డైలీ సీరియల్

దూతికా విజయం-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేదా తాను వీరభద్రుని వద్దకు దౌత్యం వెళ్ళకుండానే, ఒక రోజంతా పట్టణంలో గడిపి మర్నాడు వచ్చి అతను అంగీకరించటంలేదని చెపితే?
రాణి ఎటూ స్వయంగా వెళ్లి నిజాన్ని తెలుసుకోలేదు. ఇతరులెవర్నీ నమ్మి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నమూ చేయదు. అయితే తన లాటి ప్రతిభావంతురాలు, వీరభద్రుని లాటి సర్వసామాన్యుణ్ణి ముక్కుకు తాడుపోసి లాక్కురాలేకపోయిందనే విషయాన్ని రాణి ఎన్నటికీ నమ్మలేదు. తానే రుూ నాటకమంతా ఆడిందనే విషయాన్ని ఆమే తేలిగ్గా గ్రహించేస్తుంది. ఐతే ఆ కారణంగా తననేమీ అనకపోవచ్చు. మనసులోనే తనను మోసగించిందనే అభిప్రాయన్నా ఆమె విడనాడలేదు.
ఇంత గొప్ప అవకాశాన్నీ ఆశనూ ఊతంగా, తోడు ఇచ్చినా వీరభద్రుని లాటి సామాన్యుణ్ణి కూడా ఒప్పించలేకపోయిన తన తెలివితేటలనూ, సామర్థ్యాన్నీ రాణి ఎలా అంచనా వేస్తుంది? తన ప్రతిభకు తానే సిగ్గుపడవలసిన విషయమది!
ఒకవేళ రాణి తన అపజయాన్ని క్షమించినా ఎటూ ఒక సంవత్సరంలోగా గర్భాన్ని ధరించటమే జీవన్మరణ సమస్యగా నిర్ణయించుకొన్న రాణి- వీరభద్రుణ్ని వొదిలేసినా, మరొక పురుషశ్రేష్టుణ్ని వెతికే బాధ్యత తన నెత్తిన వేస్తుంది. అప్పుడైనా తనకు రుూ తిప్పలు తప్పవు కదా! కాకపోతే ఇదుగో అదుగో అంటూ కొన్నాళ్ళు, ప్రయత్నిస్తున్నానని మరికొన్నాళ్ళు తప్పించుకొని కాలయాపననైతే చేయవచ్చునేమో కాని మొత్తానికి ఎల్లకాలమూ తప్పించుకోగలటం సంభవం కాదని ఆమె నిశ్చయించుకున్నది.
జీవితాన్ని ఆజ్ఞాపించి, నడిపించగల కేంద్ర శక్తి స్వార్థం. ఆ స్వార్థమే లేకుంటే మనుషుల్లో ఇంత సంచలనం ఉండేదా? ఎవరెవరి ఓపికలను బట్టి, సామర్థ్యాన్ని అనుసరించి, సమయ సందర్భాల ఆసరా చూసుకొని, అవసరమైతే కట్టడుల్నీ, చట్టాల్ని కూడా రహస్యంగా ధిక్కరించి, అదీ కుదరదంటే బహిరంగంగా చట్టాన్ని చుట్ట చుట్టి అవతల పెట్టయినా సరే స్వార్థాన్ని తృప్తిపరుచుకుంటూనే ఉన్నారు.
రాణి ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించవలసిన పనిలేదు. మానవ ప్రాణాలన్నీ తహతహలాడే, భగభగమండే సహజ వాంఛల మంటల్లో తాను కాలి బూడిద కాకుండా తనను తాను కాపాడుకునేందుకు, రాజు పెట్టిన గడువు దాటకుండా తన మంచి, మర్యాదలూ, హోదా కాపాడుకునేందుకే ఈ తప్పుడు తోవలో ఆలోచించింది. ఆవగింజంత మర్రి విత్తనాన్ని చూసి, బ్రహ్మాండమైన మర్రి చెట్టునే ఊహించగల మానవుని బుర్ర.. రాణి ఈ వింత కోర్కెనే ఊహించలేకపోతుందా?
బరువంతా తనమీద పడిందని రాణిని తప్పుపట్టజూడకుంటే కాస్సేపు తనే రాణినని ఊహించినట్లయితే, మరోదారి లేక, రహదారిన రాలేక, ఈ అడ్డతోవ పట్టిన కారణాలన్నీతనకు అంగీకారయోగ్యాలే అవుతవి. తన కోరిక తీరటం తేలికనే అభిప్రాయమైతే రాణికి వుండి ఉండదు; ఆమె కేవలం తన ప్రాణసఖి సామర్థ్యంమీద ఆధారపడి క్లిష్టమైన సమస్యను కూడా ఆమె భేదించగలదనే నమ్మకంతో ఉండి ఉండాలి.
