డైలీ సీరియల్

శివనామస్మరణం.. పాపహరణం (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీ యాత్ర చేసి అక్కడి విశే్వశ్వరునితో పాటూ అన్నపూర్ణా, విశాలాక్షీ, దండపాణి, డుంటి గణపతి, కాలభైరవ, హనుమద్ ప్రాంగణాలూ దర్శించాలి. మాంధాత అనే చక్రవర్తి ఒకప్పుడు కేదారేశ్వరం నుండి తరలించి తెచ్చిన పదునాలుగు కళలతో అలరారే కేదార లింగమునూ ఇతర ప్రముఖ ఋషివర్యులెందరో ప్రతిష్ఠించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయాలనూ సందర్శించిన వారికి అడుగడుగుకీ అశ్వమేద యాగ ఫలం సిద్ధిస్తుంది.
అనేక ప్రసిద్ధ ఘట్టాలు కాశీ గంగా తీరాన ఉన్నాయి.
‘‘ముని శ్రేష్ఠులారా!
ఒకసారి విష్ణుమూర్తి పరమేశ్వరుని గూర్చి చేసిన కఠోర తపస్సుకి ముగ్ధుడై ఆయన తన్మయత్వంతో తల ఊపగా, ఆ పరమేశ్వరుని చెవి క్రమ్మ ఊడి పడిన గంగా ఘట్టమే (ఘాట్) ‘మణికర్ణికా’ ఘట్టము. అలాగే బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేసిన తీరానికి ‘దశాశ్వమేద’ ఘట్టమనీ, హరిశ్చంద్ర భూపాలుడు వీరబాహువు అనే వానికి సేవకుడై కాటి కాపరిగా మసలిన గంగా తీరానికి ‘హరిశ్చంద్ర’ ఘట్టమనీ, ఒక ఉత్తమ బ్రాహ్మణుడు కేదారేశ్వరుడిని అర్చించి ముక్తి పొందిన తీరానికి కేదార ఘట్టమనీ, ఇలా అనేక ఘట్టాలు కాశీ గంగా తీరాన ఉన్నాయి. అందుకే ఇక్కడ గంగా స్నానమొనరించిన వారికి ముక్తీ, అన్నపూర్ణాదేవి కృప వలన బ్రతికినంత కాలమూ భుక్తీ తప్పక దొరుకుతాయి’’ అనే సారాంశంతో సూతమహర్షి కాశీక్షేత్ర మహిమను మునులకు తెలిపారు.
కాశీలో కొలువుండే విశ్వనాధ స్వామికీ, బిందు మాధవుడికీ, సమస్త దేవతలకూ అక్కడి నుండే వందనా లర్పించారు మునులంతా.
8
శివరాత్రి వ్రత మహాత్మ్యము
సూత మహర్షి చెప్తున్న శివ పురాణాన్ని వీనుల విందుగా వింటున్న శౌనకాదులు
‘‘మహానుభావా! పుణ్య చరితా! శివుడు స్వతః సిద్ధంగానే భక్త సులభుడు కద! అటువంటి అతడిని కలియుగ వాసులు మరింత త్వరగా ప్రసన్నం చేసుకునే మార్గమేదైనా ఉన్నదా?! అని ప్రశ్నించారు.
‘‘మునులారా! దీనికి సమాధానం శివపురాణంలోనే ఉన్నది. ‘మాఘ బహుళ చతుర్దశి’ అనగా లింగోద్భవ దినాన, పగలూ, రాత్రీ నియమబద్ధంగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించటం వలన శివుడు శీఘ్రంగా ప్రసన్నం చెందుతాడు’’ అంటూ సూత మహర్షి శివరాత్రి వ్రత విధానాన్ని తెలుపసాగారు.
‘‘శౌనకాదులారా! శివరాత్రి పర్వదినమైన మాఘ బహుళ చతుర్దశి నాడు ప్రాతఃకాలానే్న తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఆనాడు ‘శివరాత్రి వ్రతం’ అనగా ఉపవాస సహిత శివాభిషేకమూ, జాగరణా చేసి, జాగరణ సమయాన్ని పురాణ కాలక్షేపంలోనూ, శివనామ స్మరణలోనూ కాలం గడుపుతామని పరిశుద్ధాంతరంగులై ముందుగా సంకల్పం చేసుకోవాలి.
ఇంటికి పెద్ద అయిన గృహస్థుడు విభూతి ధారణ గావించుకుని, రుద్రాక్ష మాలలు ధరించాలి. శక్తి కలిగిన వారు ఆనాడు ‘మహాన్యాస’ పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పంచామృత, శుద్ధోదక, గంగాజలాలతో చేయటం ఎంతో పుణ్యప్రదం. శక్తిలేని వారు ఉత్త జలంతో అభిషేకం చేసినా చాలు. శివుడు నృత్యప్రియుడు కనుక సంగీత, నృత్య వాద్యాలతో రాత్రంతా శివనామ సంకీర్తనా, శివపురాణ శ్రవణాది సత్కా లక్షేపాలతో జాగరణం చేసి, ప్రొద్దుటే మళ్ళీ పునః పూజ చేసి వ్రత సమాప్తి గావించి బ్రాహ్మణులకి దక్షిణ తాం బూలాదులు సమర్పించిన తరువాత గృహస్థుడు బంధు మిత్రులతో కలిసి భుజించాలి .’’ అని మునులకి తెలిపారు సూత మహర్షి.
మహా శివరాత్రిగా పేరొందిన మాఘ బహుళ చతుర్దశీ దినాన మనసా వాచా కర్మణా ఆ పరమేశ్వరుని ధ్యానించే వారు ఆయన కృపకు పాత్రులవుతార న్నది తద్యము.
శివరాత్రి జాగరణకు రెండు ముఖ్య కారణాలు న్నాయి. ఒకటి లింగోద్భవ ప్రాదుర్భావం’’ అర్ధరాత్రి సమయం కావటమైతే, రెండవది, మహేశ్వరుడు ఆ సర్వమంగళ అయిన పార్వతి సమ్మతిపై క్షీరసాగర మదన సమయంలో ఉత్పన్నమయిన హాలాహలాన్ని తన గరళాన నిలుపుకుని ఆ విషాగ్ని జ్వాలలు రేపిన బాధననుభవించి ‘‘నీల కంఠుడవటము’’. ఆ దేవదేవుడు లోక కళ్యాణం కోసం పడిన బాధని మనం కూడా ప్రతి సంవత్సరమూ ఆయనతో పంచుకుంటామన్న సూచనగా మనం శివరాత్రి రోజున ఉపవాసముండి జాగరణ చేసి ఆయన్ను సేవిస్తాము. మాఘ మాసంలోనే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. మాఘ శుద్ధ ఏకాదశి నాటి రోజు ‘శివగౌరీ కళ్యాణం’ జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ శివాలయాలలో గౌరీ శంకర కళ్యాణోత్సవం జరుపుతారు. ఒకప్పుడు పరమానంద భరితుడయిన శివుడు దీర్ఘ ‘ఆనంద తాండవం’ చేసినదీ ఈ దినమేనంటారు. మాఘ మాసం కాక ఇతర మాసాల బహుళ చతుర్దశీ తిథిని ‘మాస శివరాత్రి’గా భావించుకుని శివపూజలు చేయటం మనకు సాంప్రదాయమయింది.
శివరాత్రిరోజు తెలియక చేసినా వ్రత ఫలాన్నిస్తాడు ఆ భోళాశంకరుడు. లింగోద్భవాన్ని గురించి మొదట్లోనే విశే్లషించుకున్నాం కనుక ఒకసారి పరమ శివుడి గరళ సేవన ఘట్టాన్ని కూడా నెమరు వేసుకుని ముందుకి సాగుదాం.

- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె