డైలీ సీరియల్

దూతికా విజయం-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని అనారోగ్యంతో బాధపడుతూ, ఆరోగ్యాన్ని పొందగలిగినప్పుడు మరెంతగానో తాను ఆరోగ్యంగా ఉన్నప్పటికన్నా అత్యధికంగా ఆనందిస్తాడు. మనస్తత్వ పరిణామానికి సంబంధించిన ఈ న్యాయానే్న భగవంతుడు అమలుజరుపుతున్నాడేమో?
అదీగాక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే కదా మానవుడు నిజంగా హృదయపూర్వకంగా, ఆత్మశుద్ధితో ప్రార్థించేది? తనపైన మానవుని విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకుగాను విధి వేసే ఎత్తులివి!
ఇక రుూ సందర్భంలో మానవుడిచ్చిన న్యాయం జోలికి పోలేని దివ్యశక్తుల సంగతి సరస్వతికి తెలియకపోలేదు. తాను ముద్దాయి అయినప్పటికీ, మరణవేదన ఆరంభమైనప్పటికీ తాను అమల్లో వున్న చట్టాలన్నింటిని నైతిక కట్టడులన్నిటినీ అతిక్రమించిన అబల! న్యాయబద్ధంగా వున్న తీర్పును తాను కాదనలేదు. అందుకని, ఆ శిక్షను అనుభవించి తన పాపాలన్నిటినీ కడిగివేసుకోవటంలో తాను వెనుకాడవలసిన పనిలేదు!
కంటికి కనిపించని దైవాజ్ఞను సైతం ధిక్కరించి మనగలుగుగాక! కాని రక్తమాంసాలతో, నిజమైన అధికారంతో వున్న రాజాజ్ఞలు సూటిగా వొత్తిడి తేగలవాటిని ధిక్కరించటం అసంభవం! అందుకనేకదా వీరభద్రుడు సంతానగోపాలుని ఆజ్ఞను ధిక్కరించేందుకు సిద్ధపడినా రాణి ఆజ్ఞను అతిక్రమించేందుకు భయపడి, తన ప్రాణాన్ని సైతం బలిపెట్టేందుకు సిద్ధపడి, ప్రాణాలనే కోల్పోయింది! తను మాత్రం అంతకన్నా ఎక్కువా? రాణికన్నా అధికురాలా?
తలపైన కూడా మూసుకొనిపోతూన్నది.
ఇంతవరకూ ఎంతో ధైర్యంతో వున్న సరస్వతి ఆ చివరి ఇటుక కూడా పూరించడంతో ఏర్పడిన మహాంధకారాన్ని చూసి, వొడిలో వున్న వీరభద్రుని శవం తాలూకు కాళ్ళను తడిమి భయవిహ్వల ఐంది. మృత్యుదేవత విలయతాండవానికి తట్టుకోలేక, తనలో రేగిన ఉద్వేగాన్ని భరించలేక, లోని వత్తిడిని విడుదల చేయడం తప్ప వేరొక మార్గం లేదన్నటు పెద్దగా, వినేవాళ్ళు హడలిపోయేట్లుగా బీభత్సంగా, భీకరంగా, కేక కాదు అనేక కేకలు వేసింది సరస్వతి!
***
ఆగిపోయిన ఊపిరి తిరిగి పీల్చుకొనే సావకాశం ఏర్పడగా సరస్వతి గాఢంగా గాలి పీల్చింది. మొహంమీద చల్లని నీరు చిమ్మబడుతోంది. తనలో తిరిగి ప్రాణం ప్రవేశించినట్లున్నది! మరణవేదనంతా మాయమై మరో ప్రపంచంలో తల ఎత్తవలసిన అవసరం ఉన్నట్లు తోచిందామెకు.
మెల్లిగా కళ్ళుతెరిచింది. తాను పూర్తిగా మునిగిపోయిన ఆ చిక్కని చీకటి దూర దూరాలకు తరిమివేయబడేందుకేమో కరదీపిక వెలుగు వాతావారణాన్ని సుస్పష్టం చేస్తున్నది! ఇది ఏ లోకమో?
