డైలీ సీరియల్

మహదైశ్వర్య లోకమది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశ్వరస్తుతి
ఎవరి ఇల్లాలు జగన్మాతయో, సంతానం సమస్త జీవరాశులో, భాషణం వేదాలో, విహారప్రదేశాలు మునుల హృదయపద్మాలో, సేవకులు బ్రహ్మ-విష్ణువులో అట్టి దేవోత్తముడైన ఆ మహాత్ముని కీర్తించడం ఎవరికి తరం?
షష్ఠ్యంతాలు
ఆ దేవదేవుడు సకల శుభగుణశాలి. సకల ప్రపంచాన్ని తన కంటె భిన్నంగా మరియు అభిన్నంగా ప్రకాశింపచేసే పరంజ్యోతి. నాదబిందుకళల కంటే అతీతమైన సర్వేశ్వరుడు.
బహుముఖంగా ప్రవహించే సువర్ణముఖీనదీ తీర శీతలశిలాతలాలపై నిలిచి తపస్సు చేసే మునుల హృదయాంతరాళాలలో (నిర్వికల్పసమాధిలో) మరియు హృదయబహిరంగాలలో (సవికల్ప- సమాధి) రాత్రింబవళ్ళు పరిపూర్ణంగా నిండి దర్శనమిచ్చే కరుణామయుడు.
వాక్కు-పాణి-పాద-పాయు-ఉపస్థలనే మదించిన మత్త్భాలకు ఆయన కొదమసింగం. సంసారమనే నాగరాజును సంహరించు వాడియైన ముక్కుగల గరుత్మంతుడు. కనుకొలకులతో కరుణారస తరంగిణిని (నదిని) నాట్యమా డించే మహానటశేఖరుడు.
జ్ఞానప్రసూనాదేవి కుచోన్నత మంజరులపై పారవశ్యంతో నిరంతరం సంచరించే భృంగరాజు (రాజ తుమ్మెద). సంధ్యాసమయంలో మహాతాండవనాట్యాన్ని చేసే మహానటరాజశేఖరుడు.
సత్త్వ-రజ-స్తమోగుణాలకు వశమై విష్ణువు తాను క్రీడావిలాసంగా మరల మరల నిర్మించిన ఈ సర్వ జగత్తును సంహారం చేయడానికి బద్ధకంకణుడైనవాడు. సంసారమనే పాశాన్ని త్రెంచే భవ- హరమూర్తి.
అట్టి కళ్యాణగుణ విరాజితుడైన శ్రీకాళహస్తీశ్వరుడికి సమర్పితంగా నేను వ్రాయబూనిన శ్రీకాళహస్తి మహాప్రబంధంలో ఆ మహాదేవుని కథావినిర్మాణానికి ప్రధానస్థానమైన శ్రీకాళహస్తి పట్టణం ఎట్టిదంటే.
శ్రీకాళహస్తిపుర వర్ణన
శ్రీకాళహస్తిపట్టణంలో వెలసియున్న శ్రీవాయులింగం సాధకులకు మోక్షరూపమైన అమృతత్త్వ సిద్ధిని అనుగ్రహించే సమస్త అమృతలింగాలకు గొప్పగని. దాని మహిమ ఇట్టిదని చెప్పడం ఎవరికి సాధ్యం? ఆ లింగం సంసారమనే పాదరసాన్ని నశింపచేసే అగ్నిజ్వాల. పాపాలనే రాగిలోహాన్ని భస్మం చేసి గంధకం. (గంధకం రాగిని ధ్వంసం చేసే లక్షణం కలది). కోరికలనే తీగల వేళ్లను పెల్లిగించే గునపం. సంకల్పాలనే రాళ్లను పగుల గొట్టే సుత్తి, శరీరమే ఆత్మ అను దేహాత్మాభిమాన రూపమైన వరిపంటను తినివేయగల వృషభరాజు. దైవమున్నదా? అనే సందేహ సర్పాన్ని చంపగల ముంగిస. త్రుళ్ళిపడే మనస్సు అను పొగరుబోతు ఎద్దుకు పొగరడంచగల ముకుతాడు. క్రోధంతో చూచే చూపులనే బాణాల్ని పగులగొట్టే బండరాయి. జగద్గురువులు-పరమహంస శ్రేష్ఠులు ఉపదేశించిన నిర్గుణ బ్రహ్మ (ఆకారరహితమైన దైవం) ధ్యానమార్గాన్ని అవలంబించి నిరంతరం ఆ నిర్గుణబ్రహ్మను హృదయంలో ధ్యానం చేస్తూ సాటిలేని బ్రహ్మానంద పారవశ్యవైభవం చేత సంపన్నులై నిత్యమూ యోగసాధనలు చేసే మహాపురుషులకు నిలయమైనది, అమృతత్త్వాన్ని ప్రసాదించు మహిమాన్వితమైన మహాలింగాలకు గనియైనది శ్రీకాళహస్తిపట్టణం.
ఆ పట్టణ దివ్యవైభవాన్ని ఎవరు మాత్రం పొగడగలరు? ఆరు ముఖాలతో ప్రకాశించే కుమార స్వామి దివ్యతేజస్సేమో అనే విధంగా శ్రీకాళహస్తిలో వీథివీథిలోని దివ్యభవనాలు బంగారు రత్న- కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. చర్మచక్షువులకే కాదు మనోనేత్రాలకు కూడ దుర్లభమైన బ్రహ్మానందమనే మహాసముద్రం లో తేలియాడించ గల మహాద్వీపమో అనే విధంగా ఆ కాళహస్తి ప్రకాశిస్తూ ఉంటుంది.
ప్రాకారవర్ణన
తరతరాలుగా వస్తున్న మహైశ్వర్యంతో తులతూగే ఆ పట్టణం చంద్రకాంతశిలలతో వినిర్మితమైన ఆ పట్టణప్రాకారమందు ప్రతిబింబించగా అది మాయాప్రభావం చేత బహువిధాలుగా భ్రాంతిని గొలిపే అద్భుతమైన వస్తుజాలాన్ని జనింపచేసే వైభవాన్ని తనలో ఇముడ్చుకున్న సాక్షాత్తు శివుడేమో అనే విధంగా మెరిసిపోతూ ఆ పట్టణసౌందర్యం మనస్సుచేత కూడ ఊహింపరానిదిగా ఉంటుంది.
అట్టి శ్రీకాళహస్తి పట్టణం ఈ భూలోకంలోనే సమున్నతమైనది. కారణమే మంటే ఈ దివ్యభూమిని సామా న్యంగా పై పైన దర్శించినవారు సామాన్యమైన పురుగే కాని, శ్రీమహావిష్ణువేగాని, బహుజీవ- హంతకుడే గాని, బలగర్వంచేత విఱ్ఱవీగే వాడే గాని వారు తమ పూర్వజన్మ సంబంధమైన పాపపంకిలం నుండి విముక్తులై మోక్షసామ్రాజ్యనిధిని కొల్లగొట్టుకొని పోతున్నారు. ఇక ఈ దివ్యపురవైభవాన్ని తు.చ. తప్పకుండ ఎవరు వర్ణింపగలరు? వారు చేసేదేదైనా ప్రతి దాన్ని శివార్పణం చేస్తూ చేస్తుంటారు. ఇక చేయంచేవాడు, చేసేవాడుఒకరే అయతే దానిలో లాభమూ నష్టమూ ఏముంటుంది. పైగా శివాంశసంభూతులే చేస్తుంటారు కనుక అంతాశివానందమే వెల్లివిరిసి ఉంటుంది. వాళ్లు జీవించేది
నిత్యముక్త ప్రజలు
అందుచేతనే అచటి ప్రజలు నిత్యముక్తులు. ఆ కారణంగా వారు శారీరక ధర్మానుసారం లౌకికభోగాలననుభవిస్తూ కూడ పారలౌకిక దృష్టిని విడువరు. వారు ఏపని చేసినా అందులోని మర్మం వారు బాగా ఎరుగుదురు. మర్మం తెలిసి శ్రమిస్తే ఇక వారికి శివానుగ్రహం లభ్యమవకఏవౌతుంది? కాబట్టి ఆ నగరంలో గల రమణీయోద్యాన వనాలే వారికి తపోవన భూములు. వధూకుచాలే క్రీడా పర్వతాలు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512