డైలీ సీరియల్

శివనామస్మరణం జన్మధన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపురాణ ప్రవచన సమయంలో సూతుల వారు బ్రహ్మ, కార్తికేయుడు, వాయుదేవుడు, నందీశ్వరాదులు తెలిపిన ఎన్నో విషయాలు శౌనకాది మునులకి వివరించారు. ప్రణవ మంత్రం గురించీ, శివపూజా విధానాన్ని గురించీ, లింగ ఆవిర్బావాన్ని గురించీ, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించీ విశదీకరించిన ఆయన, మానసిక పూజా వైశిష్టాన్ని గురించి కూడా మహర్షులకు తెలిపారు. మనసులో శివ రూపాన్ని నిలుపుకుని కనురెప్పల పరదాపై ఆయనను దర్శిస్తూ మనసులోనే ఆయనకు ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య. అర్ఘ్య, ఆచమన, పంచామృత స్నాన, శుద్ధోదక స్నానాదులు జరిపి వస్తయ్రుగ్మ, శ్రీగంధాది విలేపన, ధూప, దీప, ఛత్ర చామర సేవలు చేసి, నృత్య గీతాలతో ఆహ్లాద పరచి చివరకు హారతి కూడా మనసులో ఇవ్వగలగటం ఒక రకమైన పూజ కాగా, మనసులోనే లింగాభిషేకం చేస్తూ మనకు తృప్తినిచ్చినంత సేపు పంచామృత శుద్ధోదక గంగోదక జలాలతో అభిషేకం చేస్తున్న భావనతో ఉండటం మరో రకమైన మానసిక పూజ. ఇవేవీ లేకుండా ఆయన నిరాకార తత్వాన్ని ఏ ఆలోచనలూ లేక ఉపాసించటం అన్నింటికన్నా ఉత్తమమైన మానసిక పూజగా భావింపబడుతోంది. ఇదే నిరాకార ధ్యానమని సూత మహర్షి తెలిపారు.
***
పరమేశ్వరుని తత్వాన్ని ఆయన అర్థాంగి అయిన పార్వతి కన్నా బాగా అర్థం చేసుకున్న వారెవరూ లేరు. అందుకు కారణం ఆమెకు పరమశివుని నిరంతర బోధనలే! సతీదేవిగా తన తండ్రి అయిన దక్షునికి ఆమె శివుడి గొప్పతనాన్ని వివరించింది. నవవిధి నాయకుడైన కుబేరునికి అంత ఐశ్వర్యాన్ని ప్రసాదించి అనుగ్రహించిన ఈశ్వరుడు ప్రజలకు వైరాగ్యాన్నీ, అశాశ్వత జీవనాన్నీ ఎప్పటి కప్పుడు గుర్తు చేయటానికే భస్మధారిగా కపాలికుడిగా చరిస్తాడని ఆమె దక్ష ప్రజాపతికి బోధించింది. అలాగే సతిగా అవతారం చాలించి పార్వతిగా జన్మించి, శివుడి కోసం తపస్సు చేస్తూ ‘అపర్ణ’గా వాసికెక్కిన ఆమెను శివుడు పరీక్షింపదలచి బ్రహ్మచారి వేషాన్ని ధరించి వచ్చి శివుడిని (తనని తాను) అపహాస్యం చేసినప్పుడు కూడా ఆమె శివుడి వేషధారణనూ, సర్వజ్ఞతనూ వివరిస్తూ ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పిన తీరు అద్వితీయం.
మూడు కన్నుల ‘విరూపాక్షుడ’ని బ్రహ్మచారి శివుడిని పరిహాస మాడగా, మూడవ నేత్రమైన జ్ఞాన నేత్రమే ఆయన సౌందర్యమనీ, అది అందరికీ జ్ఞానాన్ని పంచుతుందనీ పార్వతి జవాబు చెప్పింది. అలాగే పాములనీ కపాలాలనీ, జంతు చర్మాలనీ, ఎముకలనీ, విభూతినీ ధరిస్తాడని బ్రహ్మచారి చేసిన ఎగతాళికి, అవన్నీ ప్రజలకు జగత్తంతా మిధ్య అనీ, చివరకు మిగిలేదీ ఎముకలూ, కపాలాదులూ, విభూతియే నని తెలపటానికి శివుడు ధరిస్తాడనీ, అలాగే పశు, పక్ష్య, మృగ, మానవ దేవాసుర గంధర్వులెవరైనా తనకు సమానమేనని తెలుపటమే ఆయన జంతు చర్మాలనీ నాగములనీ ధరించటంలోని ఆంతర్యమనీ తెలిపిన పార్వతి బ్రహ్మచారి వేషంలో శివుడు తనకు పెట్టిన పరీక్షలో నెగ్గింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు.
ఆ విషయమే వాయుదేవుడు నైమి శారణ్యంలోని మునులకి వివరించాడు. ఆ పరబ్రహ్మము అర్ధ నారీశ్వర స్వరూపంలో ఈ విశ్వాన్ని పాలిసు తన్నాడనీ, పరమేశ్వరుడికీ, ఆయన శక్తి స్వరూపిణియై ఆయన వామభాగాన నిలచిన పరమేశ్వరికీ, ఎంత మాత్రమూ బేధం లేదనీ, శివుడే శక్తీ-శక్తియే శివుడనీ, వాయుదేవుడు తెలిపాడు.
వేషధారణతోనే కాక తన మాటలతోనూ, వౌనం తోనూ కూడా ఎన్నో విషయాలు ఎందరికో బోధించిన ఈశ్వరుడు, పరమ గురు స్వరూపుడు కూడా!
శివాయ గురవే నమః
మేరు పర్వతంపైన దక్షిణ ముఖముగా కూర్చుని, పరమ విరాగులై సనక సనందన సనత్కుమార, సనత్సుజాతులనే ఋషులకు జ్ఞాన ప్రబోధను చేసిన శివుడు గురు స్వరూపుడిగా ‘దక్షిణామూర్తి’ అనే నామంతో వ్యవహరింప బడుతున్నాడు.
‘‘ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ శాంతాయ దక్షిణామూర్తయే నమః’’
ఒకప్పుడు సనకసనందనాదులు తమకు తగిన గురువు దక్షిణామూర్తియే అని నిశ్చయించుకుని ఆయన వద్దకు వచ్చి, జ్ఞానబోధ చేయమని ముమ్మారు ప్రదక్షిణ నమస్కారాలు చేసి మోకాళ్ళపై నిలచి ప్రార్థించారు.
శివుడు వారిని శిష్యులుగా గ్రహించి చిన్ముద్ర ధరించి వారికెన్నో విషయాలు బోధించాడు. ‘చిన్ముద్ర’ అనగా బొటన వ్రేలిపై చూపుడు వ్రేలుని నిలిపి ఉంచటం. బొటన వ్రేలుని భగవంతుడిగానూ, చూపుడి వ్రేలిని జీవుడిగానూ భావించి కలిపి, మిగిలిన మూడు వ్రేళ్ళనూ అహంకార, భ్రమ, చెడు ప్రవృత్తులుగా భావించి దూరంగా పెట్టాలనేదే ఈ ముద్రం అర్థం. చిన్ముద్ర జ్ఞాన స్వరూపానికి సంకేతం.
సనక సనందనాదులకూ, నందీశ్వర, గణపతి, కార్తికేయులకు లక్ష శ్లోకాలలో ‘శివ మహా పురాణం’గా తన పరమేశ్వర, మహేశ్వర, ఈశ్వర, రుద్ర, లింగ స్వరూపాల గురించీ, పరమేశ్వర తత్వాన్ని గురించీ బోధించిన మహాగురువు పరమేశ్వరుడు. అలాగే శ్రీరాముడికి రామ రావణ యుద్ధ సమయాన ఆయన చేసిన ఉపదేశమే ‘శివగీత’ గా ప్రఖ్యాతి చెందింది. తన అర్థాంగి అయిన పార్వతికి విష్ణు సహస్రనామ సూక్ష్మరూపమైన శ్రీరామ తారక మంత్రమూ, లక్ష్మీ అష్టోత్తర శత నామమూ ఆదిగా గల స్తోత్రాలనూ ఉపదేశించిన పరమ గురువు పరమ శివుడు. బ్రహ్మ విష్ణువులకు ప్రణవ, పంచాక్షరీ మంత్రాలను ఉపదేశం చేసినది కూడా ఆ మహనీయుడే!
వేదాంత వేద్యుడైన ఆ పరమేశ్వర చరిత్రాన్ని వేద వ్యాస మహర్షి ఏడు సంహితలైన విద్యేశ్వర, రుద్ర, శతరుద్ర, కోటిరుద్ర, ఉమా, కైలాస, వాయవీయ సంహితలలో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో విరచించారు

- ఇంకావుంది...

చరవాణి: 9676926171