ఎదురుగా రాణి కనిపించిందామెకు. తన ప్రార్థనను భగవానుడు మన్నించి, పావని అయిన తనను కూడా పతితగా మార్చి రాణి సేవాభాగ్యాన్ని కలిగించి, ఆమెతో పాటు తనను కూడా రుూ నరకంలోకి పంపినందుకు హృదయపూర్వకంగా తన కృతజ్ఞతలు తెలుపుకున్నదామె. చుట్టూ వున్న ఈ మిగతా స్ర్తిలు- పాపులైన స్ర్తిలను బాధిస్తూ, శిక్షిస్తూండేందుకుగాను యమధర్మరాజు కొలువులో నియోగించబడ్డారేమో?
ఆ వెలుగునకు కళ్ళు అలవాటై తన చుట్టూ వున్నవారిని ఒక్కొక్కర్నే గుర్తించసాగింది సరస్వతి. ఇదేమిటి! రాణివాసంలోని స్ర్తిలందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? తనకూ, రాణికేగాక, రాణివాస రమణులకందరికీ కూడా క్రూరమైన శిక్షనే విధించాడా నిర్దయుడైన రాజు? ఒక స్ర్తి లేదా ఇద్దరు స్ర్తిలు చేసిన నేరానికి స్ర్తి జన్మంతా శిక్షను అనుభవించటం ఎంత క్రూరమైన శాసనం!
కేవలం అధికారం చేతుల్లో వున్నదని, దాన్ని దుర్వినియోగం చేసినా అడిగేవారు లేరని, ప్రపంచానే్నదో మరమ్మతు చేద్దామనే దురూహతో, దురహంకారంతో, ప్రకృతి సహజమైన వాంఛల ప్రవాహానికి ఆనకట్ట కట్టగలననే నమ్మకంతో, అదంతా వ్యర్థమని తెలిసి కూడా సజీవులుగా వున్నవారిని భయపెట్టేందుకుగాను రాజు రుూ క్రూర శిక్షను విధించే ఉండవచ్చు.
వ్యక్తిగతంగా తనకు జరిగిన అక్రమానికి కసి తీర్చుకునేందుకు కన్నుగానక చేయించిన రుూ హత్యలకు నరకమనేది రాజుకు సరిపోతుందా? కొంతమంది నోళ్ళు మూయించగలిగాడేమో రాజు- కాని ఒక్కర్ని మచ్చుకు ఒక్కళ్ళనన్నా మార్చగలిగాడా అనేది సందేహం!
రాణీ, రుూ దాస దాసీ జనాలూ తనకన్నా ముందుగానే మరణించి రుూ నరకాన్ని జేరి వుండాలి. తనది మొండి ప్రాణం కనుక, కాస్త ఆలస్యంగా తనిక్కడికి వచ్చి ఉండాలి!
పరమ కిరాతకుడైన తమ ఏలికకన్న రుూ యమధర్మరాజు నిజమైన న్యాయాన్ని పాలించే ప్రభువై ఉండాలి. అందుకనే అందరి మొహాలు కళకళలాడుతున్నవి. దుర్మరణాలకు గురైన ఛాయలు తనకెక్కడా కనిపించటంలేదు.
అయితే ఏ నేరాలు చేశారని ఈ దాసదాసీలనందర్నీ యముడు ఇక్కడికి జేరదీశాడు? తన రాణిపట్ల కరుణ జూపదలిచాడా? పతితగా రుజూ అయి, ముద్రపడి నరకానికి వస్తే శిక్షించేందుకు మారుగా, ఆమె సౌకర్యార్థం అన్యాయంగా, అక్రమంగా ఈ రాణివాస రమణుల్ని ఇక్కడికి జేర్చటం యముని హృదయ వైశాల్యాన్ని నిరూపించుగాక- కాని ధర్మవిరుద్ధమైనదే అవుతుంది కదా? లేక మానవ నిర్మితమైన చట్టాల్లో, కట్టడుల్లో పవిత్రతను నటిస్తూ, పట్టుబడకుండా కాపాడుకుంటూ ఈ స్ర్తిలందరూ భూలోకంలోని శిక్షలన్నిటినీ తప్పించుకొని ఉండొచ్చు. అక్కడ వీరందరూ పుణ్యత్ములవలెనే భావించబడి ఉండొచ్చు. కాని ఎవరికీ తెలియదనుకొని వీరు చేసిన నేరాల పుణ్యపాపాల జమా ఖర్చులు ఇక్కడి చిత్ర గుప్తుడు నమోదు చేసే ఉండటం వల్ల వారి వంతుకు నరకశిక్ష పడిందేమో!
రాజు క్రూరుడే అవుగాక- ఒక విధంగా అదీ మంచిదే అయింది!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు