డైలీ సీరియల్

భవబంధనాశకారి శివనామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వనం పేరు చెప్పినంతనే ఇతరవనాలు తాము దావానలం (అడవులలో వ్యాపించే అగ్ని) చేత దహింపబడి పోయినట్లుగా భయకంపితమైపోతాయి.
శబర స్ర్తిల కుచాలతో సామ్యం వహించామని గర్వంతో మదించిన కుంభస్థలాలతో ఆ అడవిలో విహరించే ఏనుగుల గర్వమంతా అణగిపోయిందని బుజ్జగించి చెబుతూ ఆ వనంలోని శబరులు వేటాడిన ఏనుగుల కుంభస్థలాల్ని పగుల గొట్టి అందులోని రక్తం చేత ఎర్రనయిన ముత్యాల్ని తెచ్చి తమ భార్యలస్తనాలపై అలంకరిస్తూ ఉంటారు.
అట్టి రమణీయ భయానకమైన వనం పేరు గజకాననం. అచట పూర్వం వసిష్ఠుడు తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడయ్యాడు. ఆ కథ చెప్తాను. విను.
పరమేశ్వరుడు వసిష్ఠుడికి ప్రసన్నుడగుట
ఒకప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని కుమారులైన నూరు మందిని చంపివేసాడు. ఆ కారణంగా అంతులేని దుఃఖాన్ని పొందిన వసిష్ఠుడు ఒక గిరి శిఖరాన్ని ఎక్కి క్రిందికి దూకాడు. కాని ఆయన క్రిందబడి మరణింప కుండ భూదేవి ఆయనను బంతి పట్టుకొన్న విధంగా పట్టుకొని కలిగిన దుఃఖం తొలగిపోయే రీతిగా ఇట్లు పలికింది. ‘ఓ అమా యకుడా! కొడుకులు మరణించా రనే దుఃఖంతో ఈ రీతిగా చావునకు సిద్ధమైతే ఈ జన్మ అంతమై పోతుం దా? నిజంగా నీకు మనస్సులో సంసారం మీద విరక్తి కలిగితే పార్వతీ రమణుడైన ఆ మహాదేవుని భక్తితో సేవించు. జీవన్ముక్తి నీకు లభిస్తుంది.’ భూదేవి యుపదేశవాక్యాల్ని విని వసిష్ఠుడు బహు జన్మపరంపరల నుండి క్రమంగా వస్తూ ఉన్న పాప పుణ్య కర్మవాసనలకు నిలయమైన తన హృదయపద్మాన్ని ఉమాపతికి సమర్పించి దాని వలన కలిగిన బ్రహ్మ తేజస్సుతో తపమారంభించాడు.
ఆ కాలంలో ఆయన తన గురుపాద పద్మయుగళమనే గొడుగు నీడలో సూర్యుని ఎండకు బాధపడలేదు. చంద్ర శేఖరుడి మీద లగ్నమైన ధ్యానం వలన వర్షించే అమృతధారల చేత ఆకలిబాధనే ఎరుగలేదు. సకల శరీరావయవాలపై పూసు కొన్న విభూతి అనే అంగవస్త్రం చేత తేళ్లు - పాములు మొదలైన విషజంతువుల బాధలకు గురికాలేదు. ఘనమైన భక్తియనే లోతైన గోతిలో దృఢంగా పాతుకొనిన మనస్సు అనే స్తంభం గల శరీరమెటువంటి గాలితాకిడికి గురికాలేదు. ఆ రీతిగా వసిష్ఠుడు ఏ యుపాయాల చేత కూడ పట్టుపడకుండా స్వేచ్ఛంగా సంచరించే సంసారవ్యామోహమనే జంబుకాన్ని పట్టి వెంటనే చంపాలను సంకల్పంతో రాజయోగమనే వలల్ని పన్ని పట్టుకొనే తలంపుతో వసిష్ఠుడు తపస్సు చేసాడు.
ఆ విధంగా ఘోరతపస్సు చేస్తున్న వసిష్ఠుని వద్దకు చేరి వనగజాలు తమ తుండాలనిండా నీరు గ్రహించి ఆయనకు జలాభిషేకం చేసాయి. చామరీమృగాలు తమ వాలాలనే (తోకలు) వీవనలతో మెల్లగా వీచసాగాయి. కోతులు పండ్లు తెచ్చి కానుకలుగా సమర్పించాయి. కిరాత స్ర్తిలు ప్రీతితో సేవలు చేయసాగారు. ఆ రీతిగా దైవోపచారాలు అయాచితంగా లభింపగా వసిష్ఠుడు తపస్సు అనే రాజసింహాసనం మీద కూర్చుండి తపమాచరించాడు. ఆ సమయంలో ఆయన మదించిన ఏనుగుల గుంపులు తన గండస్థలాలకున్న దురదను పోగొట్టుకొనడానికై వినియోగపడే బండరాయిగా అయ్యాడు. మంచి గంధపు చెట్ల బోదెలలో స్వేచ్ఛగా తిరిగే భయంకర సర్పాలకు మంచిగంధపు మాను అయ్యాడు. చిలుకల-గోరువంకలు గుంపులుగా వచ్చి అచటనే జంటలు కట్టి క్రీడించడానికి నెలవు అయ్యాడు. అయినా ఆ ముని మనస్సు చలింపలేదు. స్థిరచిత్తంతో తపస్సు చేయసాగాడు.
కొంతకాలానికి వసిష్ఠుడు చేసిన తపస్సునకు మెచ్చి శివుడు కడు సంభ్రమంతో భువికి దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో తన వాకిటనే వేచి కాచియున్న విష్ణువు-బ్రహ్మ మొదలైన ఇతర దేవతాగణాల్ని తన వెంటరమ్మని ఆజ్ఞాపింప తలంపలేదు. పార్వతీదేవి సుందర దరహాస ముఖారవిందాన్ని చూచే ఆసక్తిని కూడ కనబరచలేదు. సమీపంలోనే ఉన్న కుమార-విఘ్నేశ్వరుల్ని కూడ కనె్నత్తి చూడలేదు. కేవలం భక్తుల హృదయాలలోని భక్తి అనే కన్యారత్నాన్ని మాత్రమే పెండ్లాడాలనే కుతూహలంతో ఆ పార్వతీరమణుడు మనోదృష్టికి సహితం అగోచరమై కొంచెం కూడ ఎడంలేక దశదిశల వ్యాపించిన ఒకానొక తేజస్సు నుండి తెరలు తొలగిన రీతిగా పంచభూతాలు (నింగి-నేల- నిప్పు-నీరు- గాలి) పంచేంద్రియాలు (చర్మం-కళ్లు- చెవులు- నాలుక-ముక్కు) పంచక్లేశాలు (అవిద్య- అస్మిత-రాగ-ద్వేష- అభినివేశాలు) పంచకోశాలు (అన్నమయ- ప్రాణమయ- మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయాలు) పంచవిషయా లు (రూప- రస- గంధ-స్పర్శ-శబ్దాలు) అనే ఈ ఐదువర్గాలతో నిర్మింపబడ్డ ఈ మహాప్రపంచాన్ని పంచుకొని భక్షింపతలంచి తన పంచముఖాలతో ఆ మన్మథాంతకుడు కుబుసమును విడిచిన సర్పాకృతిని దాల్చి పరమదివ్యలింగాకారంతో పశ్చిమాభి ముఖుడై ప్రసన్నవదనుడై వసిష్ఠమునికి దర్శన మిచ్చాడు.
‘ఓ మునివర! నీ తపస్సునకు మెచ్చాను. నీకిష్ఠమైన వరాలను కోరుకో!’ అని శివుడు అనుగ్రహభాషణం చేయగా హిమగిరి సుతపతి మాటల్ని విని భయం-్భక్తి తన మనస్సులో సందడి చేయగా సంతోషంతో కన్నులు విచ్చి చూచాడు వసిష్ఠుడు. అయినా దిక్కులంతటా వ్యాపించిన మహా తేజస్సుతో ప్రకాశించే ఆ మహేశ్వరుణ్ణి భయంచేత గలిగిన బెదురు చూపులతో శరీరమంతట గగుర్పాటు తనమేర్పడి వణికిపోతూ మనస్సులో కలిగిన సంతోషం- తొట్రుపాటుతనం చేత నుదుట చెమటపట్టగా తడిసిన నుదిటిమీద చేతులు జోడించి వసిష్ఠుడు ఈ విధంగా పలికాడు.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512