రాణి మాతృమూర్తి కావటం, రాజు దృష్టిలో తనస్థానాన్ని స్థిరపరచురకొని, బలపరచుకోవటం, కామతాపాన్ని చల్లార్చుకోవటం రాణి స్వార్థం సాధించిపెట్టేది.
తగినంత ధనం ముట్టడం, రతీదేవిలాంటి రాణిని రమించే సదవకాశం కలగటం, ఆ స్వర్గ సౌఖ్యాన్ని సాధించటం వీరభద్రుని స్వార్థం.
ఇంతమందిని ఒక కొలక్కి తీసుకొచ్చి ఒకే తాటిమీద నడిపించగల శక్తి ఆ స్వార్థానికే కదా వున్నది! అయితే జీవన్మరణ సమస్యగా పరిణమిస్తున్న ఈ విషమ కార్యనిర్వహణ బాధ్యతను తాను స్వీకరించి ఎంతో చాకచక్యంతో సఫలం చేయాలంటే తనకూ స్వార్థం ఉండి ఉండాలి కదా! అదేమిటి?
ఒక్కచోట పెరిగి పెద్దవాళ్ళవుతూ తనూ రాణీ ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్నారు. మాధవీదేవి వివాహం ద్వారా రుూ సమాజం, అందునా కేవలం అధికారం, ఆమెను ఎంత అన్యాయం చేసిందో తనకు తెలుసు. పురుషజాతి స్ర్తిని ఎన్ని విధాల అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నదో తాను గమనిస్తూనే వున్నది. తన చేతకానితనన్నా ఒప్పుకోలేని రాజు.. రాణిమీదనే ఆ తప్పు నెట్టేందుకు ప్రయత్నిస్తూ బెదిరింపు జారీ చేశాడు. మాతృత్వం స్ర్తికి జన్మహక్కు అయినపుడు, ఏ స్ర్తి గొడ్రాలుగా ముద్ర వేయించుకునేందుకు ఒప్పుకుంటుంది? అందుకనే కదా ఇదివరకెన్నడూ పరపురుషుని ప్రమేయమే చేయని రాణి ఇపుడు వీరభద్రుని పొందుకోసం ఉవ్విళ్ళూరేది? రాణి దృష్ట్యా చూసినట్లయితే ఆమె కోర్కెలో వింతేమీ కనిపించదు సరికదా- అది చాలా సహజంగా కూడా ధ్వనిస్తుంది. రాణిపట్ల తనకుండే స్నేహమూ, సౌహార్ధ్రమూ, సానుభూతీ- ఆమెకు సహకరించాలనే నిశ్చయించినవి.
ఐతే అగ్నిగుండం లాంటి ఈ ప్రమాదంలోకి దూకేందుకు ఇంతకన్నా బలమైన కారణాలు.. ముఖ్యంగా స్వార్థానికి సంబంధించినవై ఉండాలి.
తన ఈ జీవితమంతా రాణివాసంలోనే కన్యగానే రాణి సేవలో గడపాలి. అందుకు తనకు విచారం లేదు. పురుషుడంటేనే మండిపతే తన తత్వం తన విధి నిర్వహణకు అత్యంతానుకూలంగా వున్నది. పట్టుబడితే రాజద్రోహం అని చట్టాలు నిర్ణయించవచ్చు. కాని నిజమేమిటంటే రాణికి కావాలని, తెలిసి వుండి అన్యాయం చేసిన పురుషుడైన రాజుకు ప్రతీకారంగా మరో అన్యాయాన్ని చేయటానికై మరో పురుషుణ్ని తాను రంగస్థలంలో ప్రవేశపెడుతున్నది.
ఈ విధంగానన్నా రాణికి గుడ్డిలో మెల్లవలె కొంత, లేదా కొద్ది న్యాయం చేకూర్చినట్లవుతుంది. ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడే సంఘర్షణ ద్వారానే ఇది సాధ్యపడుతుంది. ఇందులో పాప పుణ్యాల జమాఖర్చులు- లాభనష్టాలేవీ లేకుండానే ఒకదానికొకటి సరిపోయి తక్కెడ ఎటూ మొగ్గకుండా చూస్తవి.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు