డైలీ సీరియల్

శివనామస్మరణ.. పాపహరణం( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కండేయుడు మహాభక్తుడు. మరుద్వతీ, మృకండ దంపతులకు లేక లేక శివ వర ప్రసాదిగా జన్మించిన ఇతడు తాను అల్పాయుష్కుడనని తెలుసుకుని, నారద మహర్షి సలహా మేరకు గోదావరీ తీరానున్న రాజరాజేశ్వరీ సోమసుందరులను ఆరాధించి యమ పాశాన్నుంచి తప్పించుకోగలిగాడు. పరమ భక్తితో శివుడిని ఆరాధించి ఆయనచే ఏడు కల్పాల ఆయువును వర ప్రసాదంగా పొందినవాడాయన. అటువంటి దీర్ఘకాల నిత్య నిరవతర భక్తుడిని మహేశ్వరుడు స్వయంగా నందీశ్వరుని వద్దకు శిష్యుడిగా పంపారంటే ఇక ఆయనెంత భక్తాగ్రేసరుడు అయి ఉండాలి! అందుకే సనత్కుమారుడికి సైతం గురువైన నందిని భక్తులందరికన్నా అగ్రస్థానంలో నిలిపాడు పరమేశ్వరుడు.
ఓం ॥ నందీశ్వరాయ నమః ॥
7
శివ పూజా విధానము
శౌనకాది మహర్షులు సూతమహర్షి తెలుపుతున్న శివ మహా పురాణ విశేషాలను తన్మయులై వింటున్నారు. మధ్య మధ్యలో తమకు తెలియుని ఎన్నో విశేషాలను అడిగి తెలుసుకుంటున్నారు. ‘‘గురువర్యా! దయచేసి శివపూజా విధానాన్ని మాకు వివరించండి.’’ అన్నారు మహర్షులు. సూత మహర్షి ఆనందించి ఇలా తెలుపసాగారు.
‘‘పుణ్య చరితులారా! శే్వత వరాహ కల్పపు ఆదిలో ఒకానొకప్పుడు ఆరుగురు గొప్ప ఋషులు త్రివేణీ సంగమం వద్దకు స్నానాదులకై వెళ్ళారు. ఆ పవిత్ర గంగా యమునా సరస్వతీ నదులు కలిసే ప్రయాగ తీర్థంలో సాధనాలాచరించ సాగారు. అప్పుడు వారిలో, దేవతలందరిలోనూ, ముఖ్యంగా త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న వాగ్వివాదం చెలరేగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటం వలన వారంతా బ్రహ్మపురికి వెళ్ళి ఆయన ముందు తమ తమ అభిప్రాయాలను తెలిపి అందరికన్నా అధికదైవం ఎవరో తెలుపమని ప్రార్థించారు.
బ్రహ్మదేవుడు వెంటనే ‘‘మునివర్యులారా! దేవాధిదేవుడూ, త్రిమూర్తులను కూడా మించినవాడూ ఆ మహాదేవుడే! ఆయనని శ్రవణ మనన, కీర్తనలతో సేవించేవారు ఆయనలో ఐక్యం అవుతారనటంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.’’ అని వారి వివాదాన్ని పరిష్కరించి, ‘‘శివుడిని పై తెలిపిన విధానాల్లో సేవించలేని వారు శివలింగాన్ని పూజించినా ఆ ఫలితం దక్కుతుంది.’’ అని తెలిపారు.
‘‘శౌనకాదులారా!
శివపూజ కావించే విధానం తెలుపుతాను. శ్రద్ధగా వినండి. బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి, శివ స్మరణ గావించుకుని నిత్యకృత్యాలు ముగించుకోవాలి. స్నానానంతరం సంధ్యావం దనం, చేసుకుని ఆ తరువాత శివుడికి ప్రతిరూపమైన లింగాన్ని పంచోపచారాలతోకానీ షోడశోపచారాలతో కానీ పూజించాలి. పంచామృతాలతోనూ, గంగోదకంతోనూ, శివలింగాభిషేకం చేసి తరువాత గంధాది వివిధ విలేపనాలతోనూ, పుష్ప పత్ర విభూతులతోనూ దానిని అలంకరించటమే శివుడికి ప్రీతి పాత్రమయిన పూజ. శక్తిలేని వారు ఏ రాయిని శివస్వరూపంగా భావించుకుని చెంబెడు నీళ్ళు పోసినా ఆ భోలా శంకరుడు ఉప్పొంగిపోతాడు. చక్కటి ఫలాన్నీ ఇస్తాడు.
మునులారా! పంచామృతాలకి అనంత శక్తి ఉంది. క్షీరాభిషేకం అనగా పాలతో అభిషేకం పుంస్యాభివృద్ధినీ, ఘృతము అనగా నేతి అభిషేకం వంశాభివృద్ధినీ కలిగిస్తాయి. దధి ఆరోగ్యాన్నీ, తేనె తేజో వృద్ధినీ, చెఱకు ఆదిగా గల ఫల రసాలు సర్వ దుఃఖ నివారణనీ, కొబ్బరి నీళ్ళు సంపద్వుృద్ధినీ, శుద్ధ గంగోదకాభిషేకం సాక్షాత్తూ మోక్షాన్నీ ప్రసాదిస్తాయి. చక్కెర కలిపిన పాలతోటి అభిషేకం చేస్తే బుద్ధి మాంధ్యం నశిస్తుంది.

ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె