డైలీ సీరియల్

తపస్సే అన్నింటికీ మూలం ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారదుడు ఆ ప్రకారంగానే నడుచుకుని పరిపూర్ణుడై, పరిశుద్ధ మనసుతో తన తండ్రిని ఆశ్రయించి శివతత్వాన్ని తనకు బోధించమని ప్రార్థించాడు. ఆ సందర్భాన బ్రహ్మ తన మానస పుత్రునికి ఇలా తెలిపాడు.’’ అని బ్రహ్మ నారద సంభాషణంగా శివ తత్వాన్ని శౌనకాదులకి వివరించసాగారు సూత మహర్షి.
బ్రహ్మ-నారద సంవాదం
(రుద్ర సంహిత)
‘‘నాయనా నారదా!
సృష్ట్యాదిలో, అనగా త్రిమూర్తుల ఆవిర్భావానికి కూడా పూర్వం ఉన్న అఖండ జ్యోతి అయిన చిదగ్ని కుండం నుండి ఆ పరమేశ్వరుడు తన వామాంకాన దేవీ పరమేశ్వరితో పాటుగా ఆవిర్భవించాడు. రెప్ప కాలంలో ఆయన నుండి అనంతకోటి బ్రహ్మాండాలూ, వాటిలోని పృథ్వీ, పర్వతాలూ, సాగరాలూ, పంచ భూతాలూ మొదలైనవి ఆవిర్భవించాయి. పరమేశ్వరుడు ఆ తత్త్వంలో కేవలం సాక్షీ భూతుడిగా ఉండదలిచాడు. విశ్వ సృష్టి, స్థితి, లయా కార్యక్రమాలు పరమేశ్వరికి అప్పగించి తన ప్రతినిధిగా తన మహేశ్వరాంశను కైలాసాన నిలిపాడు. పరమేశ్వరీదేవి తేజస్సు మధ్య నుండి ఆమె ఆత్మ అయిన కృష్ణ పరమాత్మ వెలువడి గోలోకాన్ని తన నివాసంగా చేసుకోగా, ఆయన అంశగా ఊర్ధ్వలోకమైన వైకుంఠాన శ్రీ మహావిష్ణువు నెలకొన్నాడు. ఆది నారాయణుడైన ఆయన అంశాన క్రిందనున్న సముద్ర మధ్యంలో నా తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. ఆయననే విరాట్పురుషుడనీ, జగన్నాథుడనీ, జనార్ధనుడనీ వ్యవహరిస్తారు. ‘నారము’ నుండి అనగా నీటిలోనుండి ఉద్భవించటం వలననూ, నారమునకు మరో అర్థమైన ‘జ్ఞానము’లో ఉత్కృష్టుడైనందువలననూ ఆయన నారాయణుడనే నామంతో ప్రసిద్ధుడయాడు. ఆది శేషుడిపై పవళించి ఉన్న ఆయన చుట్టూ పరికిస్తూ ఉండగా, ఆయనకి మహేశ్వరీ సహితుడైన మహేశ్వరుడు దర్శనమిచ్చాడట. అప్పటికి నేనింకా ఉద్భవించలేదు నారదా! ఈ వైనమంతా నేను ఆ తరువాత నా తండ్రి నుండి తెలుసుకున్నదే!
మహేశ్వరుడు నా తండ్రితో ఇలా అన్నాడు.
‘‘నారాయణా! నీకు నా పంచాక్షరీ మంత్రమయిన ‘నమశ్శివాయ’ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని జపించి శక్తిని పొందు. ఆ తరువాత నీ నాభి నుండి పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. అతని చేత భూలోక సృష్టి చేయబడుతుంది. సృష్టి రచన జరిగిన తరువాత, ఆ సృష్టిని యావత్తూ రక్షించే స్థితి బాధ్యతను స్వీకరించవలసిన వాడివి నీవు. నేను సృష్టి నియామకుడనైన మహేశ్వరుడిని. నా వామాంకాన ఉన్న ఈ నారీమణి నా శక్తి అయిన మహేశ్వరీ దేవి. ఈమె అంశురాలైన యోగమాయాదేవి సృష్టిని పోషించే కార్యంలో నీకు వలసినప్పుడల్లా తోడ్పడుతుంది. నీలోనే దాగి ఉండి, నీవు తలచినప్పుడల్లా బహిర్గతమవుతూ ఉంటుంది. శుభమస్తు! ముందు మంత్ర జపం చేసి, వలసిన శక్తిని పొందు.’’ అని పంచాక్షరీ మంత్రాన్ని ఆయనకు ఉపదేశించి అదృశ్యుడయాడు మహేశ్వరుడు. నా తండ్రి సవినయంగా ఆయన నుండి గ్రహించిన పంచాక్షరీ మంత్రాన్ని జపించనారంభించాడు.
పంచముఖ బ్రహ్మ ఉద్భవం
‘‘నారదా! నమశ్శివాయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ దీర్ఘకాలం యోగనిద్రాపరవశుడై ఉన్న నా తండ్రి శ్రీమన్నారాయణుని నాభి నుండి అనేక వేల యోజనాల పొడవు కల ఒక పద్మనాళము ఉద్భవించి, దాని చివర అసంఖ్యాక దళాలతో ఒక పద్మం వికసించింది. ఆ పద్మ కర్ణిక - అనగా మధ్య భాగాన పంచముఖుడిగా నేను ఆవిర్భవించాను. నాలుగు దిక్కులూ చూస్తున్న నా నాలుగు ముఖాల నడుమ, నా ఐదో వదనం ఉన్నది. అప్పుడే ఉద్భవించిన నాకు నేనెవర్నో తెలియదు. ‘నేనెవరిని?! ఎక్కడి నుండి ఈ పద్మంలోకి వచ్చాను?’ అని దీర్ఘంగా ఆలోచిస్తూ పద్మానికి అతుక్కుని ఉన్న నాళంలోకి చొచ్చుకుని పోయి చాలాకాలం, ఎంతో దూరం క్రిందికి పయనించి వెళ్ళాను. కానీ ఆ స్థితిలో నాకేమీ కనుపించలేదు. ఏం చేయలేక తిరుగు ముఖం పట్టి పైకి వచ్చాను.
అంతలో ‘ఓం’ అన్న ప్రణవ మంత్రము వినిపించింది. ఒక అశరీరవాణి అదృశ్యంగానే నన్నిలా ఆజ్ఞాపించింది. ‘నాయనా! తపః! తపః! ఓంకారాన్ని జపిస్తూ తపస్సు చేయి!’’ నేను ఆ అశరీరవాణి ఆజ్ఞానుసారం వేయి సంవత్సరాలు ప్రణవ మంత్రాన్ని జపించగా నాకు పీత వస్త్ధ్రారియై, నాలుగు హస్తాలలోనూ శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన దివ్య తేజో విరాజీ, నీల మంగళ విగ్రహుడూ, పీతాంబరధారీ, సౌమ్య మూర్తీ అయిన శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు.
ఆ జగన్నాథుడు మందహాస వదనంతో మృదువుగా, ‘‘నాయనా! నీవు నా నాభి నుండి సంభవించిన నా కుమారుడివి.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె