారు. భటులకు ఈ స్ర్తి జాతి మీదనే మండిపోతూన్నవి. అందునా రాణివాసంలో ఇంత అందచందాలు, యవ్వనం వున్న స్ర్తిలు తమకు దక్కకుండా పోతున్నారనే బాధ కూడా వారి మనస్సుల్లో లేకపోలేదు. సమయం దొరకనే దొరికిందని, భటులు తమ బల్లాలను అడ్డంగా పెట్టి స్ర్తి జనాన్ని వెనక్కు నెట్టారు.
ఇక జరుగవలసినదాన్ని అడ్డేందుకు దేవుని తరం కూడా కాదని తేలిపోయింది.
సరస్వతీ, రాణీ ఒకరి మొహాలొకరు చూసుకొని అంతలోనే తిప్పేసుకున్నారు. క్షణకాలమే కలిసిన వారి చూపులో ఉభయుల భూత భవిష్యద్వర్తమానాలూ
వారికి అవగాహన అయినవి. ఇంకా తనలో ప్రాణమున్నది కనుక రాణి ఆధిక్యతను అంగీకరిస్తున్నట్లు సూచిస్తూ సరస్వతి వీరభద్రుని కాళ్ళవైపు నిలబడింది.
భటులంత నీచుల చేతకానీ మరే ఇతరుల చేతకానీ చెప్పించుకోకుండానే రాణి వీరభద్రుని తల వైపు జేరింది.
గున్నఏనుగులాంటి వీరభద్రుడు పీనుగయ్యాడు. చచ్చిన సింహంకన్నా, బతికివున్న నక్క మేలని తెలియజెపుతున్నట్లున్నాడు!
పడతులిద్దరూ పమిటచెంగులు బొడ్డులో దోపుకున్నారు. అతికష్టంమీద వీరభద్రుని శవాన్ని భుజాలమీదికి ఎత్తుకున్నారు.
రాణికి పట్టిన గతికి రాణివాస స్ర్తిలందరూ ఆక్రోశించారు. కాస్త బలహీనతలున్నవారు వెక్కి వెక్కి ఏడ్చారు. అందరూ దుఃఖ సముద్రంలో మునకలు వేశారు. ఒకరిద్దరు మునిగిపోయి మూర్ఛపోయారు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు